- ఐదేళ్ల గత ప్రభుత్వంలో అంపశయ్యపై వైద్యరంగం
- నీతిఆయోగ్ ర్యాంకింగ్స్‌లో దిగజారిన ప్రమాణాలు
- వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్‌రెడ్డి
- ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలనూ గాలికొదిలేశారు
- వాటిల్లో బోధన సిబ్బంది కొరత, అరకొర వసతులు
- ఫలితంగా ఈ ఏడాది ప్రవేశాల నిరాకరించిన ఎన్‌ఎంసీ
- వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమిపై దుష్ప్రచారం
- ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటం
- ఎయిమ్స్ నిర్మాణానికీ అడ్డంకులు సృష్టించిన వైనం
- ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యసేవల లేమితో మృత్యుగంటలు
- ఆసుపత్రుల్లో కరెంట్ కోతలతో సేవలకు అంతరాయం
- ఆనక సన్నాయి నొక్కులు..ఛీకొట్టినా తీరు మార్చుకోని ఫేక్ రెడ్డి
ఐదేళ్ల వైసీపీ పాలనలో పాతాళానికి వైద్య ప్రమాణాలు
టీడీపీ హయాంలో 2014-2019 మధ్య వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిం ది. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య సురక్ష, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, బసవతారకం మదర్ కిట్స్, సీఎంఆర్‌ఎఫ్, కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.2,500 పెన్షన్, రాష్ట్రవ్యాప్తంగా 33 డయాలసిస్ కేంద్రాలు, రాజ ధాని అమరావతిలో 30 ఎకరాల్లో హెల్త్ స్ట్రీట్ ఏర్పాటు, రూ.3127.3 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల, ఎన్టీఆర్ ఉచిత చెకప్ స్కీమ్ వంటి 33 కొత్త పథకాలను విజయవంతంగా అమ లు చేసి నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో వైద్యప్రమాణాల్లో ఏపీ దేశంలోనే 4వ స్థానంలో నిలి చింది. అదే సందర్భంలో వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్‌రెడ్డి పాలనలో 10వ స్థానాని కి పడిపోవటం రాష్ట్రంలో వైసీపీ హయాంలో తలెత్తిన ఆరోగ్య విపత్తుకు నిదర్శనం.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజారోగ్యానికి ఉరి
ప్రజల జీవన విధానాన్ని అనునిత్యం ప్రభావితం చేసే వైద్యరంగం గడిచిన ఐదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆరోగ్య సంక్షోభం కూడా తలెత్తింది. జగన్‌రెడ్డి తన అసమర్థత పాలనతో వైద్య, ఆరో గ్య శాఖను భ్రష్టు పట్టించారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం రూపాయి విదల్చలేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేక మందులు, పరికరాల కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. చివరకు రోగులకు పారాసిట్మాల్ వంటి చిన్న చిన్న మందులు అందుబాటులో దుస్థితి. అత్యవసరమైన కుక్కకాటు, పాముకాట్లకు విరుగుడు ఇంజక్షన్లు లేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో బీపీ, షుగర్ మాత్రల నుంచి సర్జరీల కు వాడే గ్లౌజులు, దారాల వరకూ రోగుల కుటుంబసభ్యులు బయటే కొనుక్కుని తెచ్చుకో వాల్సిన పరిస్థితిలోకి నెట్టారు. కరెంటు కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టార్చ్‌లైట్ల వెలుతురులోనే ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ సౌకర్యం లేక డోలీలతోనే కి.మీ దూరం వెళ్లాల్సిన దుస్థితి. చివరకు శవాలను మోటారుసైకిళ్లపై తీసుకెళ్లాల్సిన పరిస్థితికి తెచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధిని సైతం మరుగున పడేశారు.
