.అందుకే కలలో కూడా మా బాబే కన్పిస్తున్నాడు!
.ఇగోలను పక్కనపెట్టి పోరాడితే జయం మనదే!
.నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి
.ఇంట్లో కుక్కను పెంచుకుంటే కూడా పన్నేస్తావా తుగ్లక్?
.భయం మా బ్లడ్‌లో లేదు… తప్పుడు కేసులకు వెరవం!
.పేదవాడి నోటిదగ్గర కూడులేసిన శాడిస్టు ఎమ్మెల్యే ఆర్కే
.త్వరలో మంగళగిరిలో సంజీవిని ఆరోగ్య కేంద్రాలు
.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉచ్చ… అందుకే ఆయనకు కలలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారు. అందుకే రోడ్ల పై గుంతలకు, పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడానికి, వరదలకు కూడా కారణం చంద్రబాబే అని జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు నరకం చూస్తున్నారు. అర్బికే సెంటర్లు కమిషన్ సెంటర్లుగా మారాయి. పండించిన పంటకు గిట్టబాటు ధర లేదు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారని అన్నారు. కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంచనపల్లికి చెందిన పలువురు వైసిపి కార్యకర్తలు టిడిపి లో చేరారు. వారికి పసుపు కండువా కప్పి లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడొచ్చినా మంగళగిరిలో ఎగిరే జెండా రెపరెపలు పులివెందులను కూడా ఖచ్చితంగా తాకుతాయని అన్నారు. భయం మా బయోడేటా లో లేదు. కేసులు పెడతామని బెదిరిస్తే ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో అని కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. సీనియర్లు, జూనియర్లు కలిసి పార్టీ కోసం పనిచేయాలి. ఇగోలు పక్కన పెట్టి పనిచేస్తే విజయం మనదే. నాయకులంతా ప్రజలకు అందుబాటులో ఉండి చేతనైనంత సాయం చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని లోకేష్ విజ్జప్తిచేశారు.
జగన్ రెడ్డి బయటకొస్తే జనానికి నరకమే!
ఇంట్లో కుక్క ని పెంచుకుంటే దానికి కూడా పన్ను వేస్తున్న దుర్మార్గుడు జగన్ మోసపు రెడ్డి. రాష్ట్రంలో మార్పు మొదలైంది… గడపగడపకు వెళ్తున్న వైసిపి ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయడమే మార్పుకి నాంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బయటకి రావాలి అంటే భయం అందుకే 144 సెక్షన్ పెడుతున్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని వేధిస్తున్నారు. మూడేళ్ల మూడు నెలల పాటు తాడేపల్లి కొంపలో పడుకున్న జగన్ రెడ్డి కేవలం ఒకే ఒక్క రోజు బయట పడుకున్నారు. అది కూడా వరదలు వచ్చిన 15 రోజుల తరువాత ప్రజల్ని పరామర్శించడానికి వెళ్లారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ముద్దులు పెట్టారు. ఇప్పుడు ప్రజల్ని పీడిస్తున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు, ఆర్టీసి ఛార్జీల పెంపుతో పేదలు బ్రతకలేని పరిస్థితి తెచ్చారు. పేదవాడి నోటిదగ్గర కూడులాగడానికి మనసెలా వచ్చింది? మంగళగిరిలో రెండు సార్లు గెలిచిన కరకట్ట కమల్ హాసన్ నియోజకవర్గానికి ఎం చేశారు? లోకేష్ గెలిస్తే పేదల ఇళ్లు కూలుస్తాడని ప్రచారం చేసిన కరకట్ట కమల్ పేదల ఇళ్లు కూల్చేశారు. డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి జేసీబికి రెస్ట్ ఇచ్చారు. లేకపోతే కరకట్ట కమల్ విధ్వంసకాండ కొనసాగేది. ముఖ్యమంత్రి ఇంటి పక్కన పేదలకు నివసించే హక్కు లేదా? ముఖ్యమంత్రి ఉండే నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కరకట్ట కమల్ రాజన్న క్యాంటీన్ ఎక్కడ? కూరగాయల పథకం ఎక్కడ? పేదలు, ప్రజలు ఎన్నికల తరువాత గుర్తు ఉండరా? నియోజవర్గంలోని ఇసుక దోచుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారు. కరకట్ట కమల్ పెట్టడు. వేరే వాళ్ళను పెట్టనివ్వడు. మంగళగిరి లో అన్న క్యాంటీన్ పెడితే రచ్చ చేసి అడ్డుకున్నారు. పేద వాడి నోటి దగ్గర లాక్కోవడానికి ఎమ్మెల్యే కి మనస్సు ఎలా వచ్చింది. అన్న క్యాంటీన్ పెట్టామని 60 మంది నాయకులు, కార్యకర్తల పై కేసులు పెట్టారు.
త్వరలో మంగళగిరి నియోజకవర్గంలో సంజీవిని ఆరోగ్యకేంద్రాలు
గెలిస్తే తాడేపల్లి లో యూ 1 జోన్ ఎత్తేస్తాం అని హామీ ఇచ్చిన కరకట్ట కమల్ ఆ హామీని మర్చిపోయారు. గెలిస్తే ఇళ్ల పట్టాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమయ్యింది? వచ్చే ఎన్నికల తరువాత కరకట్ట కమల్ మంగళగిరి లో ప్యాకప్ ఖాయం. ఎన్నికల్లో ఓడిపోయినా అనేక సేవా కార్యక్రమాలు నేను చేసున్నా. పెళ్లి కానుక, పండుగ కానుకలు, అన్న క్యాంటీన్, స్వయం ఉపాధి కోసం తోపుడు బళ్లు అందిస్తున్నాం. వచ్చే నెలలోనే తాడేపల్లి లో కూడా అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం. రానున్న మూడు నెలల్లో మంగళగిరిలో, తాడేపల్లి, దుగ్గిరాల లో సంజీవని ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తాం. పేదలకు ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే వారమే దుగ్గిరాల లో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తామని లోకేష్ పేర్కొన్నారు.