నవ్యాంధ్ర విధ్వంసానికి పాల్పడిన జగన్
బతికించాలన్న ఆశయంతో వస్తున్నా
అందులో భాగమే పునర్నిర్మాణ పిలుపు
కూటమి గెలుపుతోనే ఆ వెలుగులు సాధ్యం
సీమను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్
ముస్లిం సహా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తా
పేదరికం నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం
కోడుమూరు (చైతన్యరథం): రాష్ట్రాన్ని చంపేసే ఆలోచనతో జగన్‌రెడ్డి ఉన్నాడు. రాష్ట్రాన్ని బతికించాలన్న ఆశయంతో నేనున్నాను. వచ్చే ఎన్నికలలో ప్రజలు విజ్ఞతతో ఓటేయండి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, సహజవనరులు దోచేసిన జగన్‌రెడ్డి బాగుపడ్డాడు. ఐదేళ్ల జగన్ పానలో ప్రజలెవరైనా బాగుపడ్డారా? ఏ కులానికైనా, మతానికైనా, వర్గానికైనా న్యాయం జరిగిందా? ఐదేళ్ల పాలన 30 యేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. డ్రైవింగ్ తెలిసిన వాళ్లు డ్రైవర్‌గా ఉంటే ప్రజల జీవితాలు సేఫ్‌గా ఉంటాయి. డ్రైవింగ్ రానివాళ్లు అహంకారంతో రివర్స్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు అనుభవజ్ఞులో, ఎవరు అసమర్థులో అర్థం చేసుకుని ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ పాలనలో సర్వ నాశనమైన రాష్ట్రాన్ని తక్షణం పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
విభజన తర్వాతా అభివృద్ధివైపు నడిపించా
మాటలు చెబితేనో, బటన్లు నొక్కితోనే రాష్ట్రానికి ఆదాయం పెరగదని, నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే ఆదాయం వస్తుందని చంద్రబాబు అన్నారు. విభజన తరువాత లోటు బడ్జెట్‌తోవున్న రాష్ట్రాన్ని అహర్నిశలూ పనిచేసి సరైన ప్రణాళికలతో అభివృద్ధి సాధించగలిగానని చంద్రబాబు చెప్పారు. జీతాలుకూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి అమరావతి, రోడ్డు, పోలవరం, పరిశ్రమలు తీసుకొచ్చానంటే ఎంత కృషి చేసి ఉండాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణతో పోల్చుకుంటే తలసరి ఆదాయ వ్యత్యాసం 35శాతం ఉంటే 27 శాతానికి తగ్గించగలిగానని, జగన్ పాలనలో మళ్లీ అది 41 శాతానికి చేరిందని చంద్రబాబు దుయ్యబట్టారు. పది రూపాయలు పెట్టి వంద రూపాయల భారంమోపి సహజ వనరుల దోపిడీ, మద్యం వ్యాపారంతో వెయ్యి కొట్టేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. చేతగాని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రం మరింత దివాలా దిశగా పోతోందని, కూటమి అధికారంలోకి వస్తే నవ్యాంధ్రను తాను వెలుగుల వైపు నడిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాయలసీమను నిర్వీర్యం చేశారు
రాయలసీమను నమ్మించి, గద్దెనెక్కిన తరువాత మోసం చేసిన సీమ ద్రోహి జగన్ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క తాగునీటి కుళాయి కూడా ఇవ్వలేదు. ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు. ఈ ముఖ్యమంత్రికి నీటి విలువ తెలియదు, రైతుల కష్టాలు తెలియదు. తాగునీరు ఇవ్వాలనే బుద్ది కూడా లేదు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే రాయలసీమ ఎడారిగా మారుతుంది. ఇప్పటికే వలసలు వెళుతున్నారు. తర్వాత ఊరంతా ఖాళీ అయ్యే పరిస్తితి వస్తుంది. టీడీపీ హయాంలో సీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కింద 90 శాతం ఇచ్చాను. ఆ స్కీమును ఇప్పుడు రద్దు చేశాడని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు.
దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్
నా ఎస్సీలు అంటూనే దళితులను జగన్ మోసం చేశాడు. రూ.25 వేల కోట్ల సబ్ ప్లాన్‌ను రద్దు చేశాడు. 27 పథకాలు నేను ఇస్తే వాటన్నింటినీ నిలిపివేశాడు. ఎస్సీలపై అట్రసిటీలు పెట్టిస్తాడు. దళితులను ఊచకోత కోసిన దుర్మార్గుడు జగన్ అని దునుమాడారు. టీడీపీ హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇన్నోవా, అంబేద్కర్ విద్య అన్నీ దళితులకు దూరం చేశాడు. ఇప్పుడు దళితుల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. దళితుల్లో కూడా ఎబిసిడి అనే కేటగిరీలు పెట్టాను. 1996-97లోనే వర్గీకరణ తీసుకొచ్చాను. మాదిగలకు కూడా న్యాయం జరిగింది. మళ్లీ మన ప్రభుత్వంలో ఎబిసిడి కేటగిరీలు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన టీడీపీ
సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగు దేశం. ఇక్కడ నిలబెట్టిన వ్యక్తి దస్తగిరి మాదిగ కకులానికి చెందిన వ్యక్తి. కొన్ని ప్రాంతాల్లో మాలలకు కూడా సీట్లు కేటాయించాం. కర్నూలు పార్లమెంట్‌లో కురబ సంఘానికి సంబంధించిన పంచలింగాల నాగరాజును నిలబెట్టాను. మంత్రాలయంలో బోయ, ఆదోని డెంటల్ పార్థసారధికి ఇచ్చాం. ఆలూరులో లింగాయత్‌కి ఇచ్చి, కోడుమూరు ఎస్సీ, ప్రత్తిపాడు ఈడీగా కులంలో వెనుకబడిన వర్గానికి ఇచ్చాం. కర్నూలు వైశ్యాకి ఇచ్చాం. నంద్యాలలో ముస్లింకి ఇలా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. కానీ, సైకో జగన్ మాత్రం ముగ్గురిని ఒకే కులం వారిని నిలబెట్టారు. మీరు కర్నూలును గెలిపించుకుంటే మనకు ఇంకా తిరుగులేదు అని చంద్రబాబు వివరించారు.
