చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పింఛన్‌దారుల మరణాలకు జగన్‌దే బాధ్యత

సీఎం పదవి నుంచి తక్షణం వైదొలగాలి

by చైతన్యరధం
Apr 6, 2024 at 7:24am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పింఛన్‌దారుల మరణాలకు జగన్‌దే బాధ్యత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయ స్వార్థంతో కుట్రలు చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు
  • శవాలతో నీచ రాజకీయాలు జగన్‌ నైజం
  • అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పింఛన్‌
  • పెంచబోయే పింఛన్‌ ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకూ వర్తింపు
  • ప్రతి ఇంటికీ పెద్ద కొడుకునవుతా….నేరుగా ఇంటికే పింఛన్‌ అందిస్తా
  • వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం
  • నాది సమాజ హితం….జగన్‌ది స్వార్థం
  • మీడియా సమావేశంలో చంద్రబాబు

నల్లజర్ల(చైతన్యరథం): రాజకీయ కుట్రతో పింఛన్‌దారుల మరణాలకు కారకుడైన జగన్‌ సీఎం పదవికి రాజీనామా చేసి తక్షణమే వైదొలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. రాజకీయ కుట్రలతో ప్రజల ప్రాణాలు తీస్తూ జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో శుక్రవారం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో చేసే మంచి పనులతో ఓట్లు అడగాలి…కానీ తప్పుడు ప్రచారాన్ని చేసి లబ్ధిపొందడం సరికాదని హితవు పలకారు. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయాలు ఉన్నాయని విమర్శించారు. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. గత ఎన్నికల్లో బాబాయిని చంపి నెపం మాపై నెట్టి సానుభూతితో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వృద్ధులను చంపేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ కుట్రలో అధికారుల పాత్ర కూడా ఉంది. 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్‌ ఎందుకివ్వలేదు. ఓడిపోతామన్న భయంతోనే అప్పు తెచ్చిన డబ్బులను సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టారు. మార్చితో బడ్జెట్‌ ముగుస్తుంది…దీంతో ముందే నిధులు ఖాతా నుండి తీసుకోవాలి. దీన్ని ముందే గమనించి డబ్బులు డ్రా చేసి పింఛన్లు అందిస్తే ఇబ్బందులు ఉండవు. స్వార్థ రాజకీయాల కోసం ఖజానా ఖాళీ చేసి 1వ తేదీన పింఛన్లు ఇవ్వలేదు.

ఏప్రిల్‌ 3వ తేదీన ఇస్తామని మార్చి 27నే సర్క్యులర్‌ ఇచ్చారు. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేయించొద్దని మాత్రమే ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయించుకోవచ్చని చెప్పింది. వాలంటీర్లతో పంపిణీ వద్దని చెప్పింది తప్ప.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌ చెప్పలేదు. పిం ఛన్ల పంపిణీ వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మార్చి 30వ తేదీన ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ నేతలు వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పథకం చేశారు. ఇన్నాళ్లూ పార్టీ మీటింగ్‌లకు జనం రాకపోతే పథకాలు తొలగిస్తూ…వాలంటీర్లతో బెదిరించారు. రాజీనామా చేసిన వాలంటీర్ల నియామకాలపైనే తన తొలిసంతకం అని జగన్‌ సిగ్గులేకుండా చెప్పాడు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని మేము మొదటి నుండి కోరుతున్నాం. వాలంటీర్‌ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు…మేము వచ్చిన తర్వాత కూడా వ్యవస్థను కొనసాగిస్తాం. మంచి చదువున్న వారికి మెరుగైన భవిష్యత్‌ కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చే ప్రసక్తే లేదు. వైసీపీ నేతలు వాళ్ల రాజకీయం కోసం వాలంటీర్లను ఇబ్బంది పెడుతున్నారు. వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా? నా హయాంలో పంచాయతీ, రెవెన్యూ అధికారులతో పింఛన్లు పంపిణీ చేశాను.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

నేడు రాష్ట్రంలో 1.35 వేల మంది వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ఉన్నారు. వారితో పింఛన్లు అందిస్తే ఒక్క రోజులోనే ఇవ్వొచ్చు. నేను ఇటీవల సీఎస్‌, ఈసీతో కూడా మాట్లాడాను…పంపిణీ చేసే వ్యవస్థ ఉంది…ఈ ప్రభుత్వం కావాలనే వృద్ధులను ఇబ్బంది పెట్టేందుకు చూస్తోందని చెప్పా. ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందిస్తామని సీఎస్‌ చెప్పారు…మరి ఎందుకు చేయలేదు? 1వ తేదీన ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. 3వ తేదీ ఉదయం నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించి, సాయంత్రం అరకొరగా డబ్బులు విడుదల చేశారు. రెండు రోజుల పాటు పింఛన్‌దారులను సచివాలయాల చుట్టూ పదేపదే తిప్పించుకున్నారు. కదలలేని స్థితిలో ఉన్నవారికి ఇంటివద్దనే పింఛన్లు ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ అబ్ధిదారులను మంచాలు, వీల్‌చైర్లో తీసుకురావడం రాజకీయ విన్యాసం కాక మరేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

