- రాష్ట్రానికి పట్టిన గ్రహణంను వదిలించుకుంటేనే సుఖశాంతులు
- సీఐడీ కేసుల్లో ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు
- సీఎం పదవికి జగన్ తగరని సుప్రీం వ్యాఖ్యలు స్పష్టం
- కక్షపూరిత రాజకీయాలకు సుప్రీం కోర్టును వాడుకోవడం దుర్మార్గం
- నైతిక విలువలుంటే తక్షణమే జగన్ రాజీనామా చేయాలి
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి : రాష్ట్రాని కి మూడున్నరేళ్ల క్రితం జగన్ అనే గ్రహణం పట్టిం దని, దీన్ని వదిలించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య చెప్పారు. మంగళగినిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. జగన్ గ్రహణం వదిలితేనే రాష్ట్రానికి సుఖ శాంతులు. సార్థ్యంలో నడుస్తున్న వైసీపీ ప్రభు త్వం లజ్జావిహీనంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘‘మీ రాజకీయ కక్షల్లో మేం భాగస్వాములం కాలేం. మీరు మా దగ్గరకు రావొద్దు. మీ రాజకీయ ప్రతీకారం లోకి మమ్మల్ని లాగవద్దు’’అని చేసిన వ్యాఖ్యలతో జగ న్‌రెడ్డికి ఏమాత్రం నైతికవిలువలున్నా తక్షణమే ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి పదవిలో నీలం సంజీవ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్), నారా చంద్రబాబు వంటి వాళ్లు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసేవాళ్లు. మీకు నిజంగా నైతిక విలువలుంటే ఎవరైనా పారదర్శకంగా పరిపా లించే నాయకులను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో బెట్టి, తక్షణమే రాజీనామా చేయాలి. జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్షలకు పాల్పడుతోంది. 2012లో జగన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో సుప్రీం ధర్మాసనం ‘‘ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ డబ్బులు ఇతనికి ఎలా వచ్చాయో చాలా లోతుగా సునిశితంగా దర్యాప్తు చేయండి’’ అని చేసిన వ్యాఖ్యలతో జగన్ రెడ్డి రాజకీయంగా పతనమయ్యారు.
కక్షపూరిత రాజకీయాలకు అనుబంధ సంస్థగా సీఐడీ
జగన్మోహన్‌రెడ్డి తన వ్యక్తిగత కక్షపూరిత రాజకీ యాలు చేసేందుకు ఏపీ సీఐడీ సంస్థను వైసీపీ అను బంధ సంస్థలా వాడుకుంటున్నారు. సీఐడీ చీఫ్ ఈ అనుబంధ సంస్థకు పెద్దలా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో అరెస్టులకు పాల్పడిన ఏ ఒక్క కేసులోనూ ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు. కేవలం ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తల ను వేధించడానికి సీఐడీని జగన్ తన జేబు సంస్థలా వాడుకుంటున్నారు. జగన్‌రెడ్డి డైరెక్షన్‌లో సీఐడీ పని చేస్తోంది. జగన్ పాలనలో సీఐడీ పోలీసులు అర్థరాత్రే అరెస్టులకు పాల్పడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు మొదలు ఇటీవల అయ్యన్నపాత్రుడు వరకు మొత్తం అర్ధరాత్రి అరెస్టులే. సీఐడీ పోలీసులు చీకటి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు.
జగన్ నీకు జీసస్ పేరెత్తే అర్హత లేదు
జగన్‌రెడ్డి నోరెత్తితే ఆ దేవుడి దయతో అని అంటా రు. జగన్‌రెడ్డి నమ్ముకున్నది కరుణామయుడు జీసస్ ని. జీసస్ నిన్ను కక్ష, కార్పణ్యంతో బ్రతకమని చెప్పా డా జగన్‌రెడ్డి? కక్షపూరిత రాజకీయాలు, హత్యారాజ కీయాలు చేయమని చెప్పాడా? నీ మనసులోని ఫ్యాక్ష నిస్టుని జీసస్‌పేరు చెప్పి కప్పిపుచ్చుకోవా లనుకోవడం దుర్మార్గం. నీకు జీసస్ పేరెత్తే అర్హత లేదు. ఇంకెప్పు డూ దేవుడి దయ అనొద్దు. సజ్జల దయ, వైసీపీ దయ అని అంటే బాగుంటుంది.
భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారు జగన్?
