- ఉండిలో కదంతొక్కిన ఆక్వా రైతులు
- టిడిపి ఆక్వా రైతు పోరుబాటకు అపూర్వ స్పందన
- టిడిపి అధికారంలోకి వస్తే ఆక్వాకు రూ.1.50కే విద్యుత్
- రాజకీయాలకు అతీతంగా మాజీ మంత్రి కామినేని సంఫీుభావం
పశ్చిమగోదావరి : పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం. దిగజారుతున్న ఆదాయం.. వెరసి ఆక్వా రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఆక్వా రైతులు ఇప్పుడు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అసమర్ధ పాలన ఆక్వా రైతును క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేయిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక.. చేసిన అప్పులు తీర్చలేక ఆవేదన నుండి ఆవేశం పుట్టుకొచ్చింది. ఆగ్రహం పెల్లుబికింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సోమవారం నాడు ఆక్వా రైతాంగం కదం తొక్కింది. వైసీపీ అసమర్ధ పాలనపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ఉభయగోదావరి జిల్లాల ఆక్వా రైతు పోరుబాటకు రైతాంగం వెల్లువలా తరలివచ్చారు. నాణ్యమైన సీడ్ దొరకక.. ఫీడ్ ధర అందుబాటులో లేక అల్లాడుతున్న ఆక్వా రైతును వైసీపీ ప్రభుత్వం నూతన ఆక్వా పాలసీ తెచ్చి ఆంక్షలు, అడ్డగోలు నిబంధనలు, విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయడం పై తెలుగుదేశం ఆధ్వర్యాన ఉండిలోని విద్యుత్ సబ్ స్టేషనును ఆక్వా రైతులు ముట్టడిరచారు. పోలీసు ఆంక్షలను తోసిరాజంటూ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. తెలుగుదేశంపార్టీ ముఖ్య నేతలతో పాటు జోన్-2 పరిధిలోని 35అసెంబ్లీ నియోజక వర్గాల నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వైఫల్యా లను తూర్పారబట్టారు. ఆక్వా జోన్.. నాన్ ఆక్వా జోన్ అంటూ ప్రభుత్వ విభజన పాలసీని రద్దు చేయాలని, నాణ్యమైన సీడ్ అందించాలని, ఫీడ్ ధరలు తగ్గించా లని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా రైతుల నుండి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసి దేశీయంగా మార్కెటింగ్ చేయాలని, రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఛార్జీ అమలు చేయాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా బిజెపి ముఖ్య నేత.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ టిడిపి ఆక్వా రైతు పోరుబాటకు సంఫీుభావం ప్రకటించారు. ధర్నాకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భారీ సభ నిర్వహించారు.
జగన్ రెడ్డి నిర్లక్ష్యంవల్లే ఆక్వా సంక్షోభం: ప్రత్తిపాటి పుల్లారావు
టిడిపి జోన్-2 సమన్వయకర్త, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆక్వా రంగం పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరే ఈ సంక్షోభానికి కారణమని విమర్శించారు. దేశంలో 45 శాతం ఆక్వా ఎగుమతులు మన రాష్ట్రం నుండే జరుగుతున్నాయని, ఏటా 50 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆక్వా ద్వారా వస్తోందని, ఇటువంటి రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఆక్వా రంగానికి ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే అంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగ ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఆక్వా రైతాంగం క్రాప్ హాలిడే పాటించే ప్రమాదముందని పుల్లారావు హెచ్చరించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని, ఐదెకరాలు, పదెకరాల పరిమితి అని నిబంధనలు పెట్టి ఆక్వా రైతులపై విద్యుత్ చార్జీల భారం మోపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటీవల ఆక్వా రైతాంగం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారని, టిడిపి అధికారంలోకి వస్తే ఎటువంటి పరిమితులు, నిబంధనలు లేకుండా ప్రతీ ఆక్వా రైతుకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేసేందుకు లోకేష్ హామీ ఇచ్చారని పుల్లారావు చెప్పారు.ఆక్వా రైతులు పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితులలో కష్టాలు పడుతూసాగుకొనసాగిస్తు న్నారని ఆయనఆవేదన వ్యక్తంచేశారు. భారతీ సిమ్మెం ట్ ఒక రూపాయి నష్టానికి అమ్ము తావా.. మరి ఆక్వా రైతు మాత్రం తన ఉత్పత్తులను ఎందుకు నష్టానికి అమ్ముకోవాలి జగన్‌రెడ్డీ అని పుల్లారావు నిలదీశారు. కిలో రొయ్యల ఉత్పాదనకు రూ.300 వ్యయం అవు తుంటే రూ.190కు అమ్ముకోవలసి రావడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మే గిట్టుబాటు ధరకు ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు.
