- కోర్టుకు హాజరవ్వకుండా దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్న జగన్
బ అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్‌కు లేదు
బ మండిపడ్డ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, కళావెంకట్రావు
బ కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ దళిత నేతల నిరాహార దీక్ష
బ కోర్టుకు హాజరవ్వకుండా దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్న జగన్
బ అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్ కు లేదు
బ మండిపడ్డ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, కళావెంకట్రావు
బ కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ దళిత నేతల నిరాహార దీక్ష
అమరావతి: కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ నిశితంగా పరిశీలిస్తే అసలు ముద్దాయి సీఎం జగన్‌రెడ్డేనని టీడీపీ నేతలు అన్నారు. కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య ఆధ్వ ర్యంలో ఆ పార్టీ దళిత నేతలు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో గత ఐదేళ్ల్లుగా దళితులపై దాడు లకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శించారు. ఈ సంద ర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు మాట్లాడుతూ… కోడికత్తితో పొడిపించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్‌రెడ్డి.. తనవల్ల 5 ఏళ్లుగా అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీనుని మాత్రం బయటకు రానివ్వడం లేదని విమర్శించారు. దళిత యువకుడు శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి, అతనితో భుజంపై కోడికత్తితో పొడిపించుకొని, ఎన్నికల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు.చివరకు తనవల్ల జైలు పాలై, చేయని నేరానికి అన్యాయంగా 5ఏళ్ల నుంచి జైల్లో మగ్గిపోతున్న శ్రీనుకి జగన్‌రెడ్డి చేసిందేమిటి? జగన్‌రెడ్డి పథకం ప్రకారమే శ్రీను కోడికత్తి కేసులో నిందితుడుగా మారాడు. శ్రీను విషయంలో జగన్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని బట్టే, ఆయనకు దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కోడికత్తి ఘటన జరిగాక జగన్‌రెడ్డి.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, కేసు విచారణను ఎన్‌ఐఏకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ ప్రకారంగానే ఎన్‌ఐఏ కోడికత్తి కేసుని క్షుణ్ణంగా చారించి దానిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కుట్ర, వ్యక్తుల ప్రమేయం లేదని తేల్చి, కోర్టుకి నివేదిక ఇచ్చింది. ఎన్‌ఐఏ విచారణను సవాల్ చేస్తూ, మరలా విచారించాలంటూ జగన్‌రెడ్డి హై కోర్టు కు వెళ్లాడు. కోర్టుకు హాజరు కాకుండా, అమాయకు డైన శ్రీనుని దుర్మార్గంగా జైల్లో ఉండేట్టు చేశాడు. జగన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు హాజరై చెప్పాల్సింది చెబితే శ్రీను కి బెయిల్ వస్తుంది. అలా రావడం జగన్‌రెడ్డికి ఇష్టం లేదు. శ్రీను బయటకు వస్తే తన బండారం.. కోడికత్తి నాటకం బయటపడుతుందని, ప్రజలు తనను ఛీత్కరి స్తారని జగన్‌రెడ్డి భయం. అందుకే ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా శ్రీనుని, అతని కుటుంబాన్ని వేధిస్తు న్నాడు. దళితులు పేదలేకానీ.. తెలివితక్కువ వాళ్లుకాదు. అంబేద్కర్ విగ్రహం పేరిట జగన్ కొత్త నాటకం మొదలెట్టాడు. మహానుభావుడు,ప్రపంచమేధావి, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. దళితులపై జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రేమాభిమానాలున్నా.. వెంటనే ఎన్‌ఐఏ కోర్టు కు హాజరై, శ్రీను బయటకు వచ్చేలా చూడాలి. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ప్రథమ ముద్దాయి జగన్ రెడ్డే: వర్ల
