.అవినీతిపరులు, అరాచకులను తరిమికొట్టాలి
.యువతకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల పిలుపు
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ జగన్‌రెడ్డి అసమర్థ పాలనతో యువత భవిష్యత్ ప్రమాదంలో పడిదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపరులను, అరాచకులను తరిమికొట్టాలని బుధవారం ఆయన ఒక ప్రటనలో యువతకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల ముందు యువతకు అనేక హామీలిచ్చి వారి ఓట్లు దండు కొని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డివారి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టారని ధ్వజమెత్తారు. డొల్ల పరిపాలనలో యువతకి ఉపాధి కల్లగా మిగిలిపోయిందన్నారు. అధి కారంలోకి రాగానే మొట్టమొదట చేసే పని ఖాళీగా వున్న 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయ్యడమేనని చెప్పి మాటతప్పారని మండిపడ్డారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాయమాటలతో యువ తని బులిపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మూడేళ్లు దాటినా ఎటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకుండా నిరుద్యోగులను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించక పోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న యువత భవిత ప్రశ్నార్థ కమయిందని పేర్కొన్నారు. ఏటా లక్షలు ఖర్చు పెట్టి వివిధ కోర్సులు పూర్తి చేసి బయటికి వస్తున్న యువతకి ఉద్యోగం, ఉపాధి చూపించే విధానాలు అమ లు చేసే సమర్థత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. బాధ్యత, సమర్థత లేని, అబద్దాల పరిపాలనలో యువత భవిత ప్రమాదంలో పడిరదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కొత్తగా వచ్చే పెట్టుబడులేవని, ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సంక్షోభం కారణంగా చదువుకున్న యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. పలువి భాగాల్లో ఖాళీగా వున్నఉద్యోగాల భర్తీకి కార్యాచరణ లేదన్నారు. నిరుద్యోగం పెరిగి అసమానతలు పెరిగిపోతున్నాయని తెలిపారు. జగన్‌రెడ్డి చెప్పడానికి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పారని, అయితే కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగపోగా ? కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేస్తున్నారని మండిపడ్డారు. 34 లక్షల మంది యువత భవిష్యత్ ను నాశనం చేశారన్నారు.? కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తూచ్ అని వారిని రెగ్యులైజ్ చేయకపోగా,ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేశార విమర్శించారు. ఏపీపీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి వ్యవస్థ ప్రతిష్ఠ మంటగలు పుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే జగన్‌రెడ్డి ఆ పథకాన్ని రద్దుచేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. వారికి సబ్సిడితో బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి వారి పొట్టకొట్టారని మండిపడ్డారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎం ఐఈ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్స్ అన్ ఎంప్లాయిమెంట్ రేటు 33.6 శాతానికి పెరిగి బీహార్ సరసన చేరినట్లు తెలిపారు. దీనికి కారణం ఎవరో యువత ఆలోచించాల న్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తానని యువతలో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన తరువాత హోదాపై జగన్ రెడ్డి పిల్లిమొగ్గలు వేసినట్లు తెలిపారు. తన కేసుల మాఫీ కోసం హోదా ను కేంద్రానికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. అడు గడుగునా వంచించే ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యువత వివేకవంతంగా వ్యవహరించాలన్నారు. వాస్తవాలు తెలుసుకొని తమ సమస్యలు పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చెయ్యాలని యనమల రామకృష్ణుడు పిలుపు ఇచ్చారు.