- చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడంలో సిద్ధహస్తుడాయన
- నా అనుభవం అంత కూడా లేదు..నీ వయసు!
- మీ అప్పులకోసం జనం తాగుబోతులు కావాలా?
- యువత జాబులడిగితే గంజాయి ఇస్తారా జగన్?
- లీసులున్నది ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికా?
- ఊరికో సైకోను తయారుచేసి జనంమీదకు వదిలారు
- ఆదోని, ఎమ్మిగనూరు సభల్లో నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
ఆదోని : రాష్ట్రానికి జగన్‌రెడ్డి ఒక శనిగ్రహంలా దాపురిం చాడు. తప్పుచేశామని జనం ఇప్పుడు బాధపడుతున్నా రు.మూడున్నరేళ్లలో రాష్ట్రంలో రౌడీయిజం,దోపిడీలు, నేరాలు పెరిగిపోయాయి. అభివృద్ధి ఆగిపోయిందని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆవే దన వ్యక్తంచేశారు.కర్నూలు జిల్లా అదోనిలో చంద్రన్న రోడ్ షోకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జనంనుం చి కనీవినీ ఎరుగనిరీతిలో స్పందన లభించింది. ఆదో నిలో అధినేత బసచేసిన చెరుకూరి రెసిడెన్సీ నుంచి రోడ్‌షోగా సెంటర్‌కు చేరుకోవడానికి సుమారు గంట న్నరకుపైగా సమయం పట్టింది. అధినేత వస్తున్నారన్న విషయం తెలుసుకుని పరిసర ప్రాంతాల నుంచి జనం పెద్దఎత్తున తరలిరావడంతో అదోని పట్టణం జనసం ద్రమైంది. అదోనిలో ప్రజలనుద్దేశించి చంద్రబాబునా యుడు మాట్లాడుతూ బిడ్డకు పెళ్లి సంబంధం చూడా లంటే ఎన్నోవిధాలుగా ఆలోచిస్తారు. రాష్ట్ర భవిష్యత్తు కు సంబంధించిన గతఎన్నికల్లో మాత్రం ఒకమోసగా డి మాయమాటలకు పడిపోయారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ టిడిపి రావాలని కోరుతూ నాకు సం ఫీుభావం తెలిపేందుకు మీరంతా వచ్చారు. నా కర్నూ లు పర్యటనలో వైసిపి చోటానేతలు వేషాలు వేస్తే… పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజలు తిర గబడితే నాకు బాధ్యత లేదు. ఆ తర్వాత మీ ఇష్టమని హెచ్చరించారు. రౌతుకొద్దీ గుర్రం… నేరగాడు జగన్ రెడ్డి సిఎం కావడం వల్లే పోలీసులు ఇలా అయ్యారు. జగన్ ఊరికో సైకోను సిద్దం చేశాడు. ఇటువంటి సైకోలుతమనేమీ చేయలేరని స్పష్టంచేశారు. నా అను భవమంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశాను. మరి ఆయన ఎక్కడ చదివారో ఎవరికీ తెలియదన్నారు. అదోని సభలో చంద్రబాబునాయుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
అన్నివర్గాల ప్రజలపై బాదుడే బాదుడు
రాష్ట్రంలో అన్ని వర్గాలపైనా వైసిపి ప్రభుత్వం బాదుడే బాదుడు అన్నరీతిలో ఇష్టారాజ్యంగా పన్నుల భారం మోపుతోంది. చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్య మంత్రిని ఏమనాలి? మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా పన్ను ఈ ప్రభుత్వం పన్నువేస్తోంది. రాష్ట్రం లో ఎక్కడైనా ఇసుక దొరుకుతాఉందా…. ఈ ఊళ్లో స్థానికులకు అందుబాటులో ఉండదు గానీ కర్నాటక, హైదరాబాద్‌లో మాత్రం దొరుకుతుంది. ఇక్కడ ఎమ్మె ల్యే ఏం చేస్తున్నారు? సాయంత్రానికి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు.
దోపిడీ విద్యలో ఆరితేరిన జె-గ్యాంగ్
మద్యం మాఫియాతో జగన్ హోల్‌సేల్‌గా దోపిడీ చేస్తున్నారు. మద్యం తయారు చేసేది, అమ్మేది రెండూ ఆయనే. ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి. కర్నూలు లో బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్. ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు. నకిలీ విత్తనా లతో పత్తిరైతులను ముంచారు. నాడు తప్పుచేస్తే తాట తీస్తాను అనిభయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా భయపడ్డారు.కానీ నేడు ఎమ్మెల్యేలే అవినీతిలోభాగస్వా ములు అవుతున్నారు.వైసిపినేతలు ఖనిజసంపద దోచే స్తున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. చుక్కల భూమి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నారు. ప్రతిరోజు ప్రజలు తమ భూములు ఉన్నాయో, పోయాయో చూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
అన్నక్యాంటీన్లు ఏం పాపం చేశాయి?
