వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలి
వైద్యుడి తల్లికి వైసీపీ గూండాల బెదిరింపులు దుర్మార్గం
అమరావతి: రాజన్న రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నట్టు గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్యపై ఏం సమాధానం చెబుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. డాక్టర్ శివ కిరణ్ చౌదరి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే బాధ్యత.. భూ కబ్జాలు చేయడం, దోచుకుని దాచుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు ఎంతకైనా బరితెగిస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు విమర్శించారు. శివ కిరణ్ నుంచి భూమి కొనుగోలు చేసిన మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, అతడి అనుచరుడు పెదబాబు, పీఏ బాలాజీ సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించలేదు. డబ్బులు ఇవ్వండి లేక దస్తావేజులైనా తిరిగి ఇమ్మని ప్రాధేయపడిన వైడ్యుడిపై అధికార మదంతో బెదిరింపులకు పాల్ప డటం జగన్‌రెడ్డి నియంతపాలనలోనే సాధ్యమవు తోంది. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కిరణ్ గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై ఫిర్యాదు చేసిన శివ కిరణ్ తల్లిపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గం. వైసీపీ నేతల భూ దాహానికి ఇంకెంతమంది బలికావాలి? జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబు స్పందించాలి.భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిగించాలి. కన్నబాబు సోదరుడు, అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆచ్చె న్నాయుడు డిమాండ్ చేశారు.