- గంజాయి, డ్రగ్స్‌తో యువతను సైకోలుగా మార్చాడు
- ఐదేళ్ల పాలనలో 2 లక్షల నేరాలు జరిగితే నోరుమెదిపారా?
- శాంతిభద్రతల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా?
- బాధితులను ఏనాడైనా పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా?
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం
- కరపత్రిక సాక్షిలో అబద్ధపు రాతలు మానుకోవాలని హితవు
మంగళగిరి(చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో మహిళలపై 2 లక్షల నేరాలు జరిగితే నోరు మెదపని జగన్‌రెడ్డి ఇప్పుడు చంద్రబాబును వేలెత్తి చూపడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిప డ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు, శాంతి భద్రతలు క్షీణించాయని పెడబొబ్బ లు పెడుతున్న జగన్‌రెడ్డికి అసలు శాంతిభద్రతల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం ఒక్క 2022లోనే మహిళలపై 25,503 నేరాలు జరిగాయి. జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు 66.4 శాతం కాగా ఏపీలో జగన్ పాలనలో 96.2 శాతం నమోదయ్యాయి. ఐదేళ్ల ఆయన పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసి గంజాయి, డ్రగ్స్, విషపూరిత మద్యంతో యువతను సైకోలుగా మార్చాడు. ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హెరాయిన్, బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాల కంటైనర్ పట్టుబడడం, దీని వెనుక జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నాడనేది జగ మెరిగిన సత్యమన్నారు. డ్రగ్స్, గంజాయితో యువత భవితను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఆడిపోసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో మృగాళ్లుగా మారిన మగాళ్ల వల్ల 2027 మంది మహిళల హత్యలు, వేలాదిమంది మహిళలపై అత్యాచారాలకు గురయితే ఒక్క రోజూ స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్‌లా బెంగళూరు నుంచి రాష్ట్రానికి వస్తూ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. మీ హయాంలో ఒక్కసారైనా ప్రెస్‌మీట్ పెట్టి మహిళలకు అండగా ఉంటామని చెప్పావా జగన్‌రెడ్డి? పిన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్న సైకో జగన్ ఆడబిడ్డలకు ఏమి అండగా ఉంటాడని ధ్వజమెత్తారు.
మహిళలకు రక్షణగా కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అనకాపల్లి జిల్లాలో బాలిక హత్య ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి 20 ప్రత్యేక టీమ్‌లను ఏర్పా టు చేసింది. శిక్షిస్తారనే భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చీరాలలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై చంద్రబాబు డీజీపీతో స్వయంగా మాట్లాడటమే కాకుండా హోంమంత్రిని చీరాల పంపించారు. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. పుంగనూరులో అస్సియా మృతి కేసులో 12 పోలీసు బృందాలు పనిచేసి నిందితులను అరెస్టు చేశారు. హోంమంత్రితో కూడిన ముగ్గురు మంత్రుల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. పాప తండ్రితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. సత్య సాయి జిల్లాలో జరిగిన అత్తా, కోడళ్లపై అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను అరె స్టు చేశారు. బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను 24 గంట ల్లోనే పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలిస్తున్నారు. ఏనాడైనా జగన్‌రెడ్డి మహిళల భద్రత గురించి డీజీపీతో మాట్లాడారా? హోంమంత్రిని ఏనానైనా ఘటనా స్థలానికి పంపించారా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమి చర్యలు తీసుకున్నారో చర్చకు సిద్ధమా? గోరంట్ల మాధవ్, విజయసాయిరెడ్డి, దువ్వాడ, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాం టి వాళ్లను పక్కన పెట్టుకుని మీరు చంద్రబాబును విమర్శిస్తున్నారా? లేని దిశా చట్టం పేరుతో ఉత్తుత్తి హడావిడి చేసిన జగన్‌రెడ్డి బాధిత మహిళలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు.
నేరాలు, ఘోరాలకు కేరాఫ్ జగన్‌రెడ్డి
జగన్‌రెడ్డి ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకట రెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్టు చేయకుండా చోద్యం చూసిన ఆయనకు ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆయన పాలనలో ఆగస్టు 15న రమ్య అనే ఎస్సీ యువతిని నడిరోడ్డుపై యువకుడు నరికి చంపినప్పుడు మాట్లాడలేదేం? జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైతే పట్టించుకోకపోగా ప్రశ్నిం చిన టీడీపీ దళిత నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాడు. ఒక ఎమ్మెల్యేగా కూడా జగన్‌రెడ్డ్డి అనర్హుడు. మహిళలకు రక్షణ కల్పించటంలో ఘోరంగా విఫలమైన జగన్ రెడ్డి నేడు చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు. జగన్‌రెడ్డి హయాంలోనే ఏపీ నేరాలు, ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అతిపెద్ద నేరస్తుడైన ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీని నేరస్తుల సామ్రాజ్యంగా మార్చాడని ధ్వజమె త్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు స్వేచ్ఛ లబించింది. ఎవరైనా మహిళల పట్ల తప్పు చేయాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగినా క్షణాల్లో పోలీ సులు వాలిపోయి నిందితులను అరెస్టు చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా రక్షణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయి. ప్రజలు ప్రశాం తంగా ఉన్నారు. కరపత్రిక సాక్షిలో అబద్ధ్దపు రాతలు మానుకోవాలని హితవుపలికారు.