- ముఖ్యమంత్రి దోపిడీ మానసికతను ఎండగట్టిన చంద్రబాబు
- ఫ్యాను రెక్కలు ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధం
- మహిళలను కించపర్చటానికీ వెనుకాడని వైసీపీ మూకలు
- అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటాం
- యానాదుల మేలుకు ప్రత్యేక చర్యలు చేపడతాం
- మత్స్యకారులకు మెరుగైన పథకాలు అందిస్తాం, 217 జీవోను రద్దు చేస్తాం
- ప్రజల ఆదాయం పాతాళంలోకి.. జగన్ ఆదాయం ఆకాశంలోకి..
- కావలిలో ప్రజాస్పందన.. రాష్ట్రవ్యాప్తంగా తుఫానుగా మారుతుందన్న చంద్రబాబు
కావలి(చైతన్యరథం): జగన్‌రెడ్డి పెత్తందారీ మనస్త త్వానికి రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలతో పాటు ప్రజలందరూ బాధితులుగా మారారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరా చక పాలన సాగుతున్నా ఎవరూ నోరెత్తలేని పరిస్థితి ఉందన్నారు. సహజ వనరులను అడ్డగోలుగా దోచు కోవటం, అదేమిటని ప్రశ్నించినవారిపై దాడులు, తప్పు డు కేసులు, హత్యలు జగన్‌రెడ్డి పాలనలో సర్వ సాధార ణమయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవా రం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడు తూ ముఖ్యమంత్రి దోపిడీ మానసికతను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. తమ దోపిడీలు, హత్యా రాజకీయాలను ప్రశ్నిస్తే సొంత చెల్లెళ్లతో సహా మహిళలని కూడా చూడకుండా దాడులు చేసి, దారుణంగా అవమానించే వికృత మనస్తత్వం ఉన్న పాలకుడు జగన్ అని చంద్ర బాబు దుయ్యబట్టారు.
వైసీపీకి డిపాజిట్లు గల్లంతే
కావలి సభకు భారీగా హాజరైన జనాన్ని చూసి చంద్రబాబు కూడా స్పందించారు. నెల్లూరులో పక్కనే సముద్రాన్ని మరిపించే జనసముద్రం ఇక్కడే ఉంది. కావాలి సభ దద్దరిల్లింది. ఇది చూసిన సైకో జగన్‌కి నిద్రరాదు. టీవీలు పగలగొడతాడు. చేసిన పాపాలు ఊరికే పోవు. వైసీపీని చిత్తు చిత్తు ఓడిరచేందుకు ప్రజ లందరు సిద్ధంగా ఉన్నారు. వైసీపీకి డిపాజిట్లు గల్లంత య్యే పరిస్థితి వస్తుంది. మన సభలకు యువత భారీగా తరలివస్తున్నారు. మాపిల్లలకు భవిష్యత్ గ్యారెంటీ ఇవ్వ మని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అసలైన పెత్తందారు జగనే
గత 5 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలకు గురవుతు న్నారు. అందుకే ప్రజాగళంతో ప్రజలను చైతన్య వంతు గా తీర్చిదిద్దేందుకు వచ్చాను. మీకు జరుగుతున్న అన్యా యాన్ని ప్రశ్నించేందుకు వచ్చాను. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. రైతులకు సబ్సిడీ లు, గిట్టుబాటు ధరలు, నీళ్లురాని పరిస్థితి. మహిళలకు రక్షణ లేదు. నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 గుంజుతూ జలగ లా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకు ఎంచుకున్న మార్గం బాదుడే బాదుడు.
నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెం చేశారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ప్రజల ఖర్చులు పెరిగాయి. మీ జీవన ప్రమాణాలు పడిపోయాయి. ప్రజల్లో ఆవేదన, బాధ ఉంది. చిరువ్యాపారులకు బేరాలు లేవు. కూలి పనులు చేసుకునే వారికి 5 ఏళ్లుగా ఉపాధి లేదు. పోలీసులు సహా ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా రావటం లేదు. ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ డ్రా చేసే అవ కాశం కూడా లేకుండా చేశారు. బాదుడే బాదుడేతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అభివృద్ధి ఆగి పోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు తరలిపోయాయి. 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచాడు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదవాడి పొట్ట కొట్టిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి నిజమైన పెత్తందారుడని చంద్రబాబు అన్నారు.
