అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. చీకట్లో రాళ్ల దాడి చేసే దుస్థితికి తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జగన్ రెడ్డి దిగజారిపోయాడు. చీకట్లో దొంగ దెబ్బ ఎందుకు, దమ్ముంటే మా ముందుకు వచ్చి నిలబడు. నేరుగానే తేల్చుకుందాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన వైసిపి రౌడీలని శిక్షించాలి. దాడిలో గాయపడిన సిఎస్‌ఓ మధు గారు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు.
నీ ధీమా అదేనా జగన్ రెడ్డీ?
వై నాట్ 175 స్లోగన్ వెనక ధీమా ఇదేనా జగన్ రెడ్డీ? ఓటుకు 5 వేలు సెప’’రేటు’’ పెట్టి కుప్పం మున్సిపాలిటీని గెలిచినట్టే రాష్ట్రం అంతా అక్రమాల రూటు పట్టారు. చివరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లనే నమ్ముకున్న దొంగ ముఖ్యమంత్రి గుట్టు మరోసారి రట్టు అయ్యిందని టిడిపి యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న తూర్పు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీచర్లు కాని వారిని, అర్హత లేని వారిని ఓటర్లుగా వైసీపీ నేతలు చేరుస్తున్నారు. దొంగల పార్టీ వైసీపీకి చెందిన వారిని ఓటర్లుగా చేర్చుకోలేదనే కక్షతో అనంతపురం, నెల్లూరు డీఈవోలని బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు జగన్ రెడ్డి. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని దొంగ టీచర్ల ఓట్ల చేర్పులను అడ్డుకోవాలి. అక్రమాలకి సహకరించలేదనే అక్కసుతో బదిలీ చేసిన డీఈవోలని యథాస్థానంలో పోస్టింగ్ ఇవ్వాలి.
గుంతలు పూడ్చలేరు కానీ ఇళ్లు కూలుస్తారు!
రోడ్లపై గుంతలు పూడ్చలేని వైసిపి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం విడ్డూ రంగా ఉందని నారా లోకేష్ పేర్కొ న్నారు. జగన్ జేసీబీలు పేదలు రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం లో సీఎం ఇంటి పక్కన పేదల ఇళ్లు కూల్చడంతో మొదలైన విధ్వంసం కొనసా గుతూనే ఉంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇళ్లు కూల్చడం ఎమ్మెల్యే ఆర్కేకి వ్యసనంగా మారిపోయింది. నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో పేదల ఇళ్లు కూల్చారు. ఇప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పేరుతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గం. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.