- రూ.2,86,389 కోట్ల బడ్జెట్ ప్రతిపాదన
- దశాబ్దాల సంక్షేమం జగన్‌తో మొదలైందట
- పోలవరం, మౌలిక వసతుల ఏర్పాటు పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్యం
- అసంతులిత, అసంబద్ధ ఆర్థిక వాదనలు
- అబద్ధాల పుట్టగా ఆర్థిక మంత్రి ప్రసంగం
- రూ.2,86,389 కోట్ల బడ్జెట్ ప్రతిపాదన
- దశాబ్దాల సంక్షేమం జగన్‌తో మొదలైందట
- పోలవరం, మౌలిక వసతుల ఏర్పాటు పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్యం
- అసంతులిత, అసంబద్ధ ఆర్థిక వాదనలు
- అబద్ధాల పుట్టగా ఆర్థిక మంత్రి ప్రసంగం
గత ఐదేళ్లుగా కొనసాగుతున్న జగన్‌రెడ్డి అసమర్థ, అరాచక, విధ్వంసక పాలనతో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు, అన్ని ప్రధాన రంగాలు కుదేలైనప్పటికీ తన ఆలోచనలు ఏ మాత్రం మారవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నాడు 2024-25 ఆర్థిక సంవత్స రానికి శాసనసభలో ఓట్ ఆన్‌అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన 44 పేజీల సుదీర్ఘ ప్రసంగంలో జగన్‌రెడ్డి ఆలోచనా విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇందులో భాగం గా.. జగన్‌రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు ఏమాత్రం మారదని.. ఈ ఐదేళ్ల అనుభవమే కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బల్లగుద్ది చెప్పారు.
రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389.27 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఇది 2023-24 సవరించిన బడ్జెట్ కంటే రూ.11,113 కోట్లు అధికం. రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరు గనున్నందున గత ఐదేళ్లుగా జగన్‌రెడ్డి ప్రభుత్వం అను సరించిన విధానాలు,వాటి మూలసూత్రాలు, ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించే ప్రయత్నం ఆర్థిక మంత్రి చేశారు.
పలువురు ప్రముఖుల సూక్తులను ఉదహరిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం అడుగు లు వేసినట్లు చెప్పే ప్రయత్నం చేశారు బుగ్గన. ఈ ప్రయత్నంలో.. జగన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలలోని అసం తులితను, అసంబద్ధతను, పరస్పర వైరుధ్యాలను ఆర్థిక మంత్రి బయటపెట్టుకున్నారు. తమ సుదర్ఘ ప్రసంగం లో బుగ్గన పలు అసత్యాలను వండి వార్చారు.
జగన్ రెడ్డిది కొత్త పంథా అట-నవరత్నాలు అపూర్వమట!
రాష్ట్ర విభజన సమస్యలు, గత చంద్రబాబు ప్రభుత్వ అపరిష్కృత సమస్యల వారసత్వ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి పాత, మూస పద్ధతికి విరుద్ధంగా ఒక సమగ్రమైన నూతన పంథాను అనుసరించాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నారని.. తమ సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో ఈ నూతన విధానానికి రూపకల్పన చేసి గత ఐదేళ్లుగా ఆ దిశలో నడిచి రాష్ట్రాన్ని కొత్త తీరాలకు చేర్చినట్లు ఆర్థిక మంత్రి డాంబికాలు పలికారు. ఇంత కు.. ఆ నూతన విధానాలు ఏమంటే.. నవరత్నాలు, వైసీపీ మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మాత్రమేనని ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. ఈ ప్రయత్నం చేసి ఆర్థిక మంత్రి అపహాస్యం అవటమే కాకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పరిహాసానికి గురిచేశారు.
సామాజిక పింఛన్లు, మహిళలు, రైతులు, విద్యార్థు లకు ఆర్థిక సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టటం విప్లవాత్మకమైన కొత్త పంథా ఎలా అవుతుం దో అర్థంకాక బడ్జెట్ ప్రసంగాన్ని విన్న ప్రజలు, నిపు ణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటువంటి పథకాలన్నీ దశాబ్దాలుగా కొనసాగుతున్న వాస్తవాన్ని గుర్తించిన ప్రజలు బుగ్గన భాష్యంతో విస్మయం చెందారు.
‘‘ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయో రాజ్యస్థాపన జరి గింది.. మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నడిపిస్తున్నాయి… మన భవిష్యత్తు మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన సందేశాన్నిచ్చారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వ పలు అనాలోచిత నిర్వాకాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. నేటికీ, ప్రజల రేపటికి జగన్‌రెడ్డి విధానాలు ఏమాత్రం వ్యత్యా సం కలిగించవని.. మరలా జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత అంధకారమే కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
బడ్జెట్ ప్రసంగం ` అబద్ధాల పుట్ట
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగమంతా అబద్ధాల కూర్పుగా కొనసాగింది. ఇందుకు కొన్ని ఉదాహరణలు:
1. వాగ్దానాల అమలులో, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చ టంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం సఫలీకృతమైందన్న ఆర్థిక మంత్రి:
మద్యపాన నిషేధం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ఓపీఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజ ధానిగా అమరావతి వంటి పలుహామీల సంగతే మిటి? నిరుద్యోగ సమస్యతో యువతను నిర్వీర్యం చేయడం ప్రజల ఆకాంక్షలకు అనుగుణమా?
2. పాలనా వికేంద్రీకరణ, గడప గడపకు ప్రభుత్వం ద్వారా సుపరిపాలన:
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల పేరుతో పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలకమైన మొదటి అంచెను నిర్వీ ర్యం చేయటంసరైన వికేంద్రీకరణా? వైసీపీ శాసన సభ్యులు చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్య క్రమంలో ప్రతి గడపవద్ద ఎదురైన నిరసనలు సుప రిపాలనకు సంకేతాలా? ఈ నిరసనల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన కుండా ఎందుకు మొరాయించారు?
3. స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం కోసం చర్యలు చేపట్టాం:
14, 15 కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పంచాయతీలకు నేరుగా అందిన రూ.8,000కోట్ల ను దిగమింగిన జగన్‌రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థ లను నిర్వీర్యంచేసిన సంగతి బుగ్గన విస్మరిస్తేఎలా?
4. మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా విద్యా రంగంలో పలు సంస్కరణలు తేవటం జరిగింది:
కమీషన్ల కక్కుర్తితో స్కూల్ భవనాలకు పార్టీ రంగులు వేయటం, పలు చోట్ల పెచ్చులూడిపడటం, విలీనం పేరుతో వేలాది స్కూళ్ళ మూసివేత, ఐదేళ్లలో ఒక్క టీచర్‌ను కూడా నియమించకపోవటం, ఇంగ్లీష్ మీడియం అని, సీబీఎస్‌ఇ సిలబస్ అని, చివరగా ఐబీ సిలబస్ అని, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ అని గందరగోళం సృష్టించటం సంస్కరణ లా? ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అమ లులో అవకతవకలు సంస్కరణలా?
5. ప్రజారోగ్య రక్షణకు పటిష్టమైన చర్యలు:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దురవస్థ, కొండ ప్రాంతా ల్లో రోగులను డోలీల్లో మోసుకుపోవటం, భారీగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో రోగుల దురవస్థ, కొండ ప్రాం తాల్లో నిరంతరం ప్రబలుతున్న జ్వరాలు, రోగా లు.. జగన్ హయాంలో ఆరోగ్య రంగం అనారో గ్యాన్ని ఎత్తిచూపటంలేదా?
6. మహిళా సాధికారత సాధించాం :
మహిళలపై నిరంతరం జరుగుతున్న దాడులు, అడ్రస్ లేని దిశ, అమ్మ ఒడి కింద ఇచ్చే సాయంలో ప్రతి తల్లి నుంచి రూ.2,000 కోత విధించటం, డ్వాక్రా మహిళల పట్ల నిర్లక్ష్యం సాధికారతకు చిహ్నాలా?
7. రైతు సంక్షేమం కోసం కృషి చేశాము:
రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రవేశ పెట్టామని ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడారు. ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్ప త్తుల సేకరణలో జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు రైతన్నను తీవ్రనష్టానికి గురిచేశాయి.పంటల బీమా ప్రీమియం ప్రభుత్వం సకాలంలో చెల్లించక పోవ టం, పాడి రైతులకు కల్పిస్తామన్న అదనపు ఆదా యాన్ని అందేలా చేయకపోవటం, ఆక్వారంగాన్ని దెబ్బతీసిన జగన్ సర్కార్ రైతు పక్షమా?
