- రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజికి వర్గానికే పెద్దపీట
- కాపు, బలిజలని జగన్‌రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారు
- టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శ
అమరావతి: పదవులన్నీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి అణిచివేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు. రాష్ట్రం కంటే తన సామాజిక వర్గమే ఎక్కువని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక లో జగన్‌రెడ్డి నిరూపించారని ఒక ప్రకటనలో అనగాని విమర్శించారు. మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి కేటాయించడమేనా జగన్‌రెడ్డి చెబుతున్న సామా జిక న్యాయమంటే అని ప్రశ్నించారు. రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌కు మొదట రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఆ ప్రకటన తడి ఆరక ముందే ఆయనను తొలగించి సొంత సామాజిక వర్గానికి చెందిన మేడా రఘునాధ రెడ్డికి కేటాయించడం బలిజల గొంతు కోయడం కాదా? రాజంపేట లోక్‌సభ సీటు కూడా సొంత సామాజికవర్గానికే అప్పగించారు. ఇప్పుడు బలిజ లను మరోసారి వంచించారు. నమ్మించి మోసం చేయ డం, నమ్మించి గొంతులు కోయటం జగన్ జీన్స్‌లోనే ఉంది. బడుగు, బలహీన వర్గాలంటే జగన్‌రెడ్డికి ముందు నుంచీ చిన్నచూపు. కులపిచ్చితో కక్ష కట్టి రాజకీయ అవ కాశాలకు వారిని దూరం చేశారు. ఆర్థికంగా, రాజకీయం గా, సామాజికంగా బడుగు, బలహీన వర్గాలను అణిచి వేస్తున్న జగన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అనగాని స్పష్టం చేశారు.