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి తన రాజకీయ స్వార్థ ప్రయో జనాల కోసం దళితుడైన కోడికత్తి శ్రీను జీవితాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు. కోడికత్తి కేసును నిశి తంగా పరిశీలిస్తే ఇందులో ప్రథమ ముద్దాయి జగన్ రెడ్డేనని తేలుతోంది. జగన్‌రెడ్డి తనపై సానుభూతిని సృష్టించుకోవడం కోసం దళితుడైన శ్రీను చేత బలవం తంగా పొడిపించుకున్నాడు. పొడిపించుకున్న జగన్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. బాధితుడైన శ్రీను జైల్లో మగ్గిపోతున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు జైల్లో ఉం టే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? లండన్‌లో ఉన్న కూతురిని చూడటానికి జగన్‌రెడ్డి స్పెషల్ ప్లైట్ వేసు కుని వెళతాడు. కోడికత్తి శ్రీనును చూసేందుకు ఆయన తల్లిదండ్రులకు ములాఖత్ కూడా ఇవ్వడంలేదు. పిల్లల పై జగన్ రెడ్డిదే ప్రేమా? మిగతావాళ్లది ప్రేమ కాదా? ఐదేళ్లపాటు దళితులపై నరమేధం సాగించిన జగన్ రెడ్డి నేడు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించడం అణగా రిన వర్గాలకు అవమానం. జగన్‌రెడ్డి చేత ఆవిష్కరింప బడుతున్నందుకు అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తోంది. ఇప్పటి కైనా జగన్‌రెడ్డి కల్పించుకుని చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న శ్రీనుకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసు కోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఓట్లకోసం జగన్ కపట నాటకం: కళావెంకట్రావు
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ… జగన్‌రెడ్డి మోసానికి బలై, 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్‌కు, అతని కుటుంబానికి మద్దతుగా టీడీపీ దళితనేతలు చేపట్టిన దీక్షకు సంఫీుభావం ప్రకటిస్తున్నా నన్నారు జరిగిన ఘటనపై ప్రజలు ఆలోచించాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి, దానిలోని అం శాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న వ్యక్తి, నేడు ఆ మహానుభావుడు అంబేద్కర్‌ను అవమానిస్తూ, ఆయన విగ్రహాన్నే ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. విగ్రహ ప్రారంభం పేరిట జగన్‌రెడ్డి పన్నిన పన్నాగం ప్రజలకు అర్థమైంది. ఓట్లకోసం జగన్ ఆడుతున్న కపట నాటకం లో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం కూడా ఒకటి.జగన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచీ దళిత, గిరిజన, బలహీన వర్గాలపై ఈర్ష్యాద్వేషాలతో వ్యవహరిస్తున్నాడు. ఆయా వర్గాలపై ప్రభుత్వంలోకి రాకముందు ఎలాగైతే వ్యవహ రించాడో, వచ్చాక కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన ప్రయోజనా లు, అవకాశాల్ని కూడా దక్కకుండా చేశాడు. దళితుల పై జగన్‌రెడ్డికి ద్వేషం, కక్ష, కార్పణ్యం ఉన్నాయి అనడా నికి డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రవర్తించిన తీరుతో పాటు అనేక ఘటనల్లో వ్యవహరించిన తీరే నిదర్శనం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపే సి, అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వారిని జగన్‌రెడ్డి ఏ స్థాయిలో నిలిపాడో అందరం చూశాం. ఇలాంటి ఘటనలు చూశాక అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత జగన్‌రెడ్డికి లేదు అని చెప్పక తప్పదు. ముఖ్య మంత్రిగా ఆయనకు ఆ అర్హత లేనేలేదు. దళిత యువ కుడు శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతుంటే, 5ఏళ్లుగా ముఖ్య మంత్రికి కోర్టుకు వెళ్లే తీరిక లేదా? చట్టాలు, న్యాయ స్థానాలపై జగన్‌రెడ్డికి గౌరవంలేదు అనడానికి ఇదే నిద ర్శనం. అంబేద్కర్ రాజ్యాంగంవల్లే తాను ముఖ్యమంత్రి ని అయ్యాను అనే ఆలోచన ఏ కోశానా జగన్‌రెడ్డికి లేదు.శ్రీనుని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంలేదు కాబట్టే జగన్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకుండా కాలయాపన చేస్తు న్నాడు. జగన్‌రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి. అంబేద్కర్ మహానుభావుడు రాసిన పవిత్రమైన రాజ్యాంగానికి పట్టి న జగన్‌రెడ్డి అనే చీడను తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కళావెంకట్రావు పిలుపు నిచ్చారు. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు, పాతర్ల రమేష్, మోకా ఆనందసాగర్, సంతనూతలపాడు టీడీపీ ఇన్‌ఛార్జ్ బీఎన్ విజయకు మార్, టీడీపీ రాష్ట్రపార్టీ కార్యదర్శి దేవతోటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, జ్యోతిబసు, దయారత్నం, కోటేశ్వరరావు, దళిత నాయ కుడు పులి చిన్నా, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బేత పూడి సుధాకర్, బొక్కా నాగరాజు, సురేష్, పెద్దబ్బాయ్, ప్రభాకర్, శీను, పీటర్ పాల్, తదితరులు పాల్గొన్నారు.