ముస్లింల అభివృద్ధి టీడీపీతోనే
గతంలో కూడా నేను ఎన్టీయేలోనే ఉన్నాను. ముస్లింలకు ఏమైనా అన్యాయం చేశానా? ముస్లింల కోసం హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశా. ఉర్దూ రెండో భాషకింద 13 జిల్లాల్లో అభివృద్ధి చేశా. విభజన తర్వాత దుకాన్ ఔర్ మకాన్ ఇచ్చాం. దుల్హాన్ ద్వారా 36 వేలమంది ఆడబిడ్డలకు పెళ్లి చేశాం. 136 కోట్లు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం, వక్ఫ్ భూములు కాపాడాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కాపాడే బాధ్యత మాది. 4 శాతం రిజర్వేషన్ అంశాన్ని సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్
వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, కూటమి తరఫున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు దూసుకుపోతున్నాయని చంద్రబాబు వివరించారు. సంక్షేమానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేశానని అబద్ధాలు చెప్తున్న జగన్ రెడ్డి.. రాష్ట్రానికి మిగిల్చిన 13లక్షల కోట్ల అప్పుగురించీ మాట్లాడాలన్నారు. ఆ సొమ్ము ఏమైందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజ జీవితాల మీద ఏమాత్రం శ్రద్దలేని జగన్, నాసిరకం మద్యంతో ఆరోగ్యాలు దెబ్బతీశాడన్నారు. ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరిచాడని దుమ్మెత్తి పోశారు. సీబీఎన్ అంటే ఒక బ్రాండ్ అంటూనే `కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వెలుగుల దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో అతిపెద్ద సోలార్ ప్లాంట్ పెట్టింది టీడీపీయేనని అంటూ, స్థానికంగా విద్యుదుత్పాదనకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఆడబిడ్డలకు మహాశక్తి కింద నాలుగు కార్యక్రమాలు అమలు చేస్తాం. డ్వాక్రా సంఘాలు, కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లను టిడిపి తెచ్చింది. ఆడబిడ్డ నిధి కింద ఒక్కో ఆడబిడ్డకు రూ.1,500 ఇస్తాం. తల్లికి వందనం కింద పిల్లల చదువులు నిమిత్తం ఒక్కో పిల్లవాడికి రూ.15,000 ఇస్తాం. ఎంత మంది ఉంటే అందరికి ఇస్తాం. దీపం పథకాన్ని తెచ్చాం.3 సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర ప్రగతితో పాటు ఆడబిడ్డల భవిష్యత్ కూడా కాపాడతాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. పేదరికం లేని సమాజం చూడాలనేదే నాధ్యేయం. సంపద సృష్టించి ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచుతాను. ఆడబిడ్డలను లక్షాధికారులుగా చేసే బాధ్యత నాదని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కుల గణనతో పాటు స్కిల్ గణన జరగాలి
పేదరికం లేని రాష్ట్రం చూడాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్‌లో స్కిల్ గణన చేయాలి. నైపుణ్య కేంద్రాలు పెట్టి నైపుణ్యం నేర్పించి మీ ఇంట్లోంచే పని చేసే విధంగా అవకాశాలివ్వాలి. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క అన్నదాతకు రూ.20వేలు అందిస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాను. మేం వస్తే అన్ని పథకాలు రద్దు అవుతాయని జగన్ అంటున్నారు. కాని ఏ ఒక్క పథకం రద్దు అవ్వదు. మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దోచుకున్న వైసీపీ నేతల నుంచి కక్కించే బాధ్యత
సి.బెళగల్, కోడుమూరు మండలలో ఎర్రమట్టి, భూకుంభకోణాలతో చిన్న చిన్న సైకోలు దోచేసుకుంటున్నారు. ప్రజల ఆస్తులను దిగమించిన వారిని వదిలిపెట్టను. బి.తాండ్రపాడులో చెరువును మింగి కబ్జా చేసుకున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ ఆస్తులున్న వైసీపీ అభ్యర్ధి పేదవాళ్ల ప్రతినిధా? అని ప్రశ్నించారు. గుండ్రేవులకు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తే ఒక్క అడుగు ముందుకు పడలేదు. 35 గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం గోరంట్ల`కొత్తపల్లి మద్య హంద్రీ నీవాపై వంతెన నిర్మాణం ఏర్పాటు చేస్తాం. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా కృష్ణదొడ్డి, సంగాల కంబద్ హామ్, చింతమానుపల్లి, రేమటి ఎత్తిపోతల పథకాలకు ప్రజలు చందాలు వేసుకొని బాగు చేసుకున్నారు. జగన్ ప్రాజెక్టుల మరమ్మత్తులకు కనీసం నిధులు కూడా కేటాయించని పరిస్థితి. కర్నూలు`సుంకేశల రోడ్డు ఆధునీకరణ రూ.25 కోట్లు ఇస్తే జగన్ రద్దు చేశారు. కొడుమూరులో తాగు నీటి సమస్య కోసం రూ.75 కోట్లు ఇస్తే రద్దు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించి సైకోని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.