- ప్రతిపక్షాలు నిలదీస్తాయన్న భయం
- సుప్రీం కోర్టు తప్పుపట్టినా ప్రవేశపెట్టనున్న 3 రాజధానుల బిల్లు
- చట్టసభలు ఎక్కువ రోజులు నిర్వహిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి
- శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
అమరావతి: ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యతను జగన్‌రెడ్డి తగ్గించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామ కృష్ణుడు మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలకు చట్టసభలు ప్రజాకోర్టు లాంటివని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా తీరు, ప్రజా సమస్యలను చర్చించే వేదిక చట్టసభ అని తెలి పారు. ప్రభుత్వ చేతగాని పాలనను ప్రతిపక్షాలు నిలదీస్తాయని జగన్‌రెడ్డికి భయం పట్టుకుందన్నారు. శాస నసభలు విధిగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. చట్టసభలకు హాజరవ్వడం సభ్యుని ప్రధాన బాధ్యత అని తెలిపారు. చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు కూడా భావించినట్లు పేర్కొన్నారు. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ వ్యతిరేక చర్యల కు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి సగటున 25రోజులు మించి చట్టసభలు నిర్వహిం చలేదన్నారు. గత ఏడాది కేవలం 15 రోజులు మాత్రమే నిర్వహించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కువ రోజులుసభలు నిర్వహించినట్లు వివరించారు. చట్టసభలు ఎక్కువ రోజులు నిర్వహిస్తేనే వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టసభలు నిర్వహించకుండా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆరాటపడుతుందని ధ్వజమెత్తారు. వ్యవసాయం నుంచి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలేదని, విద్యుత్, వ్యవసాయ రంగాలు దెబ్బతిన్నాయని, జలవనరుల ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, విద్యా రంగం అట్టడుగు స్థాయికి చేరిందని తెలి పారు. అనేక సమస్యలతో ప్రజలు కొట్టు మిట్టాడుతు న్నారన్నారు. వీటన్నింటిపై చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుందన్న భయంతోనే తక్కువ రోజులు సమావేశాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు.