- సుప్రీం వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి సిగ్గుపడాలి
- వివేక హత్యకేసు జాప్యానికి కారణం జగన్‌రెడ్డి
- జగన్‌రెడ్డిని సీబీఐ విచారించాల్సిందే
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ విషయమై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు జగన్‌రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధ వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. వివేకానం దరెడ్డి హత్య జరిగి 3 ఏళ్ల 7 నెలలైందని, ఈ కేసు విచారణలో జరిగిన జాప్యానికి, ఇతర అన్ని అవకతవకలన్నీ జగన్‌రెడ్డి పాత్రను ఎత్తిచూపుతున్నాయి. నిందితులను పట్టుకోలేకపోవడం, కేసు విచారణలో రాష్ట్రప్రభుత్వం సీబీఐకి సహకరించకపోవడం, ముద్దాయిలకు ఏపీ పోలీస్ వ్యవస్థ అండగా నిలవడం, సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవడం వంటి ఘటనలన్నిటి వెనుక జగన్‌రెడ్డి ప్రమేయం స్పష్టమవుతోంది. ఈపరిస్థితుల్లో ఏమాత్రం నైతిక విలువలున్నా జగన్‌రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి. జగన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం లో ఆటవిక, రాక్షస పరిపాలన రాజ్య మేలుతోంది. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జగన్‌రెడ్డి బాబాయ్ వివేకా నందరెడ్డి హత్యకేసు విచారణపై నేడు స్పందించింది. హత్యకేసు ముద్దాయిలను పట్టుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి లేదని వివేకా కుమార్తె సునీత పిల్ దాఖలుచేసింది. సదరు పిల్‌లో సునీత వెలిబుచ్చిన అనుమానాలన్నీ నిజమేనని సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. సాక్షుల్ని, దర్యాప్తు అధికారులను ఇబ్బందిపెట్టడం, అప్రూవర్ దస్తగిరిని వేటాడటం, అత ని తమ్ముడిని కొట్టి కేసులు పెట్టడం, దస్తగిరి కుక్కను చంపడం,ఉద్దేశపూర్వకంగా అతని ఆర్థిక మూలాలను దెబ్బతీయడం నిజమేనని సీబీఐ అభిప్రాయపడిరది.
ఏమాత్రం నైతిక విలువలున్నా జగన్ రెడ్డి రాజీనామా చేయాలి
హత్యకేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగితే కేసుకొలిక్కిరాదని,అసలు ముద్దాయిలు బయటపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి సిగ్గుపడాలి. ఏమాత్రం నైతిక విలువలు న్నా జగన్‌రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనా మాచేయాలి. ఆపదవిలో క్షణం కూడా కొనసాగే అర్హత అతనికిలేదు.హత్యకేసులో అసలుముద్దాయిలు బయ టపడకుండా వారిని కాపాడుతున్న అదృశ్యశక్తి మీరేక దా ముఖ్యమంత్రి గారు! వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలికివెళ్లిన సీఐ శంకరయ్య, సాక్ష్యాలు దొరక కుండా చేయడానికి సహకరించాడు. ఈ క్రమంలో పోలీస్‌శాఖ అతన్ని సస్పెండ్‌చేసింది. సీబీఐ విచారణ సమయంలో సీఐ శంకరయ్య 164సీఆర్ పీసీ స్టేట్ మెంట్ ఇస్తానని చెప్పాడు. ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు సీఐ శంకరయ్యతో మంతనాలుజరిపడం నిజంకాదా? అత ని సస్పెన్షన్ ఎత్తివేయడం, నిబంధనలకు విరుద్ధంగా అతనికి ప్రమోషన్ ఇచ్చి,కోరినచోట పోస్టింగ్ ఇవ్వ డం వాస్తవంకాదా? హత్యకేసులో సాక్ష్యాలు తారుమా రు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఎవరైనా ప్రమో షన్ ఇచ్చి,కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చి సత్కరిస్తారా? సీఐ శంకరయ్య హంతకులను పట్టుకు నేవారి తరపు న పనిచేస్తాడా..లేక హంతకుల తరపునచేస్తాడా?కేసు ని దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారిపై పోలీస్ కేసుపెట్టి, అతన్ని తమ దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించింది నిజంకాదా?ఈ కేసులో ముఖ్యమంత్రి నేతృత్వంలో ముద్దాయిల్ని పట్టుకోవడానికి పాటుపడా ల్సిన శంకరయ్య,తానే ముద్దాయిగా మారాడు. 164 సీఆర్ పీసీ స్టేట్‌మెంట్ ఇస్తానని సీబీఐకి శంకరయ్య చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి భయపడలేదా?
