బ ఇప్పటికైనా సమాధానం చెప్పు
బ హంతకులను రక్షిస్తున్నది జగన్‌రెడ్డేనని సామాన్యుడికీ అర్థమయింది
బ ప్రజలముందు దోషిగా జగన్‌రెడ్డి
బ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శలు
అమరావతి: బాబాయ్ హత్యకేసుని ఛేదించి అసలు నిందితుల్ని శిక్షించలేని అసమర్థుడిగా జగన్ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడని టీడీపీ అధి కారప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించడం కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీత, ఆమె కుటుంబంపై తన సోషల్ మీడియా బ్యాచ్‌తో నీతిమాలిన ప్రచారం చేయించడం జగన్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శ నమని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన విలేకరు లతో మాట్లాడుతూ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనప్పుడు ఆ వార్త తెలిసిన వెంటనే మృతుడి ఇంటికి చేరు కుంది ఎంపీ అవి నాష్‌రెడ్డి, అతడి తండ్రి భాస్కర్ రెడ్డే. ఘటనా స్థలానికి వారు చేరుకున్నాకే మృత దేహానికి కట్లు కట్టించి రక్తపు మరకలు శుభ్రం చేయించి, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి సహా అందరూ.. గొడ్డలి పోట్లను కప్పిపుచ్చి గుండెపోటు తో చనిపోయాడని నమ్మించే యత్నం చేశారు.వారు ఆనాడు అలా ఎందుకు చేశారో.. ఎవరి ఆదేశాల తో చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. వివేకా మరణవార్త తెలిసిన తరువాత కూడా హైదరాబాద్ నుంచి నింపాదిగా కడపకు చేరుకున్న జగన్‌రెడ్డి అప్పుడు మీడియా ముందుకొచ్చి తన బాబాయ్‌ను నాడు అధికారంలో ఉన్న చంద్రబాబే చంపించాడని పచ్చి అబద్ధాలాడాడు. మీడియా ఎదుట మొసలి కన్నీరు కార్చి నటించాడు. వివేకా హత్యోదంతంపై ఆనాడు సీబీఐ విచారణ డిమాండ్ చేసిన జగన్ రెడ్డి..తీరా ముఖ్యమంత్రి అయ్యాక కేసు విచారణకు అడ్డుతగిలి, నిందితులకు అండగా నిలిచాడని నాగుల్‌మీరా విమర్శించారు.
సమాధానం చెప్పాలి
వివేకా హత్యకేసు గురించి మాట్లాడే సునీత, ప్రతిపక్షనేతలపై, కేసులో అప్రూవర్‌గా మారిన దస్త గిరి లాంటి వాళ్లపై ఎదురుదాడి చేయడం కాదు.. వారు అడిగే ప్రశ్నలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. వివేకాను చంపడం కోసం సుపారీగా రూ.40కోట్లు ఎవరిచ్చారు,ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న జగన్‌రెడ్డి.. తర్వాత కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? సీబీఐ వాళ్లు అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో రక్షణ కల్పించింది జగన్ కాదా? సీబీఐ అధికారులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించింది నిజం కాదా? వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తేల్చినా జగన్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఢల్లీి పెద్దల చుట్టూ తిరిగింది నిజంకాదా? బాబాయ్‌ను చంపిన వారిని జగన్‌రెడ్డే కాపాడుతున్నాడని సామాన్య ప్రజ లకు సైతం అర్థమయింది. జగన్‌రెడ్డికి ఏమాత్రం మంచి, మానవత్వం ఉన్నా బాబాయ్‌ని చంపిన దోషుల్ని కాపాడే ప్రయత్నాలు ఇకనైనా విరమించు కోవాలని నాగుల్‌మీరా హితవు పలికారు.
ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు
రాష్ట్రాన్ని నేరాలు, ఘోరాలకు కేంద్రంగా మార్చి న జగన్‌రెడ్డికి మరలా ఓటేస్తే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ ఉండదు. ఫ్యాక్షన్ భావజాలమున్న వ్యక్తికి మరలా ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టే. జగన్ తన పార్టీ అభ్యర్థుల్ని మార్చే పనిలో ఉంటే… జనం ఆయన్ని మార్చే పనిలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన జగన్‌రెడ్డి.. రాష్ట్ర ఖజానాను, ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి తన కుటుం బానికి, బినామీలకు దోచిపెట్టాడని నాగుల్‌మీరా ధ్వజమెత్తారు.