- అంగన్ వాడీ సెంటర్లను బద్దలు గొట్టే అధికారం ఎవరిచ్చారు?
- అంగన్ వాడీ వర్కర్లకు యువనేత లోకేష్ సంఫీుభావం
యలమంచిలి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నారో అర్థం కావడం లేదని యువనేత నారా లోకేష్ మండి పడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పనికట్టుకుని వేధించడం దారుణమన్నారు. అంగన్ వాడీ సెంటర్ల తాళాలు బద్ధలు గొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. టిడిపి-జనసేన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తాం. అంగన్వాడీ యూనియన్లతో చర్చించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితులు రాకుండా చూస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి శివార్లలో యువగళం పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలు గురువారం యువనేత లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్ల ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రభుత్వం తమ పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందారు. డిమాండ్ల పరిష్కారం కోసం తాము సమ్మె చేస్తుంటే, వాలంటీర్లతో అంగన్ వాడీ సెంటర్ల తలుపులు బద్దలగొట్టి స్వాధీనం చేసుకున్నరన్నారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. అంగన్ వాడీలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని లోకేష్ కు అందజేశారు. అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలి. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి..వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి..మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలి..ప్రీస్కూల్ ను బలోపేతం చేయాలి. హెల్పర్ ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా ఇవ్వాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేవరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2017 నుండి పెండిరగ్ లో ఉన్న టీఏ, ఇతర బకాయిలు విడుదల చేయాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కాగా అంగన్వాడీల వినతిపై లోకేష్ స్పందిస్తూ అంగన్వాడీలు చేస్తున్న న్యాయబద్దమైన పోరాటానికి తెలుగుదేశంపార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు యువనేత లోకేష్ సంఫీుభావం తెలిపారు.
వారానికి ఒకరోజే మంచినీరు: యలమంచిలి లైన్ కొత్తూరు ప్రజలు
యలమంచిలి నియోజకవర్గం లైన్ కొత్తూరు నియోజకవర్గ ప్రజలు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2014లో వచ్చిన తుఫానుకు 60ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితులకు గత ప్రభుత్వం త్వరితగతిన ఇళ్లు కట్టించి ఆదుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇళ్లకు రోడ్డు, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. పూర్వం నుండి రైతులు అనుభవిస్తున్న భూములకు సరైన రికార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటల బీమా, గిట్టుబాటు ధరలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మా పంచాయతీలో వీధి కుళాయిలలో వారానికి ఒకరోజే మంచినీరు వస్తోంది. పాడిరైతులకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు నేడు రావడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
అంతరాయం లేకుండా మంచినీరు ఇస్తాం
జగన్మోహన్ రెడ్డికి పేదలంటే గిట్టదు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టి, నా మైనారిటీ అంటున్నాడు. తుఫానులతో నష్టపోయిన కుటుంబాలకు రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం దుర్మార్గం. మేం అధికారంలోకి వచ్చాక రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 24/7 మంచినీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పాడిరైతులకు గతంలో అమలు చేసిన ప్రోత్సాహకాలు అందిసామని లోకేష్ హామీ ఇచ్చారు.
వీధిలైట్లు వేసే దిక్కులేదు: కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు
యలమంచిలి వై జంక్షన్ వద్ద శివారు గ్రామాలు కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మా మున్సిపాలిటీలో వీధిలైట్లు వేసే దిక్కులేదు. మంచినీరు, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. టీడీపీ పాలనలో రూ.120కోట్లు మంజూరు చేసినా వైసీపీ వచ్చాక వాటిని ఖర్చు పెట్టలేదు. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండి మురుగునీరు పంటకాలువల ద్వారా పొలాల్లోకి వస్తున్నాయి. ప్రభుత్వ కళాశాల నిమిత్తం టీడీపీ పాలనలో రూ.80లక్షలు, రూ.1.20కోట్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు. రోడ్ల నిమిత్తం టీడీపీ పాలనలో రూ.100కోట్లు మంజూరు చేస్తే వైసీపీ వచ్చాక వాటిని రద్దు చేసింది.
అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దొంగిలించిన దొంగ ప్రభుత్వమిది. వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బ్లీచింగ్ చల్లడానికి చిల్లిగవ్వ లేకుండా చేశారు. మౌలిక వసతుల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం. తాగునీరు, రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. గత పాలనలో ప్రారంభించిన అభివృద్ధి పనులు, కళాశాలల పనులను పూర్తిచేస్తాం.
