రాజంపేట: 2019 ఎన్నికల ముందు అమలుకానీ వాగ్దానాలతో ప్రజలను సీఎం జగన్ రెడ్డి నిలువునా మోసం చేశాడని రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు విమర్శించారు. ఒంటిమిట్టలోని టిడిపి నాయకులతో కలిసి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాదుడు బాదుడు కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.