- నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం
- వైసిపి సైకోల్లారా.. ఖబడ్దార్… చిల్లరవేషాలు వేస్తే తాటతీస్తా!
- అరాచకపాలనపై పోరాటానికి ఇంటికొకరు కదిలిరండి
- నందిగామ సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
ఎన్టీఆర్ జిల్లా : వైసిపి సైకోల్లారా ఖబడ్దార్… చిల్లర వేషాలు వేస్తే తాటతీస్తా.. బీ కేర్ ఫుల్ మేం అసమర్థులం కాదు. చట్టాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్నాం.. తప్పుడు చేష్టలు మానుకోకపోతే మీ అంతుచూస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్ర బాబునాయుడు నందిగామలో పర్యటిస్తున్న సమయం లో ఓ వైసిపి సైకో చంద్రబాబునాయుడుపైకి బలంగా రాయి విసిరారు. అయితే అది గురితప్పి ఆయన పక్కన ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు తగలింది. మధుకు తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్ర బాబు వ్యక్తిగత వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం నందిగామ సభలో చంద్రబాబు నాయుడు ఆగ్రహోద్రుడవుతూ ఇక్కడ కొందరు వైసిపి రౌడీలున్నారు. వాళ్లు జేబుల్లో రాళ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అటువంటి వారుంటే వారు చెయ్యి పైకిలేవకుండా చేయాలని పిలుపునిచ్చారు. దరిద్రులు, చేతగానివారు, పనికిరాని దద్దమ్మలు చేసే పని రాళ్లు విసరడం. వైసిపి సైకోలు దొంగలమాదిరి వచ్చి రాయి వేస్తే మా సెక్యూరిటీ ఆఫీసర్‌కు రక్తం వచ్చింది. కృష్ణా జిల్లాలో ఇటువంటి కుసంస్కృతి ఎక్కడైనా ఉందా? తాము రాజకీయంగా పోరాటం చేశామేతప్ప ఇటు వంటి చిల్లర పనులు చేయలేదన్నారు. జగన్‌రెడ్డికి నేరుగానే వార్నింగ్ ఇస్తున్నా. పులివెందుల రాజకీ యాలు చేయొద్దు. పవన్ చెప్పుచూపిస్తాడా అంటున్నా రు. నీ లాంటి నీచులకు ఏం చూపించాలంటూ నిప్ప లు చెరిగారు.
నవరత్నాలు కావవి.. నవద్రోహాలు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవరత్నాల పేరుతో పత్రికల్లో ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. వాస్తవానికి అవి నవరత్నాలు కాదు… నవద్రోహాలు. టిడిపి నేతలుగానీ, కార్యకర్తలు గానీ బయటకు రాకుండా చేసి పబ్బం గడుపుకోవాలన్నదే వైసిపి ప్లాన్ . ఒంగోలులో నిర్వహించిన మహానాడు సందర్భంగా టిడిపి కేడర్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. బస్సులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. కేడర్ టూవీలర్స్ పైన, కాలినడకన లక్షల సంఖ్యలో సభాప్రాంగణానికి చేరుకున్నారు. నందిగామలో ఇప్పుడు కేడర్ లో చూస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదు. 40ఏళ్లలో తొలిసారి చూస్తున్నా. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40నెలల్లో అన్ని ధరలూ విపరీతంగా పెరిగాయి. టిడిపి హయాంలో ఉచితంగా లభించే ఇసుక ట్రాక్టర్ ఇప్పుడు 10వేలు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇసుక దొంగలుగా మారారు. వారి దోపిడీ కారణంగా మట్టి, కొండలను గుండుకొట్టించేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతనెలా సాలా ప్రజలనుంచి 2వేలకోట్ల చొప్పున దోచుకుంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్దది ఇసుక కుంభకోణం. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. కరెంటు, ఆర్టీసి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి వస్తోంది.
