- చంద్రబాబు పాలనతోనే మైనార్టీల అభివృద్ది, సంక్షేమమని స్పష్టం చేసిన టీడీపీ నేతలు
- టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
అమరావతి: మైనార్టీ ద్రోహి జగన్‌రెడ్డికి మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని టీడీపీ నేతలు అన్నారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాళలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌రెడ్డి వారిని అన్ని విధాల దగా చేస్తున్నారని మండిపడ్డారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సభలో జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. అబద్ధం అనే పదానికి సీఎం జగన్‌రెడ్డి పర్యాయపదంగా మారారు. జగ న్మోహన్రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల్లో అందరికీ ఇస్తున్న పథకాలను సైతం మైనారిటీ బడ్జెట్లో లెక్కించి తిమ్మిని బమ్మిని చేసి గత ప్రభుత్వ పథకా లను తుంగలో తొక్కి వంచిస్తున్నారు.
2019 జూన్ నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించారు. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి పలికి.. ముస్లిం, క్రైస్తవ మైనారిటీ యువత స్వావలంబన పథకాలకు ముగింపు పలికారు. ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్ష చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం దుకాన్`మకాన్ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిం చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిం టిని అర్ధాంతరంగా నిలిపేశారు. మైనార్టీల కోసం చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీ కోసం 120ఎకరాలు కేటాయించి దాదాపు 20 శాతం పనులు పూర్తి చేస్తే, జగన్‌రెడ్డి దాన్నిపూర్తిగా పక్కన పెట్టారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాపంల్లిలో,నవ్యాంధ్రలో రూ.25కోట్ల వ్యయం తో కడపలో హజ్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. రూ.80కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ ఏర్పా టుకు చంద్రన్న ప్రభుత్వం పూనుకోగా జగన్‌రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టింది. వైసీపీ పాలనలో మైనా ర్టీలకు రక్షణ లేకుండా పోయింది. మైనార్టీలపై వేధింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. మైనా ర్టీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్‌ని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించటం లేదు? మీపదవుల కోసం బానిసలుగా మారి జాతి ప్రయో జనాలు తాకట్టు పెట్టొద్దని టీడీపీ నేతలు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు,ఎమ్మెల్సీ అశోక్‌బాబు, నాలెడ్జ్ సెంటర్ కో ఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి, మైనార్టీసెల్ అధ్యక్షుడు మౌలానాముష్తాఖ్ అహ్మద్, అధికార ప్రతినిధి సయ్యద్ రఫీి, సంయుక్త కార్య దర్శి ఫతావుల్లా, ఉపాధ్యక్షులు అమానుల్లా, నరస రావుపేట నాయకులు అమీర్అలీ,గుంటూరు పార్ల మెంట్ జనరల్ సెక్రటరి రుస్తుమ్, మైనార్టీ నాయ కులు ఎండీ ఫిరోజ్,కరీముల్లా, రఫీి, బాజీ మాష్టర్, సైదావలి, షేక్ ఖలీల్, సలాం, మహమ్మద్ నూర్, మోసిద్ మహ్మద్, దేవినేని శంకర్‌నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.