- ఆయన అరాచకం ముందు ఎస్కోబార్ కూడా పనికిరాడు
- అంబేద్కరిజంపై దాడి చేసిన దళిత ద్రోహి జగన్ మాత్రమే
- వివేకా విగ్రహంపై అవినాష్,జగన్ పేర్లకు సునీత ఒప్పుకుంటే…
- అంబేద్కర్ విగ్రహంపైనా వేసుకునేందుకు ఒప్పుకుంటాం
- దాత అని చెప్పడం సిగ్గుచేటు..వాళ్ల తాత,నాన్న తెచ్చిపెట్టాడా?
- విగ్రహం పేరుతో రూ.250 కోట్లు స్వాహా చేశారు
- అంబేద్కర్ కాళ్ల కింద కరుడుగట్టిన నేరస్తుడి పేరు అవమానమే
- ఆయన పేరును దళిత సమాజం కూడా ఓప్పుకోవడం లేదు
- అవమానం జరిగిందనే ఎవరో పేరును తొలగించి శుద్ధి చేశారు
- ప్రేమ ఉంటే పులివెందులలో ఎందుకు విగ్రహం పెట్టలేదు?
- ఆ ఘటనపై జగన్ కో ఫేక్ ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుచేటు
- దళితులు, కమ్మల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్రలు
- దళిత బిడ్డగా జగన్‌రెడ్డి పేరు తొలగింపును హర్షిస్తున్నా
- చంద్రబాబు, లోకేష్‌లపై విష ప్రచారాన్ని ఖండిస్తున్నా
- కేసులు నమోదు చేయకుంటే ధర్నాకు దిగుతాం
- రాష్ట్రానికి సాక్షి మీడియా, వైసీపీ పార్టీతో పెనుముప్పు
మంగళగిరి(చైతన్యరథం): కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ అండ్ కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని.. చంద్రబాబు, లోకేష్‌లపై కావాలనే విష ప్రచారం చిమ్ముతున్నారని.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు వివేకాను చంపి గుండెపోటు అని బ్లూ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి దాన్ని చంద్రబాబు, టీడీపీలపై రుద్దారు.. వివేకా హత్య, కోడి కత్తి నాటకం జగన్ డ్రామాలేనని సీబీఐ, ఎన్‌ఐలే తేల్చాయి.. చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షాన ఉంటానని చెబితే దాన్ని వక్రీకరించి వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించడం వారికి అలవాటేనన్నారు. లోకేష్ మాట్లాడిన దాంట్లో ముందు వెనుక కట్ చేసి దాన్ని దళితులపై తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు మనుషులకు పుట్టారా? తప్పులకు పుట్టారా? అని అనిపిస్తోం దని ధ్వజమెత్తారు. స్మృతివనంలో అంబేద్కర్ కంటే జగన్ పేరు కనపడేలా తాటికాయంత అక్షరాలతో రాయించుకున్నాడు…అంబేద్కర్ పేరు తీసేసి వైఎస్‌ఆర్ విదేశీ విద్యాకానుక అని పెట్టుకున్నాడు…దాంతో ఎవరికో కోపం వచ్చి జగన్ పేరును తొలగించారని వ్యాఖ్యానించారు.
దళితుడిగా హర్షిస్తున్నా…
పేర్ల తొలగింపు పనులు చేయడాన్ని టీడీపీ తరపున ఖండిస్తున్నాం. వారి మీద పార్టీ చర్యలు తీసుకుంటుంది. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండిరచినా… ఒక దళితుడిగా జగన్ పేరును తొలగించడంపై ఆనందపడ్డానని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి వ్యభిచారులకు నాయకుడు. దువ్వాడ శ్రీనివాస్‌కు నేను గార్ల్ ఫ్రెండ్ అంటూ ఒక మహిళ బయటకు వచ్చిం ది. ఆమే ఆ విషయం చెప్పిందన్నారు. అంబటేమో ఓ మహిళతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు…గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ మాట్లాడుతూ దొరికాడు. .ఇలాంటి వ్యభిచారులందరికీ జగన్ రెడ్డి నాయకుడని వ్యాఖ్యానించారు. వ్యభిచారుల నాయ కుడికి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
హంతకులు, గంజా, డ్రగ్స్ మాఫియాలకు డాన్ జగన్‌రెడ్డి
దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్‌బాబుకు, బాబాయిని చంపిన అవినాష్ రెడ్డికి, డాక్టర్ సుధాకర్‌ను రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి చంపిన పెట్ల గణేష్ లాంటి నాయకు లందరికీ పెద్ద డాన్ జగన్‌రెడ్డి.. గంజాయి డాన్ జక్కంపూడి, డ్రగ్స్ డాన్ ద్వారంపూడి లాంటి వారికీ జగనే నాయకుడన్నారు. కరుడు గట్టిన నేరస్తుడు జగన్ రెడ్డి ముందు ఎస్కో బార్ కూడా ఎందుకు పనికిరాడని ఎద్దేవా చేశారు. వివేకా విగ్రహం పెట్టి దానిపై అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి పేరు వేసుకుంటే దానికి సునీతారెడ్డి ఒప్పుకుంటే…అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు వేసుకోవడానికి ఒప్పుకుంటామని తెలిపారు. వివేకానందరెడ్డిని చంపింది వాళ్లే… చంపినోళ్లే పేరు వేసుకోవడం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద దాడులు, చంపేయడం, శిరోముండనాలు చేయడం, శవాలను ఇళ్ల ముందు విసిరేయడం, దళితుల 27 పథకాలను రద్దుచేయడం, పథకాలకు అంబేద్కర్ పేరును తీసేయడం.. ఇలా దారుణంగా అంబేద్కరిజంపై దాడి చేసిన ద్రోహి జగన్‌రెడ్డి లాంటి వ్యక్తిని అంబేద్కర్ విగ్రహానికి దాత అని కొందరు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా? వాళ్ల నాన్న వైఎస్ డబ్బులు తెచ్చి పెట్టాడా? అని ప్రశ్నించారు.