అన్న క్యాంటీన్లు ఏం పాపం చేశాయి? నా మీద పాపంతో నేను పెట్టిన అన్నక్యాంటీన్‌లు మూసి వేశా డు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌లను సిఎం స్టాలిన్ కొనసాగించాడు.ప్రభుత్వం మూసివేసిందని అన్నక్యాం టీన్‌లు మేం పెడుతుంటే కూడా అడ్డుకుంటున్నాడు. మళ్లీ అధికారంలోకి రాగానే మండలకేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్‌లు పెడతాం. నేను సిఎంగా ఉండి ఉం టే పెన్షన్ 3వేలు అయ్యేది. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2వేలు చేసింది టీడీపీనే. ఆంక్షలు పెట్టి పెళ్లి కాను క నిలిపివేశారు. చంద్రన్న భీమా పథకం నిలిపి వేశారు. మట్టి ఖర్చులకు రూ.30వేలు ఇచ్చాను. అదీ ఆపేశారు. రంజాన్ తోఫా ఇచ్చాను. దుకాన్ మకాన్ పథకం నిలిపివేశారు.
తెలుగుదేశం బిసిల పార్టీ
తెలుగు దేశం బిసిల పార్టీ. వారికి నేను అండగా ఉంటా. వాల్మీకీ, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను ప్రభుత్వంలోకి వచ్చాక ఆదుకుంటా. యవతకు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. రైతుల పిల్లలు, కూలీ ల పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పిం చాను. ఇప్పుడు యువత ఉద్యోగాలు అడిగితే గంజా యి ఇస్తున్నారు. సమాజాన్ని జగన్‌రెడ్డి చెడగొడుతున్నా డు. సంక్షేమం నిలిపివేస్తానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమ లు చేస్తాను. బుద్ది ఉన్న సిఎం ఎవడైనా కలెక్టరేట్‌లు, ప్రభుత్వభవనాలు తాకట్టుపెడతారా?యువతలో ఉన్న భయం పోవాలి. మీ ఎమ్మెల్యే కేసుపెడితే ఏమవుతుం దని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
వైసిపి గూండాలకు భయపడను
నేను వైసిపిల గూండాలకు, పేటిఎం బ్యాచ్ కు భయపడను. పవన్ కళ్యాన్ విశాఖ పట్నం పోతే అక్కడా పోలీసులు, వైసిపి గూండా కుమ్మక్కయి ఆయ నను ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట రేపు మేము కూడా వైసిపి నేతల ఇళ్లపై రోడ్లు వెయ్య లేమా… ఫ్లైవోవర్‌లు కట్టలేమా? విశాఖలో మెడ మీద కత్తిపెత్తి భూములు, వ్యాపారాలు రాయించు కుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టివి చానల్స్‌ను ఉన్మాది జగన్‌రెడ్డి రాకుండా చేస్తు న్నాడు. నేను ఆరోజు ఇలా చేసి ఉంటే సాక్షి టివి, సాక్షి పేపర్ వచ్చేదా? ప్రసారాలు కేబుల్ టివి నిర్వాహకుల దయాదాక్షిన్యాలు కాదు. నిబంధ నల ప్రకారం పనిచెయ్యాలి. సిఐడి అధికారులు అక్రమ కేసులు, అరెస్టులతో తప్పులు చేస్తున్నారు.
తిరగబడితే పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి
అధికారపార్టీ వత్తిళ్లతో పోలీసుల వేధింపులు తట్టుకోలేక టిడిపి కేడర్ తిరగబడితే పరిస్థితి ఏమిటో పోలీసులు ఆలోచించుకోవాలి. రాయదుర్గం నియో జకవర్గంలో ఓ కుటుంబాన్ని కానిస్టేబుల్ బెదిరిం చారు. దీంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. బంగారం స్మగ్లింగ్‌పై ఒకరు వార్తను ఫార్వర్డ్ చేశా రని సిఐడి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందో అర్థంకావడం లేదు. వాస్తవానికి పోలీ సుల కూడా జగన్‌రెడ్డి అరాచక పాలనతో ఇబ్బం దులు పడుతున్నారు, సమయానికి జీతం, పెన్షన్లు, అలవెన్సులు రావడం లేదు. వైసిపి విధ్వంస పాలన లో వారి పిల్లలు కూడా నష్టపోయారు.