పింఛన్లపై పేటెంట్‌ హక్కు టీడీపీదే
గతంలో ఎన్టీఆర్‌ రూ.30లతో పింఛన్‌ విధానాన్ని తెచ్చారు. తర్వాత నేను రూ.75 చేశా…2004లో రాజశేఖర్‌ రెడ్డి వచ్చి రూ.200 చేశారు. 2014లో నేను మళ్లీ వచ్చాక రూ. 200 ఒకేసారి రూ.1000 చేశాను. ఖర్చలు పెరిగాయని ఆలోచించి రూ.2 వేలు చేశాను. జగన్‌ వచ్చాక ఇచ్చింది ఎంత.. ఐదేళ్లలో వెయ్యి పెంచారు. పింఛన్లపై పేటెంట్‌ హక్కు టీడీపీదే. టీడీపీ హయాంలో ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పి ఆదుకున్నా. ఒక నెలలో తీసుకోకపోయినా మరో నెలలో తీసుకునే వెసులుబాటు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడున్నా పింఛన్‌ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చా. కానీ జగన్‌ నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించారు. దీనిపైనా ఈసీ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కోడ్‌ వచ్చాక ప్రభుత్వ అధికారాలు పరిమితిలో ఉంటాయి. వాలంటీర్లు లేకపోతే పంచాయతీ, సచివాలయ అధికారులు ఏమయ్యారు.? ఒక్కొక్కరు 50 ఇళ్లకు ఇవ్వొచ్చు…ఎందుకు ఇవ్వలేదు.? సైకో సీఎం ఇవ్వొద్దని అడ్డుపెడితే అధికార యంత్రాంగం ఆగిపోతుందా? జగన్‌ తో సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ధనుంజయ్‌ రెడ్డి, సెర్ప్‌ సీఈవో మురళీధరెడ్డి కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు తీశారు.

సీఈసీ దీనిపై విచారణ చేయాలి. నేను మెగా డీఎస్సీపై తొలిసంతకం పెడతానని చెప్పా…జగన్‌ వాలంటీర్ల నియామకాలపె సంతకం పెడతా అన్నాడు. నాది సమాజ హితం..జగన్‌ ది స్వార్థం. దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టి దాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం అత్యంత నీచం. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వమే కుట్రలు చేసి ప్రజల ప్రాణాలు తీసి ప్రతిపక్షాలపై నెట్టి నీచరాజకీయం చేస్తోంది. వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం ఇచ్చి పేరు తెచ్చుకుంటుంది. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెట్టడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

పెంచబోయే పింఛన్‌ ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకూ వర్తింపు
అధికారంలోకి రాగానే అర్హులకు రూ.4వేల పెన్షన్‌ ఇవ్వబోతునున్నాం. మేము పెంచబోయే పింఛన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు కూడా వర్తిస్తుంది…మూడు నెలలకు పెరిగే పింఛన్‌ మొత్తం రూ.3 వేలను జూలై నెలలో రూ.4 వేలతో కలిపి ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పథకం ఇవ్వడం నా బాధ్యత. జగన్‌ మాయల ఫకీరు కంటే దారుణం. ఎప్పుడు వచ్చి ఎవరి నెత్తిన చేయిపెట్టి, ఎవర్ని శవం చేస్తాడో తెలీదు. డప్పు కళాకారులకు పింఛన్‌ తొలగించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా ఇంటికొచ్చి పింఛన్‌ అందిస్తా. ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజలకు వివరిస్తాం. సైకోలు తాత్కాలికంగా ఆనందపడతారు…కానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. బకాసురుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, ఎంతో మంది రాక్షసులను చూశాం..వాళ్లు కూడా చివరకు శిక్ష అనుభవించారు. జగన్‌ ఒక దుర్మార్గుడు. స్వార్థం కోసం ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాగాన్ని ఉపయోగించుకున్నారు. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే…తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.

Previous Post

కష్టాల్లో తోడుగా ఉంటాం

Next Post

నేడు పల్నాడులో చంద్రబాబు పర్యటన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

కార్యకర్త
@ April 10, 2026
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి
ఆంధ్రప్రదేశ్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..
ఆంధ్రప్రదేశ్

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ
ఆంధ్రప్రదేశ్

మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ

చైతన్యరధం
@ April 10, 2026
లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
ఆంధ్రప్రదేశ్

లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా
ఆంధ్రప్రదేశ్

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist