. ప్రతిపక్షనేత కాన్వాయ్ పై రాళ్లదాడి ఫ్యాక్షన్ సంస్కృతి కాదా?
. ఈ దాడికి జగన్, పెద్దిరెడ్డి బాధ్యత వహించాలి
. మీలాగే వ్యవహరిస్తే అనాడు పాదయాత్ర చేయగలిగే వారా?
.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లు పల్లిలో వైసిపి గూండాలు టిడిపి కార్యకర్తలపై దాడిచేసి గాయపర్చడం హేయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్షనేత కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహిం చాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు వంటి అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలి. రేపు అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని సిఎం దృష్టిలో పెట్టుకొని మసలుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. మీరు ప్రతి పక్షంలో ఉన్నపుడు కూడా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే మీరు పాదయాత్ర చేయగలిగేవారా? కనీసం ఇంటినుంచి బయటకు రాగలిగేవారా? జగన్ నేతృత్వంలో వైకాపా గూండాలు పాల్పడుతున్న దుశ్చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దుష్ప్రచార ఎదురుదాడి మానుకొని రాళ్లదాడికి పాల్పడిన వైసిపి గూండాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.