8. సంక్షేమ ఆంధ్ర లక్ష్యంగా బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించాం:
పలు సాకులతో పలు సంక్షేమ పథకాల కింద లబ్ధిదా రుల కుదింపు, నెలవారీ పింఛన్‌ను రూ.3,000కు పెంచటంలో 4సంవత్సరాల జాప్యం,ఐదేళ్లలో పేద లకు 25లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఇప్పటి వరకు కేవలం 7 లక్షలు మాత్రమే పూర్తి చేయటం, ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల దుస్థితి, జన జీవన స్రవంతికి దూరంగా, నివాస యోగ్యం కాని పల్లపు ప్రాంతాల్లో జగన్ కాలనీల నిర్మాణం, దళిత కాలనీలకు వెలుపల ఉన్న దళితులకు ఉచిత విద్యు త్ కత్తిరింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు, 56 బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఏ ఒక్కదానికి రూపాయి నిధులు ఇవ్వకపోవ టం, పెళ్లి కానుకలు, పండుగ కానుకల రద్దు, అం బేద్కర్ విదేశీ విద్యను 3 సంవత్సరాలపాటు రద్దు చేయటం ఇత్యాది చర్యలు దళితులు, పేదల పట్ల జగన్ కు చిత్తశుద్ధి లేదని రుజువు చేస్తున్నాయి.
9. మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి పునాది అంటూనే గత ఐదేళ్లలో ఈ దిశలో సాధించిన ప్రగ తికి సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గన ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.పోర్టులు కడుతున్నాము, ఫిషిం గ్ హార్బర్లు కడుతున్నాము, వైద్య కళాశాలలు కడు తున్నాము అంటూ పాత పాటనే వల్లెవేశారు.
10. రహదారుల అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చు చేశామని క్లుప్తంగా చెప్పారేగానీ కొత్త గా ఎన్ని రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు నిర్మించారో, నిబంధనల ప్రకారం ఏ మేరకు రహ దారుల మరమ్మత్తులు చేపట్టారో చెప్పే ప్రయత్నం చేయలేదు.
11. నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గత ఐదేళ్లుగా ఎటువంటి ప్రగతి లేకుండా కునా రిల్లుతున్నా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే ఆర్థిక మంత్రి క్లుప్తంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నిర్వాకం తర్వాత కనీసం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేదు.
12. రాష్ట్రంలో పారిశ్రామికరంగం కుదేలైనా.. విశాఖ పట్నం- చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ల త్వరిత నిర్మా ణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాత్రమే గోడ మీద పిల్లిలా ఆర్థిక మంత్రి దాటవేశారు.
13. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ద్వారా 2017లో కేవలం 17వేల మందికే ఉపాధి లభిం చగా అది 2023 నాటికి 28 లక్షలకు చేరుకుం దని వినేవారు నమ్మలేని విధంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అదేరీతిలో 2020లో ఈ కేటగిరికి చెందిన 65,174 పరిశ్రమలు రిజిష్టర్ కాగా, అది అమాంతం 2023 నాటికి 7లక్షల 20వేలకు చేరి నట్లు మంత్రిగారు నమ్మబలికే ప్రయత్నం చేశారు.
14. విభజన సమస్యల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రం తెలంగాణతోటి, విభజన హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంతోటి జగన్ ప్రభుత్వం అవి శ్రాంత పోరాటం చేసినట్లు చెబుతూ ప్రజల చెవు ల్లో కేబేజీ పూలు పెట్టే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన.
15. కేవలం సంక్షేమ ఆధారిత పాలన వల్లనే రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి,మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయో రాజ్య స్థాపన జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన నమ్మబలికారు. సంక్షేమం, ఆర్థికాభివృద్ధి చర్యలు, విధానాల సమన్వయంతోటే సంపద సృష్టిద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమన్న ఆర్థిక సూత్రానికి విరు ద్ధంగా ‘జగనామిక్స్’కొత్త ఆర్థిక విధానమని, ఇందు లో ఎట్టి మార్పు ఉండదని, కనుక జగన్ పాలన కొనసాగితే ప్రజల భవిష్యత్తులో ఎట్టి మార్పురాదని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేయాల్సిన ఖర్చుల అవసరాల మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ అనుమతి తీసుకుంటుంది. ఎన్ని కల తరువాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి అనుమతిని కోరుతుంది.