- హార్టికల్చర్ యూనివర్సిటీలో వైసీపీ అనుకూలురుకే ఉద్యోగాలు
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన నరేష్ ఆవేదన
- ప్రజావినతుల కార్యక్రమంలో వైసీపీ నిర్వాకాలపై ఫిర్యాదులు
- బొల్లా బ్రహ్మనాయుడి అనుచరుల దందా..జేసీబీతో ఇల్లు ధ్వంసం
- టీడీపీ ఏజెంట్‌గా కూర్చున్నందుకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు
- వల్లభనేని అనుచరులు రాత్రికి రాత్రే వరి పంటను కోసుకెళ్లారు
మంగళగిరి(చైతన్యరథం): తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు పిలిచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వైసీపీ అనుకూలురుకే ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎన్.నరేష్ అనే దివ్యాంగుడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. వైసీపీ పార్టీ అనుకూలమైన వారికి మాత్ర మే ఉద్యోగాలు ఇచ్చి దివ్యాంగులైన తమకు జగన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింద ని వాపోయారు. రెండుసార్లు దివ్యాంగుల కోటాలో రావాల్సిన ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట తెలుగు యువత ఉపాధ్య క్షుడు రిష్వంత్‌లకు వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
- స్థలం విషయంలో కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పటి వినుకొం డ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు వందమంది వచ్చి తమ ఇంటిపై దాడి చేసి తమను కొట్టి జేసీబీతో ఇల్లు, కొట్టును ధ్వంసం చేసి వెళ్లారని వినుకొండకు చెందిన కామా వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
- జ్యోతుల చంటిబాబుతో రెవెన్యూ అధికారులు పోసుబాబు, చెల్లాయమ్మలు కుమ్మక్కై తమను భారీగా మోసం చేశారని కాకినాడ జిల్లాకు చెందిన వారు ఫిర్యాదు చేశారు. ప్రభు త్వ భూమిని జీరాయితిగా పెట్టి తమ చేత కోటిన్నర పెట్టి కొనుగోలు చేయించి రూ.40 లక్షలు లంచంగా తీసుకుని నట్టేట ముంచారని వాపోయారు. ఎన్నిసార్లు వెళ్లి అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని, తమను మోసం చేసిన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుం చి తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు.
- తాను టీడీపీ ఏజెంట్‌గా కూర్చున్నందుకు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి రఘురామిరెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని కడప జిల్లా చాపాడుకు మండలం ఎన్.అనంతపురం గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేతలు తన పొలంలో పంటను ధ్వంసం చేసి పోలీసులతో భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకోవడంతో రోడ్డున పడ్డామని, బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు.
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రి తమ పొలంలో ఉన్న వరి పంటను కొసుకుపోయారని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంకు చెందిన వేమూరి రామారావు, వేమూరి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేదని, పంటను సాగు చేస్తే ధ్వంసం చేస్తున్నారని, పోలీసులు వారి పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
- తమ స్థలాన్ని ఆక్రమించి అందులో దౌర్జన్యంగా నాగవరం గ్రామానికి చెందిన యోహాను ఇల్లు కట్టుకుంటున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని తమ స్థలం కబ్జా నుంచి విడిపించా లని ప్రకాశం జిల్లా క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన శారగొండి సామ్రా జ్యం ఫిర్యాదు చేశారు.
- ఏపీ ప్రభుత్వ విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రులలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను ఆప్కాస్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి వాసంశెట్టిని అభ్యర్థించారు.
- పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యూవే కాంప్లెస్ పక్కన ఉన్న సర్వే నెంబర్ 195-1ఏ, 1బీలో ఉన్న తమ ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన రేకులషెడ్‌ను తొలగించి తమకు న్యాయం చేయాలని గుంటూరుకు చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
- గండేపల్లి మండలం యర్రంపాలెంలో ఉన్న 3.56 సెంట్లను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితా 22-ఏ కేటగిరి ఇ-5లో చేర్చి హైదరాబాద్ ఎండోమెంట్ వారు కబ్జా చేశారని.. తమ భూమిని కబ్జా నుంచి విడిపించాలని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుల పల్లి గ్రామానికి చెందిన తుమ్మా వీర్రాజమ్మ వినతిపత్రం అందజేశారు.
- తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆక్రమించుకుని కబ్జాదారులు తమపైనే దాడు చేస్తున్నారని తమ భూమిని విడిపించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన కొండెపోగు శాంతి వేడుకున్నారు.
- అభివృద్ధి పేరుతో భూమి తీసుకుని డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ముక్కామలకు చెందిన కొప్పిశెట్టి రాంబాబు బెదిరిస్తున్నాడని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కముజు శ్యామసుందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశాడు. అతని నుంచి రావాల్సిన డబ్బును ఇప్పించాలని విన్నవించాడు.
- తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన తంగెళ్ల వెంకటేశ్వర్లు సమస్యను వివరిస్తూ తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు పేర్లు మార్చి ఇబ్బంది పెడు తున్నారని, దాన్ని సరిచేసి తమ భూమి తమకు ఉండేలా చూడాలని వేడుకున్నారు.
- కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. సామర్లకోట మండలం మాధవపట్నంలో గోదావరి కాలువ పరివాహక ప్రాంతంలో నిర్మించి న కనకదుర్గ, వెంకటేశ్వర, వినాయక, శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయా లకు సంబంధించి దేవాదాయ ధర్మదాయ చట్టÊలోని సెక్షన్ 43ను అనుసరించి నోటిఫై చేసి ఇద్దరు అర్చకులకు గౌరవ వేతనం, జీతభత్యాలు దేవాదాయ శాఖ నుంచి చెల్లించాలని కోరారు.
- కరోనా, ఎన్నికలు, దసరా సమయాల్లో తమను సిల్ట్ వర్కర్‌లుగా తీసుకుని తరువాత తమకు పనిలేదు పొమ్మని చెబుతున్నారని విజయవాడకు చెందిన మహిళలు పెద్దఎత్తున వచ్చి నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనికల్పించి ఆదుకోవాలని కోరారు.
- రాజధాని అభివృద్ధి కోసం తన పింఛన్ డబ్బుల నుంచి కొంత సొమ్మును గుంటూరు జిల్లా కాకుమాను మండలం తెలగాయపాలెంకు చెందిన సాంబశివరావు అందించారు. అలాగే పలవురికి మంత్రి వాసంశెట్టి ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు.