కడప : తన భర్త వివేకానందరెడ్డి హంతకుల్ని జగన్ కాపా డుతున్నారని.. ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించా మని వివేకా భార్య సౌభాగ్యమ్మ ఒక ప్రముఖ దినపత్రికలో శుక్రవారంనాడు ప్రచురితమైన ఇంటర్వూలో సంచ లన వ్యాఖ్యలు చేశారు. హత్య గురించి జగన్‌కు ఆరోజు ఉదయమే తెలిసినా సాయంత్రం వరకు శవం వద్దకు రాకపోవటాన్ని ఆమె ఎత్తి చూపారు. విచారణలో జరుగుతున్న జాప్యం, నిందితులకు లభిస్తున్న రక్షణ, న్యాయం కోసం పోరాడుతున్న కూతురు సునీత ఎదు ర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరంగా మాట్లా డుతూ సౌభాగ్యమ్మ తన ఆందోళనను వెలిబుచ్చారు.
2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడిరచారని, ఎన్నో ఇబ్బందులు పెట్టి పక్కకు తోసేయా లని భావించారని.. ఆ కక్షను గ్రహించలేకపోయామని సౌభాగ్యమ్మ బాధతో అన్నారు. వైఎస్‌ఆర్ ఉన్నంత వరకు తమ మధ్య అనుబంధాలు బాగానే ఉన్నాయని.. ఆయన మరణించాకే కుట్రలు, కుతంత్రాలు మొదల య్యాయని ఆమె అన్నారు.
వివేకా స్మారకసభ పెట్టుకోవటానికి మాకే పులి వెందులలో కల్యాణమండపం దొరక్కుండా చేశారని, అందుకని కడపకు మార్చుకోవాల్సి వచ్చిందని.. మా పరిస్థితే అలా ఉంటే ఇక సామాన్యుల మాటేంటని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలి
జగన్‌రెడ్డి పాలన బాగా లేదు.. ప్రజావేదిక కూల్చే సినప్పుడే ఏంటీ పరిపాలన అనుకున్నాను. వచ్చే ఎన్నిక ల్లోనైనా మంచి నాయకుడు పాలకుడిగా రావా లని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు మంచి పరిపాలన అందిం చే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నానని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ స్పష్టం చేశారు. నేను ఏదీ కోరుకోలేదు.. రాజకీయ ప్రవేశంపై సమ యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను.. జగన్‌కు ఓటు వేయొద్దని నా కుమార్తె సునీతతోపాటు నేనూ పిలుపు నిస్తున్నానని సౌభాగ్యమ్మ స్పష్టం చేశారు. జగన్‌కు ఓటు వేయొద్దంటూ వివేకా భార్య, కుమార్తె ఇద్దరూ స్వయంగా పిలుపు ఇవ్వటం కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.