- రోగుల ప్రాణాలు తీసి ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించాడు
- నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు
- సీఎంఆర్‌ఎఫ్ మంజూరుచేయకుండా పేదల ఉసురు తీశాడు
- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై విషప్రచారం
- రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- పెండిరగ్ బిల్లులు, సీఎంఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేశారు
- ఏప్రిల్ 1 నుంచి హైబ్రిడ్ విధానంలో వైద్య సేవలకు శ్రీకారం
- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య
మంగళగిరి(చైతన్యరథం): రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా ప్రతి కుటుంబానికి చికిత్స అందించే విధానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాల యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అద్భుత పాలనను చూసి వైసీపీ ఓర్చుకోలేక రోజూ వైసీపీ నేతలు ఇష్టమొచ్చిన రీతిగా అభూత కల్పనలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తన సొంత ఖజా నాను నింపుకోవడానికే జగన్ పాలనంతా సరిపోయిందన్నారు. పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే సీఎంఆర్‌ఎఫ్‌ను కూడా ఇవ్వకుండా ఆపేసిన నీచుడు జగన్‌రెడ్డి అని మం డిపడ్డారు. జగన్ హయాంలో ఆరోగ్యశ్రీలో చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తానని డబ్బా కొట్టుకుని అమలు చేయలేదని తెలి పారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు.. కేంద్రం నుంచి ఆయుష్మాన్ భవ పథకం నుంచి రావాల్సిన రూ.1500 కోట్లకు చిల్లులు పెట్టాడు. ఆరోగ్యశ్రీ నిధులు తారుమారు చేసి తన పబ్బం గడుపుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో తిరగగలడు? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా జగన్ తన తాబేదారులకు కాంట్రాక్టు బిల్లులు చెల్లించడానికి పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోవడానికి అనారోగ్యంతో ఉన్న రోగులను బలిపె ట్టారు. వారి గురించి పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో ఉచిత సేవలన్నారు..అవి ఏమ య్యాయి? అని ప్రశ్నించారు. పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులొచ్చా యని మండిపడ్డారు. జగనన్న సురక్ష పథకం పేద ప్రజలకు ఏనాడు ఉపయోగపడలేదని తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి హైబ్రిడ్ విధానంలో వైద్యసేవలు
కూటమి ప్రభుత్వం 7 నెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి రూ.1500 కోట్ల బకాయిలు తీర్చిందని తెలిపారు. జగన్ వల్ల ప్రజానీకం చాలా ఇబ్బంది పడ్డారు. ఏప్రిల్ 1 నుంచి హైబ్రిడ్ విధానంలో రూ.25 లక్షలు వరకు వైద్య సేవలను బీమా విధానంలో అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆరోగ్య సురక్ష ప్రజార్భాటానికే తప్ప పనికిరాలేదు. ఫ్యామిలీ డాక్టర్ పథకం పత్తా లేకుండా పోయింది. సీఎంఆర్‌ఎఫ్‌ను అటకెక్కించారు. మెడికల్ సీట్లను అమ్ముకున్నారు. బలహీనవర్గాల విద్యార్థులు డాక్టర్లు కావాలనే వారి కలను తుంగలో తొక్కారు. ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలందకుండా చేశారు. అనేక అరాచకాలు సృష్టించారు. ప్రజలకు నిధులు అందకుండా, ఆరోగ్యం అందకుండా చేశా రు. ప్రజల జీవితాలతో నిత్యం ఆటలాడుకున్నారు. ఆనాడు చంద్రబాబు ఆరోగ్యశ్రీని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కోటి 20 లక్షల మందికి అందజేశారు.