ఉపాధిహామీ పథకం అమలుకాక ఇబ్బందులు: యలమంచిలి పట్టణ ప్రజలు
యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 8 శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం చేసింది. దీంతో మాకు ఉపాధిహామీ పథకం అమలుకాక ఇబ్బంది పడుతున్నాం. యానాద్రి కాలువ వచ్చినప్పుడల్లా మా ప్రాంతం ముంపుకు గురవుతోంది. రైల్వే గేటు ఎక్కువసేపు మూసేయడం, ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తికాకపోవడంతో ఇబ్బందిపడుతున్నాం. రోడ్లు, మౌలిక సదుపాయాలు సరిగా లేవు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మంచినీటి కొరత అధికంగా ఉంది. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
జగన్ ప్రభుత్వానికి పన్నులపేరుతో ప్రజలను అడ్డగోలుగా దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ స్థానిక సంస్థల అభివృద్ధిపై లేదు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులను కూడా వాడుకోలేని దద్దమ్మ సీఎం జగన్. తమను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థుడు జగన్. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి పట్టణాలు, పల్లెల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తాం. పట్టణాల్లో విలీనం అయిన గ్రామాలకు ఉపాధి పథకం అమలయ్యేలా కేంద్రంతో మాట్లాడతాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. యలమంచిలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిచేసి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తాం. విద్యార్థుల సంఖ్యను బట్టి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తాం.
ఇళ్లపట్టాలివ్వాలి: కొక్కిరాపల్లి గ్రామస్తులు
యలమంచిలి మున్సిపాలిటీ శివారు గ్రామం కొక్కిరాపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలోని 5 గ్రామాలను మున్సిపాలిటీలో 2 వార్డులుగా మార్చారు. మా ప్రాంతంలోని ప్రజలు ఎన్.హెచ్-16 రోడ్డు దాటడానికి ఇబ్బందిపడుతున్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సివస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో స్థానిక ప్రజలు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. మా గ్రామం నుండి రెల్లికాలనీ, యాదవ కాలనీ వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదు. కొక్కిరపల్లి రైల్వే గేటు కాలనీ ప్రజలు 25ఏళ్లుగా అక్కడ ఉంటున్నారు. వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇప్పించాలని స్థానికి ఎమ్మెల్యేని అడిగితే ఇవ్వకపోగా బెదిరించారు. ఇళ్లపట్టాలిచ్చి ఇల్లు లేని ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొక్కిరపల్లి రైల్వే గేట్ పైవంతెన పనులు త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్ కష్టాలు తొలగించాలి.
పట్టాలు ఇప్పించేందుకు చర్యలు
జగన్మోహన్ రెడ్డి అవగాహన లేమితో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు. పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలిపి ప్రజలను వేధిస్తున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్యలేవీ పట్టించుకోవడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక కొక్కిరాపల్లి గ్రామ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం. రోడ్లు లేని ప్రాంతంలో కొత్త రోడ్లు వేస్తాం..ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తాం. రైల్వేగేటు కాలనీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. కొక్కిరపల్లి రైల్వే గేట్ పైవంతెన పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం.
వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు: కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు
యలమంచిలి కొత్తపాలెం జంక్షన్ లో కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం నీరు-చెట్టు పథకం ద్వారా పంటకాలువలు, చెరువుల పూడిక తీయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పూడికలు తీయడం లేదు. రైతులకు గతంలో ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇవేమీ ఇవ్వడం లేదు. పంటపొలాలకు సకాలంలో నీరు రాకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతోంది. శారద నది గేట్లు సరికా నిర్వహించక తుప్పు పట్టి పాడైపోయి నీరు మా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. నీటినిల్వ చేసే పరిస్థితి కూడా వైసీపీ పాలనలో కనబడడం లేదు. ఈ క్రాప్ బుకింద్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరించాలి.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. శారద నది గేట్లు సరిగా నిర్వహించలేని దౌర్భగ్యపు ప్రభుత్వం అధికారంలో ఉండటం విచారకరం. గేట్లకు గ్రీజు పెట్టలేని దుస్థితి కారణంగా పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. రైతులు పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటకాలువలు, చెరువులు పూడిక తీయకుండా రైతులను నట్టేట ముంచుతున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక కాలువలు, చెరువులు పూడిక తీయిస్తాం. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఏడుముళ్ల డ్యామ్ దెబ్బతిని నీటికి కష్టాలు: రైతులు
యలమంచిలి కట్లుపాలెం జంక్షన్ వద్ద రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200 సంవత్సరాల క్రితం ఏడుముళ్ల డ్యామ్ ను బ్రిటీషు వారు నిర్మించారు. ఈ డ్యాముపై ఆధారపడి 14గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్నాం. 20 ఏళ్ల క్రితం తుఫాను వల్ల డ్యామ్ దెబ్బతినడంతో రైతులు నీరు లేక ఇబ్బంది పడ్డారు. హుద్ హుద్ తుఫాను, ఆ తర్వాత వచ్చిన తుఫానుల వల్ల డ్యామ్ నేలమట్టమై నీరు సముద్రంలోకి వెళుతోంది. పంట పొలాలకు నీరు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడుముళ్ల డ్యామ్ ను పునః నిర్మాణం చేసి ఆదుకోవాలి.
