- బట్టబయలైన ఆదానీతో అవినీతి బంధం
- ప్రజలపై లక్ష కోట్ల భారం మోపేందుకు యత్నం
- విద్యుత్‌కే రూ.1750 ముడుపులు తీసుకుంటే..
- ఐదేళ్లలో ఒప్పందాలకు ఎంత వెనకేసుకున్నారు?
- కూటమి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి
- టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి ఏపీని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశా రని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ ధ్వజమెత్తారు. ఒకరి అవినీతి.. మరొకరి అత్యాశ కలిసి ప్రజలపై వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం ఆదానీ గ్రూప్ జగన్‌కు సమర్పించిన ముడుపులు రూ.1750 కోట్లు అని అమెరికా నిగ్గు తేల్చింది..గత ఐదేళ్లలో ఆదానీతో జగన్‌రెడ్డి ఇంకె న్ని ఒప్పందాలు చేసుకుని ఉంటారు? వాటికి ఇంకెంత లంచం ముట్టి ఉంటుంది? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆదానీకి బ్లాంక్ చెక్కులాగా జగన్ రాసిచ్చారు..ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఆదానీ, జగన్ లంచాల బాగోతంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, దేశం, రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చారన్నారు. ఆదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం వస్తే.. రాష్ట్ర ప్రజలపై మాత్రం సర్దుబాటు చార్జీల పేరుతో రూ.17 వేల కోట్ల భారం పడిరదని, ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించా రు. ఇదే ఆదానీ గుజరాత్‌లో యూనిట్ విద్యుత్ రూ.1.99 చొప్పున ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటే.. ఏపీతో మాత్రం రూ.2.49కి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఈ లెక్కన 25 ఏళ్ల ఒప్పందంతో ప్రజలపై పడే భారం రూ.లక్ష కోట్లుపైనే ఉంటుందని తెలిపారు. లంచం కోసం డిస్కంలను, ఏపీ ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడిన జగన్‌కు విశ్వస నీయత ఎక్కడుందని మండిపడ్డారు. గంగవరం పోర్టుకు సంబంధించి రూ.9 వేల కోట్ల విలువజేసే ప్రభుత్వ పది శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు ఆదానీకి కట్టబెట్టా రు.. కృష్ణపట్నం పోర్టును బెదిరించి ఇప్పించారు..రాష్ట్రం మొత్తం బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టు, బీచ్ శాండ్ మైనింగ్, విశాఖలో సబ్‌మెరైన్ కాంట్రాక్టులనూ వారికే కట్టబె ట్టారు అని ధ్వజమెత్తారు.