అన్ని వేళ్లు జగన్‌రెడ్డి వైపే చూపుతున్నాయి
వివేకా హత్యకేసు విచారణలోని ఘటనలన్నింటికీ కారణం ముఖ్యమంత్రేనని రూఢీచేస్తూ,అన్నివేళ్లు ఆయ నవైపే చూపిస్తున్నాయి. వివేకా హత్యకేసు విచారణ ఇంతకాలం నత్తనడకన సాగడానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రే కారణం. వివేకాహత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్ వేసిన జగన్ రెడ్డి, తరువాత దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? ముద్దాయిలకు శిక్షపడే అవకాశం ఉందనే కదా పిటిష న్ వెనక్కు తీసుకుంది?అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రా? ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడా? ప్రజల్ని రక్షిస్తాడా?
దస్తగిరికి కూడా మొద్దుశీను గతే పడుతుంది
అప్రూవర్‌గా మారిన దస్తగిరికి కూడా మొద్దు శీను కు పట్టిన గతే పడుతుంది. పోలీస్ వారు కొత్త పెళ్లి కొడుకులా చూసుకోవాల్సిన దస్తగిరిని, అతని ప్రాణా లను గాలికి వదిలేశారు. అతని ఐస్ ఫ్యాక్టరీకి కరెంట్ కట్ చేయడం,అతని తమ్ముడిని కొట్టి, అతనిపైనే కేసు పెట్టడం,అతని కుక్కను చంపడంఏమిటివన్నీ? డీజీపీ గా బాధ్యతలు చేపట్టింది మొదలు, రాజేంద్రనాథ్‌రెడ్డి ఏనాడైనా ఈకేసు విచారణలో సీబీఐకి సహకరించా రా? ఈ కేసు విచారణను ఈ రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సీబీఐ కోరిందంటే ఎంత గా ముఖ్యమంత్రి దెబ్బకు భయపడి ఉంటుందో చెప్పా ల్సిన పనిలేదు. స్వతహాగా వైద్యురాలైన వివేక కుమార్తె సునీత తన తండ్రిని చంపినవారిని శిక్షించడం కోసం ఢల్లీిలో చెమటలు కక్కుతూ తిరిగిందంటే అందుకు కారణం ముఖ్యమంత్రి కాదా? ఒక అప్పియరెన్స్ కి (ఒక వాదనకి) రూ.50లక్షలు తీసుకునేంతటి లాయ ర్‌ని పెట్టుకునేంత ఆర్థిక స్తోమత, కేసులో ఏ5గా ఉన్న శివశంకర్ రెడ్డికి ఉందా? అదే న్యాయవాది తిరిగి ప్రభుత్వం తరుఫున వాదిస్తాడు. అక్కడే అర్థమవుతోం ది ముద్దాయిలకు ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సం బంధమేంటనేది! సీబీఐ స్థానిక పోలీస్‌కు భయపడి వేరే రాష్ట్రానికి పోతామని చెప్పడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి. రేపు కోర్టు ఆర్డర్ రాకముందే ముఖ్యమంత్రి తన తప్పులు ఒప్పుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వివేకానందరెడ్డి చని పోయిన రోజు బాబాయిని చంపారంటూ చంద్రబాబు, లోకేశ్‌ల గురించి జగన్‌రెడ్డి తన మీడియాలో నీచాతి నీచంగా తప్పుడురాతలు రాయించాడు.అలాంటి వ్యక్తి ఒక్కసారిగా కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను ఎందు కు వెనక్కు తీసుకున్నాడు? అంతా ముఖ్యమంత్రి కను సన్నల్లో సాగిన మాయామశ్చీంద్ర వ్యవహారం. ఈ కేసులో సీబీఐ ముఖ్యమంత్రిని విచారించాల్సిందే. ఆయన్ని విచారించి తగిన సమాచారం రాబడితేనే కేసు ముగుస్తుందని వర్ల రామయ్య తేల్చి చెప్పారు.