ఇలాంటి సీఎంను చూడలేదు
ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జనమం తా జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధమ య్యారు. ప్రజాగ్రహ తుఫాను తాకిడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటోంది. ఫ్యాన్ డస్ట్‌బిన్‌లో ఉండాలి. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. రాష్ట్రం ఇలా అయిపోతోందని బాధ కలుగుతుంది. జగన్ ముందు ఎవ్వరూ మాట్లాడకూడదు.ఎవరు ఎదురుతిరిగినా సర్వ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజల నుంచి ఉద్యోగ సంఘాల వరకు అందిరినీ అణగతొ క్కారు. జగన్‌రెడ్డికి ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం పై గౌరవం లేదు. ప్రజలపై విశ్వాసం లేదు. దోచుకున్న డబ్బులతో అక్రమ కట్టడాలు, ప్యాలెస్‌లు కట్టుకోవడం మాత్రమే తెలుసు. పేటీఎం బ్యాచ్‌ని పెట్టుకొని తప్పుడు ప్రచారాలు మాత్రమే చెయ్యడం తెలుసు. అరాచకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చినవారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించారు. జైల్లో పెట్టి కొట్టి, హింసించి, చంపేందుకు కూడా కొంత మంది పోలీసు లు వెనుకాడలేదు.రాష్ట్రంలో లక్షలాది మందిపై అక్రమ కేసులు బనాయిస్తే తట్టుకోలేక ఇళ్లల్లోనే బాధపడ్డారు. ఆస్తులు కబ్జా చేస్తే మాట్లాడలేని పరిస్థితి. ఆఖరికి కృష్ణపట్నం పోర్టును నిర్వీర్యం చేశారు. స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసు కుంది. కడప, ఒంటిమిట్టలో బీసీ వర్గానికి చెందిన సుబ్బారావు ఆస్తిని వేరే వాళ్లు రాయించుకుంటే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మెల్యే చేపల చెరువు దోచుకుంటే ఇదే ప్రాంతంలో కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, నారా లోకేష్ ఆదుకొని ఆ అప్పు కట్టారు. మాస్క్ అడిగినందుకు సుధాకర్ అనే డాక్టర్‌ను వేధించి పిచ్చి వాడిగా చేసి చంపేశారు.
కాకి నాడలో ఎమ్మల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన తన కార్ డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశాడు. బాబాయ్ ది గొడ్డలి వేటా? సహజ మరణమా? చంపిన తనికి ఎంపీ సీటు ఇచ్చి, ఊరేగించే పరిస్థితికి వచ్చారు. మా నాన్నను చంపిన వాళ్లపై కేసు పెట్టండి, వాళ్లెవరో బయటపెట్టండి.. ఆయన ఆత్మకు శాంతికి కలిగించ మని చెల్లెళ్లు కోరితే వారిపై అక్రమ కేసులు బనాయి స్తున్నారు. ఇవ్వన్నీ చూస్తే సామన్య ప్రజలకు భవిష్యత్ కు రక్షణ ఉందా..ఆస్తులకు రక్షణ ఉందా అనిపిస్తుంది. పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందనం సుబ్బయ్య, రాజాంలో కృష్ణమాస్టర్, గిద్దలూరులో మునయ్య, పుటపర్తిలో అమర్‌నాథ్‌రెడ్డి, రేపల్లెలో అక్కని అవమానించవద్దని అడిగిన పాపానికి బీసీ బాలుడు అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి తగలపెట్టారు. జగన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మనందరం బాగుపడతామని చంద్రబాబు చెప్పారు.
