శ్రీ జగన్‌రెడ్డి రాజకీయ కుట్రలో బీసీలు పావులుగా మారవద్దు
శ్రీ ఇన్నేళ్లుగా కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదు?
శ్రీ వైసీపీ ఎంపీలతో పార్లమెంట్‌లో కులగణనపై ఎందుకు మాట్లాడిరచలేదు?
శ్రీ 76 మంది బీసీ నేతల్ని దారుణంగా చంపించి, వేలమందిని తప్పుడు కేసులతో జైళ్లకు పంపిన జగన్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తాడా?
అమరావతి: బీసీ కులగణనపై సీఎం జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయ కుట్రలో భాగంగానే అసమగ్రంగా కులగణన చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాటా డుతూ అర్హులైన లబ్ధిదారులకు ఫ్రభుత్వ ఫలాలు అందా లంటే సామాజికవర్గాల వారీగా ప్రజల వివరాలు పాల కులకు తెలియాల్సి ఉందన్నారు. అలా తెలిస్తేనే తదను గుణంగా ప్రభుత్వం వారి సంక్షేమానికి బడ్జెట్‌లో నిధు లు కేటాయించి, తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 1881 నుంచి 1931 వరకు ఐదుసార్లు బ్రిటీష్ ప్రభు త్వం దేశజనాభా లెక్కిస్తే, అందులో కులాలవారీగా కూడా వివరాలు సేకరించారు. స్వాతంత్య్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా ఖలేల్కర్ కమిషన్ కూడా సంక్షేమపథకాల అమలు, సమాజంలో వివిధ వర్గాల విభజన సక్రమంగా జరగడం కోసం కులగణన అవ సరమని స్పష్టంగా చెప్పింది. 1979లో వచ్చిన మండ ల్ కమిషన్ కూడా ఇదే విధమైన వాదన వినిపించిం దని కాలవ తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం
దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగా లని ఇప్పటికి 253కమిషన్లు సిఫార్సు చేశాయి. చంద్ర బాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014లోనే కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇన్ని సిఫార్సులున్నా..ఇంత మంది డిమాండ్ చేస్తున్నా కేంద్రం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. బలహీనవర్గాలు విద్య, ఉద్యోగాల్లో 27శాతా నికి మించి ప్రతిఫలం పొందలేకపోతున్నాయి. కాకా ఖలేల్కర్ కమిషన్,మండల కమిషన్ ఆనాడు బీసీ కులా ల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసినందున కులాల లెక్కలు సరిగా లేకుండా పోయాయని కాలవ అన్నారు.
జగన్ రాజకీయ అవకాశవాదం
జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల అనంతరం ఖాయం గా ఇంటికి పోతాడు. ఈ నేపథ్యంలో కులగణన ముసుగులో బీసీలను వంచించడానికి కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. బీసీల కులగణనపై పదేపదే తేదీలు మార్చాడు. కులగణన పేరుతో సేకరిస్తున్న లెక్కల్లో ప్రజల వేలిముద్రలు వేయించుకుంటూ, ఓటీపీలు కూడా అడుగుతున్నారు. ఇంత హడావుడిగా కచ్చితమైన వివరాలు లేకుండా, జగన్ రెడ్డి చేయిస్తున్న కులగణన కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం తప్ప, వాస్తవంగా బీసీలకు మేలు చేయడానికి కాదు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందడానికి జగన్ చేస్తున్న రాజకీయ కుట్రతప్ప, నిజంగా కులగణనపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి, ఆసక్తి లేవు. నిజంగా ఆయనకు బీసీలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే, వైసీపీ ఎంపీలు కులగణనపై ఎన్నిసార్లు మాట్లాడారో, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. 22 మంది సభ్యులు లోక్‌సభలో వైసీపీ తరుపున ఉన్నా.. ఏ రోజైనా వారు కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అడగాల్సిన చోట అడగకుండా.. మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకుండా బీసీల కులగణన పేరుతో కుట్రలు చేయడం అనేది జగన్ రెడ్డి రాజకీయ అవకాశవాదం తప్ప మరోటి కాదని కాలవ విమర్శించారు.
జగన్ రాజకీయ కుట్రలకు బీసీలు బలికావద్దు
జగన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలోని బీసీలకు న్యాయం జరుగుతుందనడం అపోహే. వైసీపీ ప్రభుత్వం బీసీలను అడుగడుగునా అణగదొక్కుతోంది. 76 మంది బీసీ నాయకుల్ని అతి కిరాతకంగా హతమార్చిన ప్రభుత్వం ఇది. వేలమంది బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, వారంతా జైళ్లలో మగ్గిపోయేలా చేసిన పెత్తందారీ ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే నిధులు…విధులు…నియామకాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. బీసీల గళం రాష్ట్రస్థాయిలో మార్మోగడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని బీసీలు.. జగన్ రెడ్డిని నమ్మి, అతని రాజకీయ కుట్రలకు బలికావద్దని కోరుతున్నాం. రాజకీయలబ్ధి కోసం జగన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలో బీసీలు ఎవరూ పావులు కావద్దు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే వెనుకబడిన తరగతుల సంక్షేమం, సంతోషం, రెట్టింపు అయ్యేలా అనేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కాలవ శ్రీనివాసులు తెలిపారు.