ప్రజల ప్రాణాలంటే లెక్కలేని జగన్
ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నిన్న అనంతపురం జిల్లాలో తీగలు తెగిపడి ఆరుగురు చనిపోతే జగన్ రెడ్డిలో చలనం లేదు. నాటకాల రాయుడ్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాడు. 175కి 175 వస్తాయని ప్రగల్భాలు పలుకుతున్నారు. జగన్ రెడ్డీ… నువ్వు ఇప్పుడు చేస్తున్న అరాచకాలకు ఎన్నికల తర్వాత నువ్వు ఉండేది జైలులోనే. నీ పార్టీ బంగాళాఖాతంలో కలపడం ఖాయం. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో పేదలు కడుపునిండా తిండితింటున్నారా? అప్పులు లేకుండా రోజు గడపగలుగుతున్నారా? సంవత్సరానికి ఒక్కో కుటుంబంపై లక్షరూపాయల భారం పడుతోంది. ఆయన ఇచ్చేది గోరంత, దోచుకునేది కొండంత. ఇంకా ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు? ఒక పక్క కుంభకోణాలు చేస్తూ మరోపక్క ధరలు పెంచుతున్నారు. బటన్ నొక్కి ఏదో చేస్తున్నానని జనాన్ని నమ్మబలుకుతున్నారు. సాక్షి పేపర్ లో ఫుల్ పేజి ప్రకటనలతో ఆయన ఖజానాకే ఆదాయం వెళ్తోంది తప్ప సామాన్యులకు ఒరిగేదేం లేదు. నీ మాటలు నమ్మడానికి సిద్దంగా లేరు.
అర్థరాత్రి గోడలు దూకుతున్న పోలీసులు
రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైనా స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా? సోషల్ మీడి యాలో పోస్టు పెట్టడం నేరమా? అటువంటి కేసులకు సిఐడికి ఏం పని? సోషల్ మీడియా కేసులు పెడితే బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోయే పరిస్థితులు లేవు. పోలీసులకు రాత్రి గోడలు దూకడం అలవాటైంది. నేను ఇలాంటి పోలీసులను ఎప్పుడూ చూడలేదు. మళ్లీ అధికారంలోకి వస్తా. అన్ని గుర్తు పెట్టుకుంటా. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదలిపెట్టను. 2సెంట్లకు నాలా అనుమతి లేదని అయ్యన్నను తప్పడుకేసులు పెట్టిన మీరు తప్పించుకోలేరు. అలాగైతే కొండలు తవ్వేసిన వాడిని ఏమనాలి? నదుల్లో ఇసుక మాయం చేసిన వాడికి, ఖాళీ స్థలాలు కబ్జాచేసిన వాడికి ఏ శిక్షవేయాలి? నీతి, నిజాయితీ లకు మారుపేరు టిడిపి. అవినీతి, అరాచకాలే పునాదులుగా ఏర్పడిన పార్టీ వైసిపి. నేను ఇటువంటి వీధి రౌడీలకు భయపడతానా? 24 క్లేమోర్ మైన్లకే భయపడలేదు. మతవిద్వేషాలను రెచ్చ గొట్టారు. రాయలసీమలో ముఠాలను, హైదరాబాద్ లో మతకల్లోలాలను అణచిన పార్టీ. ఈ రోజు రాష్ట్రం లో ఆడపిల్లలకు రక్షణ ఉందా? తెలుగుదేశం పార్టీ కేడర్ ఇంటికొకరు ప్రజాపోరాటానికి రండి. ఎన్ని కేసులు పెడతారో చూద్దాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. మీరు మీ కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా నిద్రపోవాలంటే టిడిపి జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడటం నా ఒక్కడి బాద్యత కాదు… మీ అందరిపైనా ఉంది.
రాష్ట్రమంతా ఫ్యాక్షన్ రాజకీయం చేయాలని కుట్ర
రాజకీయ లబ్ధికోసం బాబాయ్‌ని లేపేసి నారా సుర రక్తచరిత్ర అని సాక్షిపేపర్‌లో రాశారు. నీ ఆట లు సాగవు.సాగనంపేరోజులు వచ్చాయి. కోడి కత్తి డ్రామా నాయకుడు, బాబాయ్ గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన నాటకాల రాయుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. తన పర్యటనలో ఎక్కడ చూసినా యువతలో ఉత్సాహం ఉరకలేస్తోం ది. టిడిపిలో యువతదే భవిష్యత్తు. పోరాటానికి సిద్ధం కావాలి. ప్రతిఒక్కరూ టిడిపి జెండా పట్టాలి. మీ బంగారు భవిష్యత్తు టిడిపి వల్లే సాధ్యం. దుర్మార్గుడు జగన్‌రెడ్డి పాలనలో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా? జగన్‌రెడ్డి పులివెందుల రాజకీ యం రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారు. టిడిపి నేతలపై తప్పుడు కేసులుపెట్టిస్తారా, శాశ్వతంగా మన పిల్లలను భవిష్యత్తు నాశనం చేస్తారు. జగన్‌రెడ్డి కరు డుగట్టిన నేరచరితుడు. రాజకీయం కోసం ఎంతకైనా తెగించే ఫ్యాక్షన్ మన స్థత్వంగల నీచప్రవృత్తి గల నేత. వైసిపి అరాచకా లను టిడిపి శ్రేణులు ధైర్యంగా ఎదురొంటూ ముందుకు సాగాలి.