అమరావతి: జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్పుపై లోకేష్ స్పందిస్తూ మహనీ యులను అవమానించి రాక్షసానందం పొం దుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేసారు. నేడు విజయ నగరంలో ఉన్న మహారాజ ప్రభుత్వా సుపత్రి పేరు మార్చి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావా లను దెబ్బతీశారు. నగరం నడి బొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చింది మహారాజ కుటుంబం. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అత్యా ధునిక వసతుల తో అభివృద్ది చేసింది అశోక్ గజపతి రాజు. రాత్రికి రాత్రి మహారాజ పేరుని తొలగించ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆసుపత్రికి మహారాజ పేరు కొనసాగించా లని లోకేష్ డిమాండ్ చేశారు.