గద్దె దించేందుకు సిద్ధం
పేదల ఆస్తులు తరిగిపోయాయి, అప్పులు పెరిగి పోయాయి. కాని జగన్‌రెడ్డి ఆస్తులు మాత్రం పెరుగు తూనే ఉన్నాయి. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి. పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, అప్పులు ఎక్కువగా ఉన్న ప్రజలు ఏపీలోనే ఉన్నారు. దేశంలోనే రైతుల తలసరి అప్పుల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. యువత ఆత్మహత్యల్లో నెంబర్ వన్‌లో ఉన్నాం. కాని విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్న జగన్‌రెడ్డి నిజమైన పెత్తందారుడు. జగన్ కుర్చీ కూల దొయ్యడానికి ప్రజ లు సిద్ధం. జగన్ అహంకారం కూలి పోతుంది, తాడే పల్లి ప్యాలెస్ బద్దులు కొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యా రని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్నికలు నామమాత్రమే
ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయా ల్లోకి వచ్చారు. అలాంటి నిస్వార్ధపరుడు పార్టీలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మాం. నెల్లూరు ఎంపీ మనదే. ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే గెలిచారు. ఎన్నిక లు నామమాత్రమే. ఆయన మీద పోటీకి ఎవరిని పెట్టారో చూశారా? ఆయనే ఏ2. విజయసాయి. అవినీతి పరుడు, పనికి మాలిన వ్యక్తి, దళారి వ్యవస్థకు దత్తపుత్తుడు. క్వార్టర్ ఇచ్చి భోజనం పెడతామని అడు క్కుంటున్నా జనం వెళ్లిపోయారు. సిద్ధాంత పరంగా వస్తేనే సభల్లో ఉంటారు.. అద్దెకు వస్తే నిలబడకుండా వెళ్లిపోతారు. దోపిడీ కోసం వచ్చిన వారిని కాదు… ప్రజాసేవ కోసం వచ్చిన వారిని ఆశీర్వదించండి. వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతి కోవూరు పోటీ చేస్తు న్నారు.అలాంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు. మహిళలను అవమానించడం వైసీ పీ డీఎన్ ఏలోనే ఉంది. ఉన్మాదుల్లా, అరాచక శక్తుల్లా వైసీపీ నేతలు తయారయ్యారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇక్కడ తంతే చెన్నైలో పడతాడు
నెల్లూరు జిల్లాలో బుల్లెట్ దించుతానన్న వ్యక్తి ఇప్పు డు నర్సరాపుపేటలో పడ్డాడు. అక్కడ ఓటర్లు తంతే మళ్లీ చెన్నైలో పడతాడు. మంచి చెడులకు తేడా తెలి యకుండా మాట్లాడుతున్నారు. అన్ని వర్గాలను ఆదు కుంటాం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా, పేదవాళ్లకు తోడుగా ఉంటాం. ఆదాయం పెంచి మెరు గైన జీవన ప్రమాణాలను తెచ్చేందుకు కృషిచేస్తాం. యానాదుల కోసం నేను ప్రత్యేకంగా ఐటీడీ పెట్టాను. యానాదుల కోసం కొత్తగా ప్రత్యేక కార్యక్రమాలు తెస్తా ను. మీ పిల్లలను చదివిస్తాను. ప్రపంచంలోని అన్ని కంపెనీలను అనుసంధానం చేసి మీ ప్రాంతం నుంచే పని చేసే విధంగా చేస్తాను.
అవినీతి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే కాలకేయుడు. అవినీతిపరుడు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదు. వింతజీవి, విచిత్రమైన మనిషి. అతనిని ఢీకొట్టడానికి కావ్యా కృష్ణా రెడ్డిని పెట్టాం. ఇక్కడి సుబ్బానాయుడు భవిష్యత్ నేను చూసుకుంటాను.ఈసీటు గెలుస్తున్నాం, గెలిచాం. కావా లి ఎమ్మెల్యే ఒక నాయకుడిగా కాదు మనిషిగా ఉండ టానికి కూడా అర్హుడు కాదు.దళితుడైన కరుణాకర్ అనే వ్యక్తి చేపల చెరువును లాక్కున్నారు. కప్పరాల తిప్పలో బీసీ గురుకులం కింద ఉన్న 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. సెంటు పట్టా భూమిలో రూ.100 కోట్లు కొట్టే శారు. కావలి రూరల్‌లో విచ్చల విడిగా గ్రానైట్ దోచు కున్నారు. ప్రతి దానిలో కమీషన్లు కావాలంటూ గద్దల్లా మారి పీక్కుతుంటున్నారు. మీ అరాచకాలను చిత్రగుప్తు డి మాదిరి లెక్కలు రాశాను. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తాను. యానాదిశెట్టి తెలుగుదేశం పార్టీకి ఎన లేని సేవచేశారు.వారికుటుంబానికి అండగా ఉంటాను.
