- గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల రాజకీయ దురుద్దేశంలో భాగమే
- పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం ఇవ్వకపోవడం నిరుద్యోగుల్ని వంచించడమే
- 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఏటా డీఎస్సీ నిర్వహణ, జాబ్ క్యాలెండర్ హామీలను తుంగలో తొక్కిన జగన్
- కనీసం 4 నెలల సమయం ఇవ్వాలి
అమరావతి: పాలనాకాలం ముగింపు దశలో జగన్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ల పేరిట డ్రామాలు మొదలెట్టిం దని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శిం చారు. జగన్ ప్రభుత్వం తాజాగా గ్రూప్-2 నోటిఫికేష న్ వెలువరించింది.. డిసెంబర్లో దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరిలో అర్హత పరీక్ష నిర్వహిస్తామని చెబుతోందన్నా రు. ఏదో మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చాము.. నిరు ద్యోగులు వాళ్ల బాధలు వాళ్లు పడతారు అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారం లోకి వస్తే 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా నని,ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్‌రెడ్డి నిరు ద్యోగుల్ని నమ్మించాడన్నారు. ఆహామీపై ప్రతిపక్ష నేతల మైన తాము శాసనమండలిలో ప్రశ్నిస్తే,బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి సమాధానమిస్తూ 2.30లక్షల ఖాళీలు లేవు… 90 వేలే ఉన్నాయి. అవి భర్తీచేయడానికి చర్యలు తీసు కుంటామని చెప్పారు. కానీఅవేవీ ఈ ప్రభుత్వం నెర వేర్చలేదు. చివరకు తూతూ మంత్రంగా గ్రూప్స్ నోటి ఫికేషన్ ఇచ్చి.. దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. నాలుగున్న రేళ్ల లో జగన్‌రెడ్డి ఒక్క డీఎస్సీ ప్రకటించలేదు.గ్రామీణ నిరు ద్యోగయువతకు ఉపాధి.. ఉద్యోగ అవకాశాలు కల్పిం చడంలో జగన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. ఇంత కంటే దుర్మార్గం మరోటిఉండదని ముఖ్యమంత్రి గ్రహిం చాలని అశోక్‌బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏపీ పీఎస్సీ ద్వారా 4వేల ఖాళీలు.. పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6వేల ఖాళీలు భర్తీచేశాము. చంద్రబాబు ప్రభు త్వం రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 17,500ఖాళీలు భర్తీచేసింది. అవి కాకుండా ప్రైవేట్ సెక్టార్లో 5లక్షల ఉద్యోగాలు యువతకు అందించింది. ప్రైవేట్ ఉద్యోగా ల కల్పన నిజమేనని వైసీపీ ప్రభుత్వమే శాసనసభలో అంగీకరించిందని అశోక్ బాబు గుర్తుచేశారు.
ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం వంచించడం కాదా?
కేవలం 897పోస్టుల భర్తీకి తక్కువవ్యవధిలో గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇవ్వడంవల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగమో ముఖ్యమంత్రి చెప్పాలి.అది కూడా డిజెం బర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి ఫ్రిబవరిలో పరీక్షలు నిర్వహి స్తామని చెప్పడం నిరుద్యోగుల్ని మోసగించడం కాదా? ఆ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. అప్పు డు పరీక్షల నిర్వహణఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం చెప్పాలి. నిరుద్యోగుల ఆశలతో ఆటలాడేలా.. సరైన ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం వారిని వం చించడం కాదా?డిసెంబర్లో నోటిఫికేషన్‌ఇచ్చి ఫిబ్రవరి లో పరీక్షలు నిర్వహిస్తామనడం ఎవర్ని మోసగించడాని కో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రెండునెలల్లో నిరుద్యోగులు గ్రూప్స్ పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతా రో..వారికి ఉండే ఇతరవిద్యార్హతల పరీక్షలు ఎలా పూర్తి చేస్తారో చెప్పాలి. ముఖ్యంగా పీజీ చదివే యువత.. గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి.ఉపాధ్యాయ పోస్టులు దాదాపు 20 వేల వరకు భర్తీ చేయాల్సిఉంది. వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. టీడీపీ ప్రభు త్వం ఎన్నికలకుముందు ప్రజలకోసం ప్రకటించిన పథ కాల్ని,ఉద్యోగాలభర్తీ నోటిఫికేషన్లను తప్పు పట్టిన జగన్ రెడ్డి..ఇప్పుడు తాను చేసిందేమిటో చెప్పాలి. అధికారం లోకి వస్తేఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలెన్ని.. ఇచ్చినవి ఎన్నో జగన్‌రెడ్డి నిరుద్యోగులకు చెప్పాలి. ప్రైవేట్ ఉద్యో గాల భర్తీలో కూడా జగన్‌సర్కార్ ఘోరంగా విఫలమైం ది. కొత్తపరిశ్రమల ఏర్పాటులో దారుణంగా విఫలమైన జగన్ ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరి మేయడంలో మాత్రం విజయవంతమైంది.నిరుద్యోగుల్ని జగన్ దారుణంగా మోసగించాడు కాబట్టే.. అతని మో సాలకు బలైనదాదాపు 1500మంది యువత బలవన్మ రణాలకు పాల్పడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలోని అంశాలే ఏపీలోని నిరుద్యోగయువత ఆత్మ హత్యలకు తార్కాణం. గంజాయి, కల్తీ మద్యం ఇతర మాదక ద్రవ్యాలతో బంగారం లాంటి యువత భవితను నిర్వీర్యంచేసిన దుర్మార్గుడిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచి పోతాడు. ఆఖరికి వ్యవసాయం చేసుకొని బతుకడానికి కూడా యువతకు అవకాశం లేకుండా..జగన్‌రెడ్డి వ్యవ సాయరంగాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాడు.గ్రూప్ -2 నోటిఫికేషన్ తేదీలు మార్చి.. యువతకు కనీసం 4నెలల సమయం ఇవ్వాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-2 నోటి ఫికేషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిందే తప్ప… నిజంగా నిరుద్యోగులకు మేలు చేయడానికి కాదని అశోక్‌బాబు తేల్చిచెప్పారు.