మీ కక్షపూరిత రాజకీయాలు, కోర్టులు వేసే మొట్టి కాయలు, చెంపదెబ్బలుతో భావితరానికి ఏం సందేశం ఇస్తున్నారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మీ పాల నలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెప్పిన విధంగా పరిపాలన ఎక్కడాకనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకత, చట్టబద్దత పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నాయకు లు ఖూనీ చేశారు. ఇలాంటి పరిపాలన చూసి భావిత రాలు ఏం నేర్చుకోవాలి? రానున్న తరాల భవిష్యత్తు ఎలా ఉండాలి?
జగన్ గ్రహణాన్ని సీబీఐ ఎలా ఛేదిస్తుందో చూడాలి
వివేకానందరెడ్డి హత్య కేసును జగన్ గ్రహణం పట్టిపీడిస్తోంది. హత్య కేసును ముందుకు కదలకుం డా ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తోంది. సీబీఐ అధి కారులను బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి వేధిం చడం చేస్తోంది. హంతకులెవరో సీబీఐ చెప్పినా వారికి కొమ్ముకాస్తోంది. మూడున్నరేళ్ల పైబడి వివేకా హత్య కేసుకు పట్టిన ఈ జగన్ గ్రహణాన్ని సీబీఐ ఎలా ఛేదిస్తుందో వేచిచూడాలని వర్ల రామయ్య అన్నారు.
దాడులకు పాల్పడినవారిపై చర్యలేవీ?
డీజీపీకి వర్ల రామయ్య లేఖ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న నందిగామ రోడ్ షోపై రాళ్లు వేసిన ఘటనకు సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని మీ దృష్టికి అనేకమార్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రత్యేకించి ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ వైసీపీ చేస్తున్న దాడులపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భద్రతా లోపాలకు కారణమైన అధికారు లపై గానీ, దాడులకు పాల్పడినవారిపై గానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న చంద్రనాయుడి ఇంటి పై 2019ఆగస్టులో డ్రోన్ కెమేరాలు ఎగురవేశారని వివరించారు. 2019నవంబరులో అమరావతి రాజ ధాని బస్సుయాత్రపై రాళ్లు, కర్రలు రువ్వినట్లు తెలి పారు. 2021 నవంబరులో అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత ఇంటిపై దాడికి యత్నించాడన్నారు.
తాజాగా 2022 నవంబరు 4న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించిన చంద్రబాబు నాయుడి రోడ్ షోపై రాళ్లు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్ షోకు ముందుగానే అనుమతులు తీసుకున్నప్ప టికీ తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదని గుర్తు చేశారు. రాళ్ల దాడి ప్రణాళిక ప్రకారం జరిగిందన డానికి దాడి చేసే ముందు పవర్‌కట్ చేయడమే నిద ర్శనమన్నారు. చంద్రబాబుపై వేసినరాయి ఆయన భద్రతాధికారి మధుకు తగలడంతో ఆయన గాయ లపాలైనట్లు తెలిపారు. రూట్ మ్యాప్ పోలీసులకు ముందే ఇచ్చినప్పటికీ రోడ్ షో జరిగే చుట్టు ప్రక్కల ఇళ్లను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు.
భద్రత కల్పనలో పోలీసుల వైఫల్యం
ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షనేతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక అధికారపార్టీగూం డాలు ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నారని తెలిపా రు.దాడికిపాల్పడిన గూండాలను రక్షించేందుకు రాయి యాత్రలోని వారే వేశారని పోలీసులు చెప్ప డం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష నేతకు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు పైఫల్యం చెందా రని వర్ల రామయ్య డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు ఐపీసీ 120బి,332 సెక్షన్లకింద కేసునమోదు చేయ కుండా 324కింద కేసునమోదు చేయడం అను మానాలకు తావిస్తోందన్నారు. విశాఖపట్నంలో అధి కారపార్టీ మంత్రులపై జరిగిన సాధారణ దాడిపై ఐపీసీ 307తో హత్యాయత్నం కేసు నమోదు చేశా రు. చంద్రబాబుపై కుట్రపూరితంగా దాడి చేసి, ఒక పోలీసు అధికారికి గాయాలైనప్పటికి హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయ లేదని ప్రశ్నించారు. భద్రతాలోపాలకు కారణమైన డీఎస్పీ, సీఐ, ఎస్.ఐ. లను సస్పెండ్ చేయాలని, సరైన సెక్షన్లతో తిరిగి కేసునమోదు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడం డని డీజీపీ వర్ల రామయ్య కోరారు.