ఇసుక కిలోల్లో కొనే పరిస్థితి వచ్చింది
వైసిపి పాలనలో ప్రజలపై బాదుడే బాదుడు అన్న చందంగా మోయలేని భారాలు మోపుతున్నారు. నిత్యా వసరాల సహా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయా యి. రాష్ట్రంలో ఇసుకను కూడా కేజీల లెక్కన కొను క్కునే పరిస్థితికి తీసుకువచ్చారు. జాబ్ క్యాలెండర్ లేదు.జగన్ యువత భవిష్యత్ లేకుండాచేశాడు. నాడు హైదరాబాద్‌ను నేను అభివృద్ది చేసి ఉండక పోతే ఇప్పుడు తెలంగాణ ఏమయ్యేది.? ఆ కసితో ఎపిలో కూడా అభివృద్ది చెయ్యాలి అని ప్రయత్నించాను. 2029కి రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంచాలి అని ప్రయత్నం చేశాను.
మూడు వద్దు… ఒకటే ముద్దు
మూడు రాజధానులపై ఎమ్మిగనూరు ప్రజలు మాటే రిఫరెండం అంటూ మీకు మూడు రాజధానులు కావాలా…. ఒక్క రాజధాని కావాలా అని ప్రజలను చంద్రబాబునాయుడు ప్రశ్నించగా… ఒక్క రాజధానే అంటూ ప్రజల నినాదాలతో మద్దతు పలికారు. తాడే పల్లిలో ఉన్న జగన్ ఇది చూడాలి. ఎపి రాజధాని ఏది అంటే ఏం చెప్పాలి. జగన్‌కు సిగ్గులేదు. అలా మనం ఉండగలమా? పులివెందులలో బస్‌స్టాండ్ కట్టేలేని వాళ్లు…రోడ్ల గుంతలు పూడ్చలేని వాడు మూడు రాజ ధానులు కడతాడా? కర్నూలుజిల్లాలో ఓమంత్రి ఉన్నా డు. అయన అప్పుల మంత్రి. మూడు రాజధానులు కాదు. ఒక్కటే ఉండాలి అని చెప్పలేని దద్దమ్మ మంత్రి ఆయన. మరో మంత్రి క్లబ్బులు పెట్టి పేకాట ఆడిస్తా డు. అక్రమమద్యం అమ్ముతాడు. భూకబ్జాలు చేస్తాడు. కర్నూలు జిల్లా నుంచి వలసలు పోతుంటే కార్మిక శాఖా మంత్రి ఏం చేస్తున్నాడు?
ముందుచూపుతో నదుల అనుసంధానం
ముందుచూపుతో పట్టిసీమ కట్టి నదుల అనుసం ధానానికి శ్రీకారం చుట్టాను. టిడిపి హయాంలో 72 శాతం పోలవరం పూర్తి చేశాం. టిడిపి వచ్చి ఉంటే 2020కే పోలవరం పూర్తి అయ్యేది. నదుల అనుసం ధానం జరిగి ఉంటే ఎమ్మిగనూరుకి కూడా నీరు వచ్చే ది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు అంటే ఎప్పుడూ నాకు బివి మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. బివి మోహన్‌రెడ్డి పోరాటంతో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తిచేశాం. గాజుల దిన్నె ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇప్పుడు ఎత్తు మరో మీటరు పెంచుతారట. మరోవైపు నకిలీ విత్తనా లతో పత్తి రైతులు దెబ్బతిన్నారు. మద్దతు ధర లేక టమాటా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మెట్టప్రాం తాలు కర్నూలు జిల్లాకు వచ్చాయి. ఇక్కడ ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ది చేయాల్సి ఉంది.
కర్నూలు జిల్లా అభివృద్ధి టిడిపి హయాంలోనే!
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కర్నూలు కు ఎయిర్ పోర్టు తెచ్చాం. సోలార్ పార్క్ తెచ్చాం. అనం తపురంలో కియా పరిశ్రమ తెచ్చాం. ఎమ్మిగ నూరులో అభివృద్ది జరిగింది అంటే టిడిపి హయాంలోనే. హం ద్రీనీవా,ముచ్చుమర్రి ప్రాజెక్టులనుపూర్తిచేసింది మేమే. డబ్బుల కోసం కక్కుర్తి పడి రాయలసీమ లిఫ్ట్ అని జగన్ మాయ మాటలు చెప్పాడు.
సంక్షేమంపై వైసిపి తప్పుడు ప్రచారం సంక్షేమంఅనేది మొదలుఅయ్యిందే టిడిపిహాయాం నుంచి. మేం సంక్షేమం ఆపేస్తామా? పెళ్లి కానుకకు ఎన్ని ఆంక్షలుపెట్టారు. ఎవరికీ పథకం రాకుండా అనే క ఆంక్షలుపెట్టారు. నాడు టిడిపి హాయంలో ఎవరైనా పెళ్లిచేసుకుంటే పెళ్లి పీఠల మీద పెళ్లి కానుక ఇచ్చాం. చంద్రన్న భీమా ద్వారా 5లక్షల సాయం చేశాం. మట్టి ఖర్చులకు 30వేలు ఇచ్చిన ప్రభుత్వం మనది. నిరుద్యో గ భృతితో యువతకు అండగా నిలిచాం.
మైనారిటీలకు అండగా నిలచింది మేమే
రాష్ట్రంలో మైనారిటీలకు అండగా నిలచింది తెలు గుదేశం పార్టీనే. టిడిపి హయాంలోనే మైనార్టీ కార్పొ రేషన్ పెట్టాం. మైనారిటీవర్గం ఆలోచించాలి. టిడిపికి అండగా ఉండాలి.ఇప్పుడు మైనారిటీలకు దుల్హన్ రావ డంలేదు. మకాన్ దుకాన్ పథకం లేదు. రంజాన్ తోఫా రావడం లేదు. ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చిందే తెలుగుదేశంపార్టీ. డ్వాక్రా సంఘాలు పెట్టింది తెలుగు దేశం ప్రభుత్వమే. స్వయంగా ప్రధాని ఈ విషయం వాళ్ల పార్టీ మీటింగ్ లో చెప్పారు.
కమలాసన్‌ను మించిన నటుడు జగన్
జగన్ రెడ్డి చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడంలో సిద్ద హస్తుడు. బాబాయ్ హత్య కేసులో అసత్యాలు చెప్పారు. గుండెపోటు అని చెప్పారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె న్యాయం కోసం న్యాయం చేస్తుంది. బాబాయ్ హత్య ఘటన పై కథలు చెప్పి జగన్ ఓట్ల వేయించుకున్నాడు. బాబాయిని చంపిన వాడు నిన్ను నన్ను లెక్కచేస్తాడా? తండ్రి హత్య విషయంలో సుప్రీం కోర్టులో పోరాడుతున్న సునితా రెడ్డిని అభినందించాలి. అమె పోరాటం కారణంగానే ఇప్పుడు కేసు వేరే రాష్ట్రానికి వెళుతుంది. కోడికత్తి డ్రామా అడిన పెద్ద మనిషి జగన్ మోహన్ రెడ్డి. జగన్ అద్భుత మైన నాటకాల రాయుడు….నటనలో కమల హాసన్‌ను మించిపోతున్నాడు. రాష్ట్రంలో బ్లూమీడియా జగన్ ఏం చేసినా డప్పు కొడుతుంది.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఏమైపోయారు?
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే మిస్సింగ్. ఆయన ఏమైపోయారో తెలియదు.ఎమ్మిగనూరులో రూ.146 కోట్ల తాగునీరు పథకం రద్దు. 92ఎకరాల్లో తెచ్చిన టైక్స్‌టై ల్స్ పార్కు రద్దుచేశారు. ఆ స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.చేనేతల కోసం ఇక్కడ రెండు క్లస్టర్‌లను మంజూరు చేస్తే అవీ రద్దు చేశా రు. నాడు మిగిలిపోయిన 10శాతం యుజిడి పను లూ మూడున్నరేళ్లలో చెయ్యలేదు.పట్టణంలో 3200 టిడ్కో గృహాలు కడితే…వాటినీ కేటాయించ లేదు. త్రాగునీరు సరఫరా కోసం 2వ ఎస్‌ఎస్ ట్యాంక్ కోసం స్థలాన్ని కేటాయిస్తే వైసిపి నాయకులు 95 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయ త్నం మొదలు పెట్టారు. మున్సిపాలిటీకి 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.13 కోట్లు వెనక్కి పోయా యి. టౌన్‌లో జామియా మసీదు నిర్మాణం కోసం ఇచ్చిన 30లక్షలు వృధా చేశారు. ఎన్‌టిఆర్ కూర గాయల మార్కెట్‌లో షాపుల పనులూ ఆపేశారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కోనుగోలు కేంద్రం మూసేశారు. నేత పితామహుడు పద్మశ్రీ మా చాని సోమప్ప గారు ప్రజల అవసరాల కోసం స్థలాన్ని ఇస్తే.. షెడ్లు నిర్మించి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.