డ్యామ్ పునః నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం
నీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జగన్ దివాలాకోరు ప్రభుత్వం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్లక్ష్యానికి కొట్టుకుపోయింది. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి నెలకొంది. రైతు ఆత్మహత్యల్లో ఎపి 3వస్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వస్థానంలో నిలిపారు. మేం అధికారంలోకి వచ్చాక పెండిరగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. ఏడుముళ్ల డ్యామ్ పునః నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు.
తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయాం: రాంబిల్లి మండల రైతులు
యలమంచిలి నియోజకవర్గం నారాయణపురం వద్ద రాంబిల్లి మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మిచౌంగ్ తుఫాను వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం. నారాయణపురం, తెరువుపల్లి, దిమిలి, కట్టుబోలు, మురకాడ, కుమ్మరాపల్లి, జాల, మర్రిపాలెం గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదు. ఎకరానికి రూ.30వేలు నష్టపరిహారం అందించాలి. యాంత్రీకరణ రావడం వల్ల కూలీలకు పనులు దొరకడం లేదు. వరి పంటకు క్వింటాల్ కు రూ.3వేలు ఆర్థికసాయం అందించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోవాలి.
పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం
పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన జగన్ రైతులను నట్టేట ముంచాడు. గత ఏడాది ప్రభుత్వం పంటల బీమా చెల్లించింది కేవలం 16మంది రైతులకు మాత్రమేనని ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంది. వైసీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానించేందుకు కేంద్రంతో మాట్లాడతామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఆనకట్ట కొట్టుకుపోయి ఇబ్బందులు: రజాల గ్రామస్తులు
యలమంచిలి నియోజకవర్గం రజాల గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో శారద నదిపై ఉన్న ఆనకట్ట 2019లో వరదలకు కొట్టుకుపోయింది. ఈ ఆనకట్టపై ఆధారపడి 9వేల ఎకరాల పంట భూములున్నాయి. ఆనకట్ట తెగి నీరు లేక రైతులు నీరు లేక ఇబ్బందిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆనకట్టను పునరుద్ధరించాలి.
ఏడాది లోపు ఆనకట్ట తిరిగి నిర్మిస్తాం
జగన్మోహన్ రెడ్డి పాలన రైతులకు శాపంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది. సాగునీటి ప్రాజెక్టులు, గేట్లు నిర్వహణ లోపం వల్ల కొట్టుకుపోతున్నాయి. మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు శారద నదిపై ఆనకట్టను పునరుద్ధరిస్తాం. ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడతామని లోకేష్ చెప్పారు.
ఇళ్లు లేక అవస్థలు: పంచదార్ల గ్రామస్తులు
యలమంచిలి నియోజకవర్గం పంచదార్ల గ్రామస్తులు యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200మందికి ఇళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 30మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయలేదు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని పనులకు శంకుస్థాపన చేసి పనులు నిలిపేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటోంది. సెంటు పట్టా పేరుతో జగన్ అండ్ కో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. జగనన్న కాలనీల్లో స్థలాలు వైసీపీ నాయకులు సొంత పార్టీ వాళ్లకే ఇచ్చారు. ఆవాసయోగ్యం కాని స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి వచ్చిన రూ.9వేలకోట్లు జగన్ దారిమళ్లించాడు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను జగన్ నిర్లక్ష్యం చేశాడు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు అదనపు నిధులిచ్చి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.