ఆరోగ్యశ్రీపై సన్నాయి నొక్కులు
ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా రోగుల ప్రాణాలు తీసిన జగన్‌రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తుంటే ఎలా అబద్ధాలు వల్లె వేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు అవగతం అవుతుంది. బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి ఆందోళనలు చేసిన విషయం గుర్తులేదా? బిల్లులు చెల్లించాలని 13 సార్లు నోటీసులుచ్చినా స్పందించలేదని స్వయానా ప్రైవేటు ఆసుపత్రులు చెప్పిన విషయం నిజం కాదా? వాస్తవాలు దాచేస్తే దాగేవి కాదు. గత ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య మం దక వందల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాలిలో కలిశాయి. వందల సంఖ్యలో రోగాలకు చికిత్స అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న జగన్‌రెడ్డి చిన్న చిన్న రోగాలకు వేల సంఖ్యలో డబ్బులు దోచే పరిస్థితికి ఆసుపత్రులను తెచ్చారు. ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు బకా యిలు పెట్టి ఆసుపత్రుల యాజమాన్యాలను రోడ్డెక్కే దుస్థితికి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. తొలివిడత రూ.162 కోట్లు, రెండో విడత రూ.200 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మరో రూ.300 కోట్లు చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ఎక్కడా వైద్యసేవలు ఆపిన దాఖలాలు లేవు. ఆసుప త్రుల యాజమాన్యాలు ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి.
మెడికల్ కాలేజీల ప్రవేశాలకు అనుమతులపై విషప్రచారం
ప్రజలు ఛీకొట్టినా విషప్రచారాలు, దిగజారుడు రాజకీయాలు మానుకోవడం లేదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై అబద్ధాల సాక్షిలో నిత్యం దుష్ప్రచారం చేయడం, ప్రతిపక్షం లోకి వచ్చాక ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా స్పందించడం మాని ప్రజా ప్రభుత్వంపై విషం కక్కడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్ మోడల్‌ను అధ్యయనం చేయాలని క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదేదో నేరం అన్నట్టు జగన్మోహన్‌రెడ్డి హడావుడి చేస్తున్నాడు. ఆయా రాష్ట్రాలు ఏఏ విధానాలు అవలంభిస్తున్నా యో అధ్యయనం చేయడం, ఉపయోగకరంగా ఉన్న వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు పరిశీలించడం తప్పెలా అవుతుందో ఆయనకే తెలియాలి. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కొత్త మెడికల్ కాలేజీలకు శాపంగా మారింది. 2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే అనుమతులిచ్చింది. ప్రారంభమైన ఐదు కాలేజీల్లో కూడా హాస్టళ్లు, బోధనాస్పత్రులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. తాత్కాలిక భవనాలు, అరకొర వసతు లతో ఉన్న కాలేజీల్లో కనీస వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు పడుతున్నారు. గతేడాది ప్రారంభించిన కాలేజీల పరిస్థితి ఇలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో నిర్మాణ దశలోనే ఉన్న 5 కాలేజీలకు (పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల) అడ్మిషన్ లకు అనుమతులకు జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేశారు. ఆయా కాలేజీల భవన నిర్మాణాలు పూర్తికాకపోవడం, బోధన సిబ్బంది కొరత, బ్లడ్ బ్యాంకులు కూడా లేని ఫలి తంగా కారణంగా 2024-25వ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిరాకరించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలకు ఒడిగట్టడం సిగ్గుచేటు.
వైద్యవిద్యకు పట్టం కట్టిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబుదే
స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్రంలోని వైద్యకళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల న్న సంకల్పంతో 1986లో విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ స్థాపించి సరికొత్త అధ్యా యానికి శ్రీకారం చుట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కళాశాలలు 22 కాగా, జగన్ రెడ్డి నాలుగేళ్లలో తెచ్చింది కేవలం ఐదు మాత్రమే. ఆ ఐదింటిలో కూడా విజయనగరం, ఏలూరు మెడికల్ కాలేజీలకు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను తెచ్చారు.
ఎయిమ్స్ నిర్మాణానికి అడ్డంకులు
2015లో కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 197 ఎకరాల భూమిని కేటాయించారు. చంద్రబాబు ముందు చూపుతో తెచ్చిన ఎయిమ్స్ ఇప్పుడు పేదల పాలిట సంజీవనిగా మారింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల వాసులకు కూడా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. మరి జగన్‌రెడ్డి చేసిందేమిటి? అదే ఎయిమ్స్‌కు గుక్కెడు నీరి వ్వకపోగా ఆసుపత్రి రహదారి నిర్మాణానికి కూడా అడ్డంకులు సృష్టించారు.
బి.సౌజన్య
అనలిస్ట్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్