- ప్రచారంలో ‘కోడ్’ ఉల్లంఘిస్తున్న జగన్‌రెడ్డి
- చంద్రబాబుపై అసభ్య దూషణలు
- తగిన చర్యలు తీసుకోవాలి
- సీఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
అమరావతి (చైతన్యరథం): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ)కు లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి ఎన్నికల చట్టం పరిమితులను దాటి ప్రసంగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అమర్యాదకర, అసభ్య పదజాలాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబుపై నిరాధార నిందలు మోపుతున్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్, టీడీపీ చెప్పినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. రాజకీయ మైలేజీని పొందేందుకు వృద్ధులైన పింఛన్‌దారులను మండుటెండల్లో సచివాలయాల వద్ద నిరీక్షించేలా వైకాపా ప్రభుత్వం చేసింది. పెన్షన్ దారులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిని హంతకుడు, దెయ్యం అని ఓ సీఎం అనడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు. ఎన్నికల చట్టం, Iూజ ప్రకారం జగన్ రెడ్డి చేసిన దుష్ప్రచారానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సీఈసీని వర్ల రామయ్య కోరారు.