- తుంగభద్ర పనులను నిలిపివేసి అనంతపురంపై కక్షకట్టారు
- గాజులదిన్నె పనులు చేయించిన విధానంపై దర్యాప్తు చేయిస్తాం
- కేసీ కెనాల్ ఉప కాలువ ఆక్రమణకు బాధ్యులపై చర్యలు
- తుగ్లక్ నిర్ణయాలతో ఐదేళ్లలో ప్రాజెక్టులను నాశనం చేశారు
- ప్రతి ఎకరాకు నీరు, కరువు రహిత రాష్ట్రమే బాబు లక్ష్యం
- బడ్జెట్‌లో అవసరమైన మేర నిధులు కేటాయించేలా చర్యలు
- అసెంబ్లీలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి(చైతన్యరథం): జగన్ నిర్లక్ష్యం, తుగ్లక్, అనాలోచిత నిర్ణయాల వల్లనే వేలా ది ఎకరాలకు సాగు, తాగునీరు అందించే సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసానికి గురై కోట్లాది రూపాయలు నష్టానికి గురయ్యాయని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుయే కాదు ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు. ఆయన గురువారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తుంగభద్ర ఎగువ కాలువ పనుల గురించి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో 70 శాతం పనులు జరగగా దురదృష్టవశాత్తు అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన 30 శాతం పనులను కొనసాగించకపోగా నిలిపివే యడం దారుణమన్నారు. ఈ పనులకు ఐదేళ్ల వరకు తిరిగి అనుమతులు ఇవ్వకూడదనే తెచ్చిన 365 జీవో జగన్ అనాలోచిత నిర్ణయమన్నారు. దీనివల్ల అనంతపురం జిల్లా ప్రజల కు సాగు, తాగునీటి సమస్య ఎదురైందన్నారు. రాయదుర్గం నుంచి ఉరవకొండ వరకు 84 కిలోమీటర్లు ప్రవహించే ఈ కాలువ ద్వారా 2.84 లక్షల 992 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు.
వెనుకబడిన రాయలసీమపై కక్షకట్టారు
తుంగభద్ర ఎగువ కాలువపై లాకులు, రెగ్యురేటర్లు, కట్టడాలు వంటివి ధ్వంసం కాగా 2009లో టీడీపీ ప్రభుత్వం 458 కోట్లు మంజూరు చేయగా 2019 వరకు సాగిన పనులకు 309 కోట్లు ఖర్చయి 70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 30 శాతం పనులను నిలిపివేయడమే కాకుండా ఐదేళ్ల వరకు మంజూరు చేయరాదనే నిబంధనలతో చేసిన పనులు సైతం ధ్వంసమై వంతెనలు సైతం కూలిపోయాయని చెప్పారు. దీనివల్ల నీటి సామ ర్థ్యం 2,600 క్యూసెక్కుల నుంచి 1500 క్యూసెక్కులకు తగ్గిపోయిందని తెలిపారు. ఈ కాలువపై అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు రూ.148 కోట్ల ఇప్పించాలని ఆ జిల్లా కలెక్టర్‌తో పాటు నీటి సలహా మండలి కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కనీసం తాగునీటి అవసరాలకు రూ.34 కోట్లు కోరినా పెడచెవిన పెట్టిందన్నారు. దేశంలోనే తక్కువ వర్షపాతం, వెనుకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా అని, నా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఆడబిడ్డలు అని మాట్లాడే జగన్ ఆ వర్గాలు నివసించే ఈ ప్రాంతంపై ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరానికి నీరు అందించే లా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఆదేశాలు ఇచ్చారని, పనులు పూర్తయ్యేందుకు అవసరమైన ఎస్టిమేట్లు తయారు చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తామ ని హామీ ఇచ్చారు.
గాజులదిన్నె ప్రాజెక్టుపై దర్యాప్తు చేయిస్తాం
కర్నూలు జిల్లాలో గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టుపై జరుగుతున్న పనులు ఎంత వరకు ఉపయోగపడతాయో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఈ పనుల్లో అధికారులు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు వ్యత్యాసం ఉందని సభ్యులు చెబుతున్న అంశంపై పరిశీలన చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో వారి నాయకులకు అవసరమైన పనులు చేసుకుని మిగిలిన పనులు వదిలేశారా అనే దానిపై ఆరా తీస్తామన్నారు. పనుల తీరును పరిశీలించి పురోగతి జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని మం త్రి చెప్పారు. ఈ పనులకు సంబంధించి బండ ఎత్తును, వెడల్పును పెంచడం, గేట్లు మరమ్మతులు, వైరు రోప్ కనెక్షన్లు వంటివి జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టు గేట్లు, అన్నమయ్య గేట్లు పూర్తిగా కొట్టుకుపోయా యన్నారు. తెలంగాణలో పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో మన ప్రాంతంలో 15 గ్రామాల వరకు నష్టపోయాయన్నారు. దీనికి సంబంధించి గేట్లు స్పీల్ వే వంటి పనుల కు 80 వేల కోట్ల అవసరమవుతుందని గోదావరి బోర్డు తెలిపినా జగన్ వాటా సొమ్ము ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి ఎదురైందని తెలిపారు.
కేసీ కెనాల్ ఉప కాలువ ఆక్రమణపై చర్యలు
వేలాది ఎకరాలకు సాగునీరు అందించే కేసీ కెనాల్ సంబంధించి పాలసాగర్ ఉప కాలువ ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆక్రమణకు సంబంధించి రెవెన్యూ సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, జలవనరుల శాఖల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పమన్నారు. తాడేపల్లిలో మా ఇరిగేషన్ స్థలంలో ఈఎన్‌సీ, టౌన్ ప్లాన్ అనుమతి లేకుండా జగన్ పార్టీ ఆఫీసు నిర్మాణ ప్రయత్నం చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం చిన్నపాటి బోదేపై రెండు మూడు అడుగులు ఆక్రమణ లేకపోయినా ఇబ్బంది పెట్టిందన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లోనూ దిగమింగారు
టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ 7,00,863 లక్షల కోట్లు ఉంది. ఇరిగేషన్‌కు 51,802 కోట్లు కేటాయించి 44,448 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ 12,18,000 లక్షల కోట్లు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇరిగేషన్‌కు 46,374 కోట్లు కేటాయించి 19,220 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. జరిగిన ఈ కొద్దిపాటి పను ల్లోనూ అవినీతి సొమ్ము వైసీపీ నాయకుల జేబులోకి వెళ్లిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధు లను అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి రాగానే రీయింబర్స్‌మెంట్‌గా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టకుండా మళ్లించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే ఇరిగేషన్‌కు, వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబా బు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే వెనుకబడి న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.