- ప్రభుత్వం నుండి భూములు కొట్టేసేది వాళ్ళే
- బ్యాంక్ ల నుండి వాటిపై రుణాలు పొందేది వాళ్ళే
- నష్టపోయామని దివాలా పిటిషన్ వేసేది వాళ్ళే
- తిరిగి అతి తక్కువ ధరలకు కొనేది ఆ ముఠానే
- లేపాక్షి భూముల కుంభకోణంపై అచ్చెన్నాయుడు
అమరావతి: లేపాక్షి భూములపై ఇంకెన్ని సార్లు, ఎంతకాలం దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ఈ దోపిడీ ఇంకెన్ని సార్లు? ప్రభుత్వం నుండి భూములు కొట్టేసేది వాళ్ళే.. బ్యాంక్ ల నుండి వాటిపై రుణాలు పొందేది వాళ్ళే.. నష్టపోయామని దివాలా పిటిషన్ వేసేది వాళ్ళే.. రికవరీ కోసం బ్యాంక్ లు వేలం వేసే ఆ భూములను తిరిగి అతి తక్కువ ధరలకు కొనేది ఆ ముఠానేనని అన్నారు.
మొదటి సారి దోపిడీ: వైఎస్సార్ అండ్ జగన్
- ఆసలు కంపెనీనే లేదు.. కానీ ఆ కంపెనీకి భూములు కావాలి.. 10,000 ఎకరాలు సేకరించండి అని హుకుం. ఆర్డర్ జారీ చేసిన తర్వాత భూములు దొబ్బే గద్దలు కంపెనీ ని రిజిష్టర్ చేశారు.
- వేల కోట్ల ఎకరాలు అతి చవక ధరలకే, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా లేకుండా.. ఎన్నికలకు ముందు గద్దలకు కట్టబెట్టేశారు.
- అక్రమంగాచేసిన మేలుకు బదులుగా క్విడ్ ప్రోకో కింద జగన్‌రెడ్డి కంపెనీలలో ఆగద్దలు కోట్లాది రూపా యల పెట్టుబడులు.. చివరికి అవి జగన్ సొంతం.
- ప్రాంతాన్ని అభివృద్ధిచేస్తాం అని కారు చవకకు భూములు కొట్టేసి, ఆ అభివృద్ధి పనులు మాత్రం చేయరు.
రెండవ సారి దోపిడీ: భూమి పొందిన గద్దలు, తెర వెనుక రాజకీయ నాయకులు - తమవద్ద 10,000ఎకరాల వరకూ భూములుఉన్నాయని, తమ వ్యాపార వృద్ధి కోసం తమకు ఋణాలు కావాలి అని బ్యాంకుల వద్ద నుండి వేలాది కోట్ల రు ణాలు.. అందులో ఎన్ని వందల వేల కోట్లు ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించారో ఆ దేవుడికే తెలియాలి.
మూడవ సారి దోపిడీ: ఆ గద్దలు, జగన్ రెడ్డి బంధువులు - బ్యాంక్‌ల నుండి పొందిన వేలాది కోట్ల రుణాలు వాడుకు దొబ్బి, లేదా విదేశాలకు మళ్ళించి, లేదా వాటితో కొత్త ఆస్తులు కంపెనీలను బినామీలచే కొనిపించి, ఇప్పుడు బ్యాంక్ లు వడ్డీలు, అసలు కట్టమంటే.. మేము వ్యాపారాల్లో నష్టపోయామని, దివాలా పిటిషన్ వేయడం.
- తాము ఇచ్చిన అప్పుల్లో కనీసం పదో వంతయినా వెనక్కి తెచ్చుకోవడం కోసం.. ఆ భూములను బ్యాంక్ లు వేలం వేయడం.. కారు చవక కు అమ్మడం అన్నమాట.
- ఇప్పుడు మళ్ళీ అవేభూముల్ని,జగన్‌రెడ్డి మామ కొడుకే బ్యాంక్ ల నుండి అతి తక్కువ ధరకు కొనే యడం.. ఇప్పటి వరకూ జరిగింది, జరుగుతుంది ఇది. అయితే..
(1) వాగ్దానాలకు అనుగుణంగా పది వేల ఎకరాల భూములు పొంది, అభివృద్ధి చేయకుండా, ఉద్యోగ ఉపాధి కల్పన చేయని కారణంగా ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసి భూములను వెనక్కి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేసిందా? చేస్తుందా? లేక జగన్ రెడ్డి బంధువులు వాటిని ఎగరేసుకుపోతుంటే చూడనట్లు కళ్ళు మూసుకుంటుందా? ప్రజల, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమి చేస్తారు?
(2) 33,000 ఎకరాల ప్రజా రాజధాని అమరావతిలో కొద్ది ఎకరాలు ఏవో అసైన్డ్ భూములు ఉన్నాయి అని తోక తెగిన కోతుల్లా నానా యాగీ చేసి, కేసులు వేసిన వారు.. లేపాక్షి హబ్ లో 5000 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్ ను కట్టబెట్టిన నాటి సీఎం వైఎస్, నాటి రెవిన్యూ మంత్రి ధర్మాన లను అది ప్రశ్నించరా?
(3) ఈ దోపిడీ చక్రం మూడవ సారితో నైనా ఆగుతుందా?? లేక నవదోపిడీ లు పూర్తి కావాల్సిందేనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.