ఉత్త మాటలతో పేదల ప్రాణాలు తీసిన జగన్‌రెడ్డి
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని జగన్‌రెడ్డి గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వం బిల్లులు పెం డిరగ్‌లో పెట్టడంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులను మెజారిటీ ఆస్పత్రులు దగ్గరకు కూడా రానివ్వలేదు. కొన్ని ఆస్పత్రులైతే సగం మీరు చెల్లించండి, మిగిలిన సగం ఆరోగ్యశ్రీ కింద వసూలు చేసుకుంటామని నిబంధనలు పెట్టాయి. అందుకు రోగి ఒప్పుకుంటేనే జాయిన్ చేసుకున్నారు. ఈ తలనొప్పులు ఎందుకనుకున్న మరికొన్ని ఆస్పత్రులు అధికార వైసీపీ నేతల సిఫార్సులు ఉన్న వారికే వైద్యసేవలు అందించాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స, గుండె రక్తనాళాల మార్పిడి వంటి కీలక శస్త్ర చికిత్సలకు పూర్తి డబ్బు కట్టించుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ఉత్తుత్తి ప్యాకేజీ రూ.25 లక్షలు పెంచితే ఏంటి? కోటికి పెంచితే ఏంటి? అక్కరకు రాని జగన్‌రెడ్డి గొప్పలు పేదల ప్రాణాలు నిలబెట్టలేకపోయాయి. మాటలు మాత్రమే కోటలు దాటించి వైద్యాన్ని గాలికొదిలేసి ఆరోగ్య విప్లవం తెచ్చేశానని తన మందితో పొగడ్తలు కురిపించుకోవటం తప్పించి పేద, సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం జగ న్మోహన్‌రెడ్డి చేసిందేమి లేదని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సలకు కేం ద్రం ఆయుష్మాన్ భారత్ కింద నిధులిస్తున్నప్పటికీ పథకాలపై ఎక్కడా కేంద్రం లోగో, ప్రధాని బొమ్మ కూడా వేయకుండా కేవలం జగన్ ఫొటోలు మాత్రమే వేశారు. జగన్ ప్రచార పిచ్చిపై ఆగ్రహించిన కేంద్రం ప్రాయోజిత పథకాల కింద వైద్య ఆరోగ్య శాఖ కు రావాల్సిన రూ.1500 కోట్లు నిలిపేస్తామని హెచ్చరించినా ఏ మాత్రం లెక్క చేయ కపోవటం జగన్‌రెడ్డికే చెల్లిందని మండిపడ్డారు.
సీఎంఆర్‌ఎఫ్‌లోనూ మెలిక
అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే సీఎంఆర్‌ఎఫ్ విషయంలో జగన్మోహన్‌రెడ్డి రివర్స్ పద్ధతిని పాటించారు. దరఖాస్తుల తనిఖీలు పేరుతో కాలయాపన చేయడంతో 30 వేలకు పైగా దరఖాస్తులు, రూ200 కోట్ల వరకూ బిల్లులు పెండిరగ్‌లో పడిపోయా యి. సీఎంఆర్‌ఎఫ్‌కు ప్రతిరోజూ 300 నుంచి 400 వరకూ దరఖాస్తులు వచ్చినా సెక్ష న్లో 100 కూడా క్లియర్ చేయకుండా బాధితులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు ఎవరి సిఫార్సులు లేకుండా అమలు చేస్తామని పాదయాత్ర సమయం లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటేనే అన్న మెలిక పెట్టి మాట తప్పాడు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్స చేయాలంటే ఎల్‌వోసీ తెచ్చుకోవాలని వైద్యులు చెబుతుండగా ఎల్‌వోసీకి అధికారపక్షం ఎమ్మెల్యేనో లేక ఇన్‌చార్జ్ సంతకం అవసరమన్న నిబంధన పెట్టడంతో సాధారణ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎల్‌వోసీ కోసం రోగులు వస్తేనే ఇస్తామని సీఎంఆర్‌ఎఫ్ మరో నిబంధన పెట్టడంతో ముఖ్యమంత్రి సహాయ నిధిపై ప్రజలు ఆశలు వదులుకునే పరి స్థితికి తెచ్చారు. ఎలాగోలా నానా తిప్పలు పడి ఎల్‌వోసీలు తెచ్చినా ఒక్క రూపాయి కూడా ఆసుపత్రులకు విడుదల చేయలేదని తెలిపారు.
పేదల ప్రాణాలు నిలుపుతున్న చంద్రబాబు
ప్రాణాపాయంలో అల్లాడుతున్న పేద రోగుల అవస్థలకు చలించిపోయిన ముఖ్య మంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 7,523 మందికి లబ్ధి కలిగేలా రూ.124 కోట్లు సీఎంఆర్‌ఎఫ్ కింద నిధులు విడుదల చేశా రు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా బీపీఎల్ దిగువన ఉన్న కోటి 20 లక్షల మందికి పథకం వర్తింపజేశాము. ఐదేళ్లలో రూ.5,330 కోట్ల వ్యయంతో 18 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూర్చాం. గుండె, ఊపిరితిత్తులు చికిత్స కూడా ఈ పథకంలో చేర్చాము. వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలకు కాక్లియార్‌ఇంప్లాంటేషన్‌కు రూ.6 లక్షలు, మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ.3.5 లక్ష ల వరకు అందించాం. అలాగే క్లయిమ్ అందగానే 70 శాతం నిధుల విడుదల చేశాం. ఇదీ పేదల వైద్యంపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి. మరి జగనన్మోహాన్ రెడ్డి చేసిం దేంటి? పైకి మాత్రం తన వైఫల్యాలు బయటపడకుండా ఆరోగ్యశ్రీ ప్యాకెజ్ పెంచాం, జగనన్న సురక్ష ఇస్తున్నాం, మెడికల్ కాలేజీలు కడుతున్నామని గడిచిన ఐదేళ్లపాటు కథలు వినిపించాడు. జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభు త్వంపై బురద జల్లడం మానుకోవాలని హితవుపలికారు.