- ప్రతి రోజు చెల్లిస్తున్న వడ్డీ రూ.80 కోట్లు
- రోజువారీ ఖర్చు రూ.698 కోట్లు.. సొంత ఆదాయం రూ.264 కోట్లే
- ఇతర అప్పులు, పెండిరగ్ బకాయిలు కలిపి జగన్‌రెడ్డి చేసిన అప్పు రూ.8.50 లక్షల కోట్లు
- గత తెదేపా ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.64 లక్షల కోట్లు మాత్రమే.
- రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ధ్వజమెత్తిన తెదేపా నేత నీలాయపాలెం విజయకుమార్
అమరావతి, చైతన్యరథం: జగన్‌రెడ్డి హాయాంలో సాధారణ పాలన అస్తవ్యస్తం, అధ్వాన్నంగా ఉంటే, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారాల్లో అంతకంటే దారుణంగా తయారైందని, వైసీపీప్రభుత్వం రోజుకి రూ.257కోట్ల అప్పుచేసిందని కాగ్ (జశీఎజ్‌ూతీశీశ్రీశ్రీవతీ aఅస Aబసఱ్‌శీతీ Gవఅవతీaశ్రీ శీట Iఅసఱa) నిర్ధా రించిందని లెక్కలే నిదర్శనమని టీడీపీ అధికార ప్రతి నిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ తెలిపారు. ఇంతగా అప్పులు చేస్తూఎఫ్.ఆర్.బీ.ఎమ్ పరిధి దాటడం లేదని మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ అధికారులు జంకూ.. బొంకూ లేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెం బర్ వరకు రోజుకి రూ.698కోట్లు ఖర్చు పెట్టిందని, రోజువారీ సొంత ఆదాయం రూ.264కోట్లు మాత్రమే నని ఆయన వివరించారు.
(డిసెంబర్ దాకా 1,88,324 కోట్లు ఖర్చు పెట్టింది -అంటే నెలకి-రూ.20,924 కోట్లు-రోజుకి రూ.698 కోట్లు) దానిలో ప్రభుత్వం రోజుకి సొంతంగా సంపా దించేది మూడో వంతే-కేవలం రూ.264 కోట్లు మాత్ర మే. మరి మిగతా రూ.434 కోట్లు ఎక్కడ నుంచి వస్తు న్నాయి అంటే, దానిలో రోజుకి రూ.257 కోట్ల అప్పుల సొమ్మే ఉంది. అదికాకుండా..
రాజ్యాంగం ప్రకారం, కేంద్రం అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాల మాదిరి అనుమతి అక్కర్లేదు. కానీ రాష్ట్రాలు అప్పు తీసుకోవాలి అంటే, కేంద్రం అను మతి కావాలి. అప్పులు తీసుకుంటున్నారు అంటే మాత్రం..మంత్రి బుగ్గనకు తెగ కోపంవచ్చేస్తుంది. అదే వ్యక్తి ప్రతి మంగళవారం అప్పులకోసం నానా అవస్థలు పడుతుంటారు. మేము ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోనే అప్పు లు తీసుకొంటున్నాము అని అడ్డగోలుగా వాదిస్తారు. తాను చెప్పేది ఎంత నిజమో బుగ్గనే సమాధానం చెప్పాలని విజయకుమార్ డిమాండ్ చేశారు.
అడ్డగోలు అప్పులు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల కు కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రానికి ఇచ్చిన అప్పుల అను మతి (ఖీRదీవీ) కేవలం రూ.30,275కోట్లు మాత్రమే! దీనికి భిన్నంగా కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.69,736.83 కోట్లు అప్పులు తెచ్చింది. నిజమో కాదో ప్రభుత్వం తేల్చిచెప్పాలి. ఖీRదీవీ పరిమితి కంటే అప్పు ఎక్కువ తీసుకోవడం ఇచ్చిన పరిమితిని అధిగ మించినట్టు కాదా? అని విజయకుమార్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ డెట్‌లో భాగంగా RదీI ద్వారా చేసిన అప్పు 2024మార్చికి రూ.4, 85,490 కోట్లకు చేరుకుంటుందని RదీI తన తాజా నివేదికలో పేర్కొంది. ఆ అప్పులకు కార్పొరేషన్ అప్పు లు, డిస్కంల అప్పులు, ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండిరగ్ బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, ఉద్యోగులకి ఇవ్వా ల్సిన డీఏల వంటివన్నీ కలిపితే, మనకున్న సమాచారం మేరకు రాష్ట్ర అప్పు 11లక్షల కోట్ల చేరువలో ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఇష్టానుసారం పెంచి చూపుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని విజయకుమార్ విమర్శించారు. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్యారెంటీల్లో మన రాష్ట్రం అగ్రస్థానం లో ఉందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
సంపాదన అంతంతే
అప్పులకు తగినట్టు సంపాదన బ్రహ్మాండంగాఉందా అంటే.. అదీ లేదు. డిసెంబర్ దాకా మనకు అందు బాటులో ఉన్న లెక్కలను చూస్తే… ఈ సంవత్సరంలో, కేంద్రము ఇచ్చే పన్నులు వాటా, కేంద్రం ఇచ్చే గ్రాంటు లు… ఇత్యాదులు పక్కన పెడితే.. రాష్ట్రం తనకు తానుగా సంపాదించింది రోజుకు కేవలం రూ.264 కోట్లేనని.. అందులో రూ. 41 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా, రూ.51కోట్లు పెట్రోల్, డీజిల్ మీద సేల్స్ ట్యాక్స్ ద్వారా.. వెరసి రోజువారీ ఆదాయంలో 34 శాతం ఈ రెండు మార్గాల ద్వారానే వస్తోందని ఆయన తెలిపారు.
రోజువారీ వడ్డీ రూ. 80 కోట్లు
రూ.698కోట్ల రోజువారీ ఖర్చులో కేవలం వడ్డీ చెల్లింపులకే రోజుకి 80కోట్లు చెల్లిస్తున్నారు. ఇది కేవ లం ఆర్బీఐ ద్వారా తీసుకొన్న అప్పులకు చెల్లిస్తున్న వడ్డీ మాత్రమే. ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి చెప్పిన కార్పొ రేషన్‌ల ద్వారా తీసుకొన్న రూ.1,97,895కోట్ల అప్పుకి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారనేది ఆయనే చెప్పాలి. ప్రతి రోజూ తీసుకొనే 257 కోట్ల అప్పులో రూ.80 కోట్లు వడ్డీకే పోతుంటే, ఇక మనం పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు ఏముంటుంది?
పెట్టుబడుల మీద ఖర్చులో 15వ స్థానం..
రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు 2022-23లో 16,846 కోట్లు మాత్రమే. అంతకు ముందు సంవత్సరమూ అంతే. పెట్టుబడులలో దేశంలో ఏపీ 15వ స్థానంలో ఉంది. మనకంటే, తక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, గోవా, జమ్మూ, హిమాచల్, జార్ఖండ్ వం టివి ఉన్నాయి. ఇలాంటి స్థితిలో రాష్ట్రం ఉండటం నిజంగా సిగ్గు చేటు.
‘‘ఆదాయ సముపార్జనలో, ప్రాధాన్యత రంగాలకు న్యాయం చేయడంలో, అభివృద్ధిని పరుగులు పెట్టించ డంలో జగ్‌రెడ్డి అంచనాలు దారుణంగా దెబ్బతిని, రాష్ట్రం అన్నిరంగాల్లో చివరిస్థానంలో నిలిచింది’’ అని విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.