అమరావతి: ఎ1,ఎ2లు జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకున్నారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ దుయ్యబట్టారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ…జగన్ బాబాయి గొడ్డలి పోటునుండి దారి మళ్ళించడానికి లోకేష్ ని కూడ అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు నందికి,పందికి తేడా తెలుసు. వైకాపా రక్తపాతంలో నుండి పుట్టిన పార్టీ. తాత రాజారెడ్డి వారసత్వం కొనసాగిస్తున్నాడు. ప్రజాస్వామిక వాదిగా లోకేష్ వుంటే.. ప్యాక్షన్లని నమ్ముకుని భయభ్రాంతులకు గురి చేసి కుటుంబాన్ని గుప్పెట బంధించిన వ్యక్తి జగన్. వివేకా హత్య జరిగిన తీరును ఖండిరచలేని భయంతో కుటుంబ సభ్యులున్నారు. తండ్రి మరణం జగన్ రాజకీయ పీఠమైతే…పాలనా సామర్ద్య వారసత్వ లోకేష్ దని జవహర్ పేర్కొన్నారు. లోకేష్ చేతులకే కాదు ఆలోచనకు కూడ రక్తం అంటదు. ఇదంతా తాడేపల్లి వేదికగా నడిపిస్తున్న నాటకమని అన్నారు.