అమరావతి,చైతన్యరథం: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమఅరెస్టులకు పాల్పడుతూ, కొందరు పోలీస్ అధికారులు విచ్చలవిడిగా బరితెగిస్తున్నారని, అందుకు ప్రధాన కారణం జగన్ రెడ్డేనని, అతని తాయిలాలు.. బెదిరింపులకు భయపడి కొందరు పోలీసు లు చట్టాలను తుంగలో తొక్కుతూ మితిమీరిన స్వామిభక్తితో ప్రవర్తిస్తూ.. సమస్య లు కొని తెచ్చుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పోలీస్ శాఖతో తెలుగుదేశానికి.. ఆపార్టీ నేతలకు ఎలాంటి రాజకీయ వైరుధ్యాలు లేవు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.. దాని అనుబంధ విభాగాల్లోని కొందరు అధికారు లు.. కొద్దిమంది సిబ్బంది బరితెగించి ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదే తమ ప్రశ్న. టీడీపీప్రభుత్వంలో రౌడీయిజం..ఫ్యాక్షనిజం..గూండాయిజం.. సంఘవిద్రో హ శక్తుల కట్టడిలో సమర్థవంతంగా వ్యవహరించి, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణలో దేశస్థాయిలో ప్రశంసలు పొందిన ఏపీ పోలీస్ శాఖ నేడు ఇలా దిగజారి పోవడానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డే. తన స్వార్థంకోసం.. తన పనులు చక్కబెట్టుకోవడానికి జగన్ రెడ్డి పోలీసుల్ని…ఇతర అధికారుల్ని బాగా వాడుకొని తరువాత విసిరి అవతల పడేస్తాడనే వాస్తవాన్ని.. ఇప్పుడు రెచ్చిపోయి పనిచే స్తున్న పోలీసులు గుర్తించాలి. గతంలో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను.. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్.వీ.సుబ్రహ్మణ్యాన్ని.. గతంలో సీఐడీ బాస్ గా వెలగబెట్టి న సునీల్ కుమార్ల పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. శాంతి భద్రతలు, ప్రజారక్షణలో విఫలమై.. ప్రతిపక్షనేతలు.. ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులకు సమాధానం చెప్పుకోవడానికి కొందరు పోలీస్ అధికారులు చేతులు కట్టుకొని కోర్టుల్లో కూడా నిలబడ్డారు.
నరేంద్ర బెయిల్ విషయం న్యాయస్థానంలో విచారణలో ఉండగానే, పోలీసులు ఆయన అరెస్ట్ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది?
జగన్ రెడ్డి పనులు చేయడానికి..అతనికి బానిసత్వం చేయడానికే తామున్నామనే విధంగా ఇప్పటికీ కొందరు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని రక్షించి, న్యాయాన్ని కాపాడాల్సిన వారే బాధితుల్ని హింసిస్తూ.. తప్పుచేసిన వారికి వంతపాడటం పోలీస్ వ్యవస్థకే అవమానకరం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్ట్ కోసమని పోలీసులు నేడు పరిధిదాటి వ్యవహరించారు. నరేంద్రను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రొక్లెయిన్లు తీసుకొని మరీ సంగండెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద వీరంగం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నరేంద్ర ఏమైనా సంఘవిద్రోహశక్తా..ఆయన పై గతంలో ఏమైనా కేసులున్నాయా? ఆయనపై ఒక వ్యక్తి మోపిన అరోపణపై, సెక్షన్ 307 పోలీసులు నమోదు చేయగా.. దానికి సంబంధించిన బెయిల్ పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. నరేంద్ర అరెస్ట్ కోసం పోలీసులు ఆత్రుతగా వెంపర్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ఆదేశాలతో అలా వ్యవహరించారు? రాము అనే వ్యక్తి పెట్టిన తప్పుడు కేసు ఆధారంగా నరేంద్రను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లడం ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపుల్లో భాగం కాదా?
రాము అనే వ్యక్తి సంగం డెయిరీ నుంచి రావాల్సిన బోనస్ డబ్బుల విషయంలో ప్రశ్నించాడని.. దానికి అతనిపై అక్కడి సిబ్బంది.. సెక్యూరిటీ గార్డ్స్ దాడిచేశారని… వారితో కలిసి ధూళిపాళ్ల నరేంద్ర తనను చంపడానికి ప్రయత్నించారని అతను తప్పుడు కేసుపెడితే.. అతని వాదనల్లో నిజానిజాలు ఏమిటో నిర్థారించుకోకుండానే పోలీసులు నరేంద్ర అరెస్ట్ కోసం అంత రాద్ధాంతం చేయడం ఏమిటి? రాముపై నిజంగా సంగం డెయిరీ సిబ్బంది, నరేంద్ర దాడిచేశారో లేదో పరిశీలించరా? ఎవరైనా వ్యక్తి తనకు గిట్టనివారిపై తప్పుడు కేసు పెడితే, పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే నిందితుడిగా చెప్పబడే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తారా? ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే నరేంద్రను ఉన్నపళంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం నిజం కాదా?
టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రధాన నేతలందరిపై హత్యాయత్నం (307) కేసులు పెట్టడం వెనకున్న ఆంతర్యం ఏమిటి? ప్రజానాయకుల్ని హంతకులుగా చిత్రీకరించే పోలీసులు ప్రయత్నాలు, నేరస్తుడైన జగన్ సిలబస్ లో భాగమేగా? జగన్ రెడ్డి అండతో వెనకాముందూ ఆలోచించకుండా.. వాస్తవం అవాస్తవం గ్రహిం చకుండా టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెడుతూ..వారిని అరెస్ట్ చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న పోలీసులంతా ఒక్కసారి తమ భవిష్యత్ ఏమిటో ఆలోచించుకోవాలి. టీడీపీప్రభుత్వం వచ్చాక తాముచేసే తప్పులకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో గుర్తెరిగి మసలుకోవాలి. తెలుగుదేశానికి.. పోలీస్ శాఖతో ఎలాంటి వైషమ్యాలు, వైరుధ్యాలు, రాజకీయ విబేధాలు లేవు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కొందరు పోలీస్ అధికారులు…కిందిస్థాయి సిబ్బందినే టీడీపీ తప్పుపడుతోంది. చంద్రబాబు సహా, టీడీపీప్రధాన నేతలందరిపై హత్యాయత్నం (సెక్షన్-307) కేసులు పెట్టడం వెనకున్న ఆంతర్యం ఏమిటో కూడా పోలీసులు చెప్పాలి.
చంద్రబాబు..లోకేశ్ సహా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతలందరిపై హత్యాయత్నం కేసులు పెట్టి..వారిని హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ జగన్ తన రాజకీయ ప్రయోజనాలకోసం తమను వాడుకుంటున్నాడని ఇప్పటికే ప్రజలు గ్రహించారు.. మేలుకోవాల్సింది పోలీసులే. ప్రజలకోసం పనిచేసిన నాయకుల్ని హంతకులుగా నమ్మించే ప్రయత్నం ఎంతకాలం చేస్తారని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాం.. చంద్రబాబు ఇంటిపై… టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడివెనుక పోలీసుల ప్రోత్సాహం ఉండటం వాస్తవం కాదా? కడపలో పోలీసులు బీటెక్ రవి అరెస్ట్ చూపకుండానే..అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసింది ఎవరు… చంపేస్తామని బెదిరించింది ఎవరు? అరెస్ట్ చేసిన వెంటనే అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పి.. చంపేస్తామని బెదిరించింది నిజమైనా పోలీసులా…లేక జగన్ రెడ్డి పంపిన కిరాయి మనుషులా? బీటెక్ రవిని బెదిరించినవారు నిజంగా పోలీస్ శాఖకు చెందిన వారే అయితే, వారిపై స్థానిక జిల్లాఎస్పీ.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. బీటెక్ రవి అరెస్ట్ కు ముందు టీడీపీనేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా అలానే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్రను కూడా అదే విధంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
అధికారం కోల్పోయిన వెంటనే జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం.. అతనితో పాటు పరిధిదాటి వ్యవహరిస్తున్న పోలీసులు కూడా వెళ్తారా?
జగన్ రెడ్డి..అధికారపార్టీ నేతల మెప్పుకోసం, వారి తాయిలాలు కోసం.. బెదిరిం పులకు భయపడే కొందరు పోలీసులు విధినిర్వహణను విస్మరించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజలు తమకు న్యాయం చేయండని పోలీసుల్ని అడగడానికే భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఎన్నడైనా పోలీస్ శాఖ ఆలోచించిందా? అధికారం కోల్పోయిన వెంటనే జగన్ రెడ్డి జైలుకెళ్ల డం ఖాయం. అతనిపై ఉన్న అవినీతి కేసులు.ఇతర కేసులపై ఇప్పటికే సొంతపార్టీ వారే న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్తే.. అతనితోపాటు ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసులు కూడా వెళ్తారా? జగన్ జమానాలో ఏపీ పోలీసుల్ని చూసి దేశమే సిగ్గుతో తలదించుకుంటోందని గుర్తుంచుకోండి. ఏపీ పోలీసుల్ని చూస్తుంటే రజాకార్లు గుర్తొస్తున్నారని చెప్పడానికి బాధపడుతున్నాం. జగన్ తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులు.. లైసెన్స్డ్ గూండాల్లా పని చేస్తున్న పోలీసులు కచ్చితంగా భవిష్యత్లో కోర్టులద్వారా శిక్షింపబడటం ఖాయం.’’ అని మాణిక్యరావు హెచ్చరించారు.