విగ్రహం పేరుతో రూ.250 కోట్లు నొక్కారు
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో అంబేద్కర్ విగ్రహం కట్టారు.. పక్క రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ.146 కోట్లకు కడితే.. ఇక్కడ రూ.400 కోట్లు కట్టారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో కూడా రూ.250 కోట్లు దోచుకున్నారని అన్నారు. దళితుల మీద జగన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఒక్క 8 అడుగుల విగ్రహం కూడా పులివెందులలో ఆయన ఇంటిముందు ఎందుకు పెట్టించలేదు? అని ప్రశ్నించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకున్నా కానీ జగన్ రెడ్డి ఒప్పుకోకుండా కుట్రకు తెరలేపి సొంత మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలెట్టించాడని మండిపడ్డారు. జగన్ రెడ్డిని ఇంకా నమ్మేవారు ఉన్నారంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడన్నారు. చంద్రబాబును దళితులకు వ్యతిరేకిగా చిత్రీకరించాలని వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారని..అందుకే 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి సైతం లేచి గౌరవించేలా బాలయోగిలాంటి దళిత నేతలకు చంద్రబాబు గొప్ప స్థానం ఇచ్చి దళితులకు 27 పథకాలు తెచ్చారు. దళిత బిడ్డలు విదేశాలు వెళ్లి చదువుకుంటే అంబేద్కర్ అంత గొప్పవాళ్లు అవుతారని ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా కానుక అని పేరు పెట్టింది చంద్రబాబేనన్నారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను విదేశాలను పంపి చంద్రబాబు చదివించాడని.. అలాంటి దళిత బందువైన చంద్ర బాబును దళితులకు దూరం చేయాలని విద్వేషాలు రెచ్చగొట్లాని భయంకరమైన కుట్రలకు తెలరలేపిన జగన్‌రెడ్డిని వెంటనే రాష్ట్ర డీజీపీ కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు.
జగన్‌రెడ్డి పేరుపైనే దాడి..అంబేద్కర్ విగ్రహంపై కాదు
అక్కడ జరిగింది జగన్‌రెడ్డి పేరు పైనే దాడి… అంబేద్కర్ విగ్రహంపై కాదని తెలిపారు. దాన్ని రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు చూస్తున్నారన్నారు. రూ.150 కోట్లతో ప్రపంచ నగరం అమరావతిలో నిర్మించడానికి 30 ఎకరాలను కూడా నాడు చంద్ర బాబు కేటాయించారు. అమరావతిని నాశనం చేయాలని.. అంబేద్కర్ విగ్రహాన్ని విజయ వాడలో పెడితే కమ్మ సొదరులు వ్యతిరేకిస్తారు.. అప్పుడు దాన్ని కమ్మలు, దళితులకు మధ్య గొడవగా క్రియేట్ చేయాలని గత ఎన్నికల ముందు జగన్‌రెడ్డి ప్లాన్ చేశాడన్నారు. కమ్మ వాళ్లపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, కమ్మవాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పట్టిన శని సాక్షి టీవీ, సాక్షీ పేపర్, వైసీపీ పార్టీ. వీళ్ల వల్ల రాష్ట్రానికి పెను ముప్పు ఉంది.. వీళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బాగు కోసం 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు నమోదు చేయకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.