- రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను తమ్ముడికి కట్టబెట్టేందుకు దసరా ధమాకా సేల్‌కు తెరలేపిన సీఎం
- టెండర్ నిబంధనలు మార్చేసి, ప్యాకేజీ బిడ్ సెక్యూరిటీ సొమ్ములో కోత
- టెండర్ డాక్యుమెంట్ ఎవరికీ అందుబాటులో లేకుండా రూ.29.5 లక్షలుగా ధర
- ఇంత భారీ మొత్తంలో ధర బహుశా దేశంలోనే ప్రథమం
- కొత్త నిబంధనలు ఎవరి మేలుకోసమో ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలి
అమరావతి: గడచిన నాలుగున్నరేళ్లలో ఇసుక అమ్మ కాల్లో భారీ దోపిడీకి పాల్పడి రూ.40 వేలకోట్లు దోచేసి న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలోని ఇసుక తవ్వ కాలు మొత్తం తన తమ్ముడు అనిల్‌రెడ్డికి కట్టబెట్టే లా భారీ కుట్రకు పథక రచన చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించా రు. జగన్‌రెడ్డి ఇసుక దోపిడీతో పాటు…ఇతర కుంభకోణాలు పూసగుచ్చినట్టు ప్రజలకు ఆధారాలతో సహా వివరించారనే కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ అవినీతి ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో నిర్బంధించాడని, అయినప్పటికీ చంద్రబాబు చూపిన బాటలోనే నేడు తామంతా ప్రజలపక్షాన పోరాడుతూ, జగన్ రెడ్డి అవినీతిని, కుంభకోణాలను బయటపెడుతున్నామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021 ఏప్రిల్ లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక తవ్వకాల టెండర్ అప్పగించినట్టు కలరింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఆ సంస్థను డమ్మీని చేసి వైసీపీ వారితోనే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీ ఇష్టానుసారం తవ్వేసి తన ఖజానా నింపుకున్నాడని ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలనుంచే జగన్ ఇసుకాసురుడిగా మారి తన జేబులు నింపుకోవడం మొదలెట్టాడు. టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తన దోపిడీ కోసమే జగన్ రెడ్డి రద్దుచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 నుంచి రూ.1500 మధ్య లభిస్తే, జగన్ వచ్చాక అదే ట్రాక్టర్ ఇసుకను రూ.7వేలనుంచి రూ.10వేల వరకు అమ్మారు. జిల్లాలవారీగా తన తాబేదార్లను నియమించుకొని భారీగా ఇసుక లూటీకి పాల్పడ్డాడు. దీనిపైన ప్రజల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కొత్త ఇసుక విధానం ప్రవేశపెడుతున్నానని నమ్మబలికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ టెండర్ విధానంలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నీ కట్టబెట్టాడు. ఆ రకంగా మే 2021 నుంచి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే సంస్థను అడ్డుపెట్టుకొని తిరిగి తన దోపిడీ ముఠా ఆధ్వర్యంలోనే ఇసుకపై వేలకోట్లు మింగడం మొదలు పెట్టాడు. జేపీ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టిన టెండర్ కాలపరిమితి మే-2023తో ముగియడంతో, తిరిగి వారికే టెండర్ పొడిగిస్తున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టి జగన్ అండ్ కో తమ దోపిడీని కొనసాగించారు. నేడు కొత్తగా రాష్ట్రంలోని శాండ్ రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించి ఈ సారి ఏకంగా తన తండ్రి సోదరుడు జార్జిరెడ్డి కుమారుడైన అనిల్ రెడ్డి, ఇతర బినామీలకు రీచ్ లను కట్టబెట్టడాని కి సిద్ధమయ్యాడని పట్టాభి ఆరోపించారు.
ఇప్పటి వరకు దోచినదాని కంటే రెట్టింపు దోపిడీకి జగన్ రెడ్డి కుట్ర
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు ప్రారంభించిన నూతన టెండర్ ప్రక్రియకు సంబంధించి జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కీలకమైన టెండర్ డాక్యుమెంట్‌ను ప్రజలకు అందు బాటులో లేకుండా చేసింది. కనీసం ఈ టెండర్లలో పాల్గొనేవారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర సాంకేతిక అంశాలకు చెందిన వివరాలు కూడా బయటకు రాకుండా చేయడం కోసం మాత్రమే టెండర్ డాక్యుమెంట్ ధరను జగన్ రెడ్డి అంతపెద్ద మొత్తంలో రూ.29.5లక్షలుగా పెట్టాడు. టెండర్లలో పాల్గొనదలచిన వారు, తమకు కావాల్సిన అర్హతలు ఉన్నా యో లేదో తెలుసుకోవడానికి కూడా రూ.29.5 లక్షలు చెల్లించి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేసి చదువుకోవాల్సిందే. ఇది అత్యంత దుర్మార్గం. కేవలం టెండర్ అర్హతలు తెలుసుకోవడానికి ఎవరు మాత్రం రూ.29.5లక్షలు ఖర్చుచేస్తారు? టెండర్ డాక్యుమెంట్ ధర మొత్తం నాన్ రిఫండబుల్ కావటంతో.. తీరా అంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేశాక, తమకు ఆ టెండర్లలో పాల్గొనే అర్హత లేదని తెలిస్తే, కట్టిన సొమ్ములో పైసా కూడా వెనక్కురాదు. ఇందువల్ల ఎవరూ కూడా అంతపెద్ద మొత్తంలో డబ్బుచెల్లించి టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయరన్న దురాలోచనతోనే జగన్ రెడ్డి ఈ పద్ధతిని తీసుకొచ్చాడు. ఆ రకంగా తాను ముందు గానే నిర్ణయించిన వారితో మాత్రమే టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయించి, తర్వాత వారికి మాత్రమే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను కట్టబెట్టే కుట్రకు తెరలేపాడు జగన్ రెడ్డి. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడిరగ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలోని ఈ-ప్రొక్యూర్ మెంట్ ప్లాట్ ఫామ్ లో కేవలం నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (ఎన్‌ఐటీ) అనే ఒక నామమాత్రపు డాక్యుమెంట్ ను మాత్రమే పొందుపరిచి, దానిలో టెండర్లో పాల్గొనదలచిన వారు, ఒక్కో ప్యాకేజీకి 29.5లక్షలు (జీఎస్టీతో కలిపి) చెల్లించి టెండర్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేయాలని పేర్కొ న్నారు. ఆ రకంగా రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలకు టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.90 లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతభారీ మొత్తంలో టెండర్ డాక్యుమెంట్ ధరను దేశచరిత్రలో ఏ ప్రభుత్వం /సంస్థ నేటివరకు నిర్దారించలేదు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్.హెచ్.ఏ.ఐ ఈనెల 16వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సుమారు రూ.1000 కోట్లకు టెండర్ పిలిస్తే,దాని టెండర్ డాక్యుమెంట్ ధర ను కేవలం రూ.1,00,000గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ, వెయ్యికోట్ల ప్రాజెక్ట్‌కు టెండర్ ఫీజుగా కేవలం రూ.లక్షరూపాయలు నిర్దేశిస్తే, జగన్మోహన్‌రెడ్డి, అతని అవినీతి ప్రభుత్వం మాత్రం ఇసుకకు సంబంధిం చిన మూడుటెండర్ ప్యాకేజీల డాక్యుమెంట్స్ మొత్తం ధరను సుమారు రూ.90 లక్షలుగా నిర్దేశించారు. మొత్తం మూడు ప్యాకేజీల టెండర్ విలువ కలిపినా రూ.1500కోట్లకు మించి ఉండదని పట్టాభి అన్నారు.