- గ్రూప్ 1 కుంభకోణంలో ప్రధాన దోషి జగన్‌రెడ్డే!
- తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి
- గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు దారుణాలకు పాల్పడ్డారు
- రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ
- యువత తెగించి తిరగబడాలి
- అధికారంలోకి వచ్చాక దోషులందర్నీ శిక్షిస్తామన్న చంద్రబాబు
అమరావతి, చైతన్యరథం: ఏపీపీఎస్సీలో అక్రమా లకు పాల్పడి యువత గొంతు కోశారని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డినే ప్రధాన దోషి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. క్రూర మృగాల మాదిరిగా జగన్‌రెడ్డి, సజ్జల రామకృషా ్ణరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, గౌతమ్ సవాంగ్, సీతారామాం జనేయులు కలిసి యువత జీవితాలను నాశనం చేశా రని అన్నారు. యువత భవిష్యత్‌తో ఆడుకున్న జగన్ రెడ్డికి పాలించే అర్హత లేదన్నారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవా లని, ఆయన్ను తమ పార్టీ బృందం కలిసి.. కారుకులపై చర్యల తీసుకోవాలని కోరుతుందని చెప్పారు. నిబంధన లకు విరుద్ధంగా మూడుసార్లు పేపర్లను వాల్యూయేట్ చేసి యువత జీవితాలతో ఆడుకోవడమే కాక హైకోర్టు కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన గౌతంసవాంగ్, సీతారా మాంజనేయులు ఐపీఎస్ పదవులకు అనర్హులని, వీరిద్ద రితోపాటు సీఎం కార్యాలయంలో ఉన్న ధనుంజయ్ రెడ్డిపైనా కూడా విచారణజరపాలని డిమాండ్ చేశారు.
జగన్‌రెడ్డినే ప్రధాన దోషి
ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల్లో అక్ర మాలు చేసేందుకు తాడేపల్లి కొంప నుంచే ఆదేశాలు వెళ్లాయని అన్నారు.ఇది ఉద్ధేశ్యపూర్వకంగా పక్కా ప్రణా ళికతో తాడేపల్లి కొంప నుంచి జరిపిన కుంభకోణమని అన్నారు. ఇందులో జగన్‌రెడ్డినే ప్రధాన దోషి అని అన్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలను హైకోర్టు నిగ్గు తేల్చిన తర్వాత ఆ తీర్పుపైన అప్పీలుకు వెళతామని ప్రకటించడం దోషులను కాపాడడానికే అన్నారు. యువత జీవితాలతో ఆడుకొని, వారిని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన స్థితిలోకి నెట్టిన ఈ క్రూర మృగాలను మనుషులని అనలేమని, వింత జంతువులన్నా తక్కువేనని, ఏమని పిలవాలో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్‌రెడ్డి బృందం చేసిన అక్రమాలకు బయపెట్టేందుకు గ్రూప్ వన్ అభ్యర్ధులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఐదేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారని చెప్పారు. శుక్రవారం చంద్రబాబు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల వాల్యూయేషన్‌లో జరిగిన అక్రమాలను సాక్ష్యాలతో సహా వీడియో ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రాజకీయ పునరాస కేంద్రంగా ఎపీపీఎస్సీ
చంద్రబాబు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ బోర్డు ఛైర్మన్‌గా సరైన వారు ఉంటే అంతా సక్రమంగా నడుస్తుందని, కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్ధవంతంగా పనిచేస్తున్న ఛైర్మన్ ఉదయ్ భాస్కర్‌ను వేధించి బయటకు పంపేశారని చెప్పారు. ఆ తర్వాత డీజీపీగా పనిచేసిన కాలంలో కళింకిత చరిత్ర ఉన్న గౌతమ్ సవాంగ్‌ను తీసుకొచ్చి ఛైర్మన్‌గా నియమించారని, అక్కడ నుండి ఏపీపీఎస్సీలో విచ్చలవిడిగా అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. 22 ఏళ్ల పాటు టీడీపీ ప్రభుత్వాల హాయంలో ఏపీపీఎస్సీ నియామకాలకు సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రాలేదని, సమర్ధవంతులను బోర్డు మెంబర్లుగా పెట్టి ఎంతో పారదర్శకంగా పోస్టులు భర్తీ చేసామని చెప్పారు. కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్‌కు పునరావసం కల్పించేందుకు ఛైర్మన్‌గా నియమించారని, అంతేకాక బోర్డు సభ్యులుగా ఎంత మాత్రం అర్హతలు లేని… వారి పార్టీ నేతలు, బంధవులైన సలాంబాబు, సుధీర్, సోనీవుడ్, సివి శంకర్‌రెడి,్డ సెలీనా లాంటి వ్యక్తులను జగన్‌రెడ్డి నియమించారని, ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చాక దోషులను శిక్షిస్తాం
గ్రూప్ వన్ అభ్యర్ధులు నానా కష్టాలు పడి ఐదేళ్ల పాటు పోరాటం చేసి హైకోర్టు ద్వారా అక్రమాలను రుజులు చేయలేకపోతే తాము అంతా సక్రమంగానే చేశామని ఈ దుర్మార్గులు రొమ్ము విరుచుకొని తిరిగేవారని అన్నారు. యువత అశలను నాశం చేసిన జగన్‌రెడ్డికి పాలించే అర్హత లేదన్నారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్నారు. తాము అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులతోపాటు బోర్డు మెంబర్లపై కూడా చర్యలు తీసుకుంటాని, సమగ్ర విచారణ జరిపి జైలుకు కూడా పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. దుర్మార్గుల పాలనలో ఎంత బరితెగింపు ఉంటుందో ఇదొక ఉదాహరణ అన్నారు.
తాడేపల్లి కొంప నుంచి వచ్చిన ఆదేశాలతో గౌతమ్ సవాంగ్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టులు అంటే కూడా భయం లేనట్లుగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర యువతకు జరిగిన అన్యాయం చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. యువత ఆశలను చంపి, జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ఏం చేసినా తప్పులేదని, తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు..కానీ కావాలని యువత గొంతు నులిమే క్రూర మృగాలను క్షమించకూడదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంపికై ప్రజలకు సేవ చేయాలన్నది కొందరి కలని, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలన్నది వారి ఆలోచన అని, అటువంటి వారి ఆశలన్నీ నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
యువత తిరగబడాలి
ఇన్నాళ్లూ జగన్‌రెడ్డి అక్రమాలు, నిర్బంధాలను చూసి భయపడుతూ ఉన్న యువత, ప్రజలు ఇప్పటికైనా తెగించి తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ భవిష్యత్తును రక్షించుకునేందుకు యువత అంతా రోడ్లపైకి రావాలన్నారు. జగన్‌రెడ్డి ఎవ్వరికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో అవినీతి, అక్రమాలకు, దాడులకు, తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లు నిత్యకృతమై పోయాయని అన్నారు. ఆంధ్రా యువత ప్రపంచమంతా తమ శక్తి సామార్ధ్యాలను చాటుతుంటే రాష్ట్రంలో మాత్రం జగన్‌రెడ్డి యువత భవిష్యత్‌ను, ఆశలను నాశనం చేస్తున్నారని, ఇప్పటికైనా ఈ అన్యాయాలను ఎదిరించి బయటకు రాకుంటే రాష్ట్రం వదలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితేనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.