ఆక్వారైతులపై కక్షపూరిత చర్యలు: తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షు శ్రీనివాసరెడ్డి
తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై జగన్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వరి, మిర్చి, ప్రత్తి, ఆక్వా.. ఇలా ఏ రంగం చూసినా సంక్షో భమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా విద్యుత్ సబ్సిడీల ఎత్తివేతకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. కాకినాడ నుండి నెల్లూరు వరకూ ఏడు జిల్లాలలో పెద్ద ఎత్తున ఆక్వా సాగు జరుగుతోందని, 4.80 లక్షల ఎకరాలలో లక్షా 60 వేల మంది ఆక్వా సాగులో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ రంగం నుండి దాదాపు 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇటువంటి ఆక్వా రంగం సంక్షోభంలో పడితే.. ఆక్వా రైతు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘ఫీడ్ ధర పెరిగింది.. విద్యుత్ చార్జీలు పెరిగాయి..కానీ రొయ్య ధర మాత్రం దిగజారింది..’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోయాబీన్ ఎగుమతులను కేంద్రం ప్రోత్సహించడం వల్ల దేశీయంగా ఫీడ్ ధర పెరుగుతోందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే ఆక్వా రంగం సంక్షోభంలో పడుతోందని మర్రెడ్డి ఆరోపించారు. ఆక్వా రైతులకు మద్దతుగా డిసెంబర్ నెలలో ఏడు జిల్లాల నుండి ఆక్వా రైతాంగాన్ని సమీకరించి తెలుగురైతు ఆధ్వర్యంలో ఫిషరీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ…జగన్ రెడ్డి ప్రభుత్వానికి స్కాములు తప్ప.. స్కీములు తెలియవని ఎద్దేవా చేశారు. దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతాంగం అనేక కష్టాలు పడుతోందన్నారు. ఆక్వా రైతాంగం మాదిరిగానే ధాన్యం పండిరచే అన్నదాత కూడా అనేక కష్టాలు పడుతున్నారని ఆయన చెప్పారు. ధాన్యం రైతుల సమస్యలపై ఈ నెల18వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట కేంద్రంగా రైతుపోరుబాట చేపడుతున్నట్లు ప్రకటించారు. జోన్-2 పరిధిలోని రైతాంగమంతా మండపేట తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి నేత, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ సభకు వచ్చి ఆక్వా రైతుల సమస్యలపై టిడిపి పోరుబాటకు సంఫీుభావం ప్రకటించారు. ఆక్వా రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.
ఈ సభలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రులు మాగంటి బాబు, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, కెఎస్ జవహర్, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు ఆరుమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, అయితాబత్తుల ఆనందరావు, జయమంగళం వెంకటరమణ, చెల్లి వివేకానంద, వేటుకూరి శివరామరాజు, వనమాడి కొండబాబు, నియోజకవర్గ టిడిపి ఇంఛార్జులు పొత్తూరి రామరాజు, బొరగం శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణ, వలవల బాబ్జీ, జడ్పీ మాజీ ఛైర్మన్లు కొక్కిరిగడ్డ జయరాజ్, జ్యోతుల నవీన్, రాష్ట్ర టిడిపి కార్యదర్శులు కోళ్ళ నాగేశ్వరరావు, గుత్తుల సాయి, తెలుగురైతు నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, తెలుగురైతు నాయ కులు భూపతిరాజు తిమ్మరాజు, ఆకుల రామకృష్ణ, కుందుల వీర వెంకట సత్యనారాయణ, బొంతు శివసాంబిరెడ్జి, రుద్రరాజు సత్యనారాయణ రాజు, తమ్మినీడి నాగేశ్వరరావు, పాలా రామదాసు, వెలగల బుల్లి రామిరెడ్జి, పీతల సత్యనారాయణ, బొండారు వేణుగోపాలరావు, నల్లా భాస్కరరావు, తాళ్ళూరి సత్య శ్రీనివాస్, నెక్కలపూడి రాజు, అనపర్తి వెంకట నారాయణ, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు బోళ్ళ వెంకటరమణ, గొలకోటి దొరబాబు, డిసిసిబి మాజీ ఛైర్మన్ ముత్యాల వెంకటరత్నం, టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు పాల్గొన్నారు.