- పేదల ఆకలి తీర్చటం పాపమా అని భువనేశ్వరి ఆవేదన
- కుప్పం నియోజకవర్గంలో మరో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించిన భువనమ్మ
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో మరో రెండు అన్న క్యాంటీన్లను నారా భువనేశ్వరి బుధవారం ప్రారంభించారు. శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్, రామకుప్పం పోలీస్ స్టేషన్ పక్కన అన్న క్యాంటీన్లను ఆమె ప్రారంభించారు. తొలుత శాంతి పురం అన్న క్యాంటీన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించా రు. అనంతరం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ పేద వాళ్ల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అన్న క్యాంటీన్లను తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 364 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి కోట్లాదిమంది ఆకలి తీర్చా రన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని మూసేశారు, కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకు లు, కార్యకర్తలు అన్న క్యాంటీన్లు పెట్టినా వాటిపై వైసీపీ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు విధించిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా 150 అన్న క్యాంటీన్లు టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నామన్నారు. కుప్పం కుటుంబ సభ్యులకు 4 అన్న క్యాంటీన్లను అందుబాటులో ఉంచాం.. పేదలు సంతృప్తిగా భోజనం చేయాలన్నారు.