- వంతెన రంగు మార్చిన బడుద్దాయి
- అసమర్థకు రంగుల పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలకే ప్రమాదం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపటు
అమరావతి: జగన్‌రెడ్డి మెప్పు కోసం ఓ ఉన్నతాధికారి పడరాని పాట్లు పడినట్లు, ఓ వంతెన రంగు కూడా మార్చినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బాధ్యత మరిచిన బడుద్దాయిలా, పదవిలో ఉన్న బులుగు పార్టీ కార్యకర్తలా ప్రవర్తించాడని శుక్రవారం ఆయన ట్వీట్ చేశా రు.రోడ్ సేఫ్టీ కోసం అధికారికంగా కొన్ని ప్రమాణాలు పాటిస్తారని, అందులో ఒకటి పసుపు, నలుపు రంగు లను రోడ్డు చివర డివైడర్లు, ఇతర నిర్మాణాలకు వాడ తారని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి పసుపు కనపడకూడదని ఓ ప్రభుద్ధుడైన అధికారి వంతెన రంగుమార్చినట్లు తెలిపారు. అంతేకాకుండా, చివరకు కలశం కూడా పసుపు రంగులో ఉండ కూడదని చెప్పినట్లు పేర్కొ న్నారు. ఇలాంటి పెంపుడు జంతువులు పనులకోసం తమ వద్దకు వచ్చే సామాన్య ప్రజలకు కులం, మతం, పార్టీ చూడకుండా నిష్పక్ష పాతంగా సేవ చేయగలరా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల గురించి రెండు నెలల క్రితం ఇదే వేదిక(ట్విటర్)గా ముఖ్య మంత్రిని ప్రశ్నించినట్లు తెలిపారు. అసలే రోడ్లు దౌర్భాగ్య స్థితిలో ఉంటే, ఇలాంటి అధికారులు తమ తుగ్లక్ నిర్ణయాలతో అడ్డగోలుగా రంగులు మార్చి వేస్తే, వాహనదారుల ప్రాణాలకు ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.చేతనైతే రాష్ట్రంలో గుంతలు పడిపోయిన రోడ్లను బాగు చేయాలన్నారు. మీ అసమర్థతకు కొత్త గా ఇలాంటి రంగుల పైత్యం తోడయితే ప్రజల ప్రాణా లు గాల్లో కలిసే ప్రమాదం ఉందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. .