గతంలో మత్స్య కారులకు ఇచ్చిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాం. మత్స్యకారులకు శాపం గా మారిన 217 జీవోను రద్దుచేస్తాం. గతంలో ఇచ్చిన పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.అక్వా పరిశ్రమలకు చేయూ తనిస్తాం. రూ.1.50 విద్యుత్ సరఫరా చేస్తాం. ఉప్పు నిల్వ చేయడానికి షెడ్లు నిల్వ చేస్తాం. ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకానికి ఏర్పాటుచేసిన పైలాన్ పగులకొట్టా రు. వారిపై కేసులు పెడతాం. నార్త్ ఆములూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మేము దానిని పూర్తి చేస్తాం. పైడేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం రద్దు చేశారు. మేము పూర్తిచేస్తాం. దగదర్తి విమానాశ్ర యాన్ని పూర్తిచేస్తాను. మాకు ఓటు వేస్తే కంపెనీలు వస్తాయి, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం, మహిళలకు రక్షణ ఇస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచకుండా నియంత్రిస్తాం. కావలి నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. దొపిడీల జగన్ రెడ్డిని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఎస్సీల పథకాలు తీసేసిన జగన్
ఎస్సీలకు 27పథకాలు ఇచ్చిన వాళ్లు పెత్తం దారులా..వాటిని రద్దుచేసిన వాళ్లు పెత్తందారులా? గిరిజన కాలనీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, కరెంట్, వంటగ్యాస్ ఇచ్చిన వాళ్లు పెత్తందారులా.. ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టని వాడు పెత్తందారుడా? ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ టీడీపీ. బదిలీల పేరుతో బడుగువర్గా లకు చెందిన ఎమ్మెల్యేలను మార్చేసి, సొంత వర్గానికి చెందిన వారిని పాతస్థానా ల్లోనే ఉంచిన జగన్మోహన్‌రెడ్డే అసలైన పెత్తందారుడు. పేదల పిల్లలకుబెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో సీట్లు ఇచ్చాం. వారి భవిష్యత్ కోసం కృషిచేస్తే కాని నేడు జగన్ రెడ్డి ఆ స్కీమ్‌ని తీసేశారు. పేద పిల్లలందరికి ఫీజు రీయిం బర్స్‌మెంట్ ఇచ్చాం. పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేసిన జగన్‌రెడ్డే అసలైన పెత్తందారుడని చంద్రబాబు దుయ్యబట్టారు.
నిన్నటి వరకు పరదాలు.. నేడు బుల్లెట్‌ప్రూఫ్ బస్సు
మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగే జగన్ నేడు బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో వస్తున్నాడు. నేను పేదల మనిషిని.. మిగిలిన వారందరూ పెత్తందారులు అని జగన్ అంటున్నాడు. పేదల కోసం రూ.5 భోజనం పెట్టిన వారు పెత్తం దారులా.. అన్న క్యాంటీన్ ను అధికార అహంకారంతో రద్దు చేసిన వాళ్లు పెత్తందారులా? పేదలు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యోన్నతి పథకం అమలు చేసిన వాళ్లు పెత్తందారులా.. కక్షపూరితంగా దానిని రద్దు చేసిన వాళ్లు పెత్తందారులా? ప్రతి ఒక్కరికి ఇల్ల్లు ఉండాలనే లక్ష్యంతో 12 లక్షల టిడ్కో ఇళ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా వాటిని పేదలకు ఇవ్వకుండా రంగులు మాత్రం వేసుకున్నాడు.పేదలకు ఇళ్ల ఇవ్వకుండా,వాళ్ల ను అప్పులపాలు చేసిన వ్యక్తి నిజమైన పెత్తం దారుడు.
మా హయాంలో ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ జగన్ పేదల ఇళ్లకు రాష్ట్రం నిధులు ఇవ్వకుండా కేంద్ర నిధులు మాత్రమే ఇచ్చాడు. ఆయన మాత్రం రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. పేదలకు హామీఇస్తున్నా. ఇప్పుడు ఉన్న కాలనీలు అలా నే ఉంటాయి,ఏమీ రద్దుచేయం.అక్కడే మీరు ఇళ్లు కట్టు కునేందుకు మరిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆదుకుంటా నని హామీ ఇస్తున్నాను. నేను జగన్ మాదిరి కాదు. ఏదైతే అసంపూర్తిగా వదిలి పెట్టారో, అరకొరగా ఇచ్చా రో అదిచాలదు. అన్ని విధాలుగా ఆదుకునేందుకు నిధు లు ఇస్తాం, ఇళ్ల కోసం చేసిన అప్పుల నుంచి బయటకు పడేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.