- వంచన అధ్యాయంగా మిగిలిన జగన్ పాదయాత్ర
- మరో మోసం చేయడానికి జగన్ రెడ్డి బస్సుయాత్ర
- అమలుకు నోచుకోని 85 శాతం గత హామీలు
- జిల్లాకు ఇచ్చిన 60 హామీల్లో 88% ఫెయిల్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో సాగిస్తున్న బస్సు యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో ఒక రోజు బస్సుయాత్రలో భాగంగా ఎచ్చర్ల, శ్రీకాకుళంబైపాస్, నరసన్నపేట మీదుగా .అక్కవరం వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో జగన్‌రెడ్డి బస్సుయాత్ర ముగుస్తుంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ యాత్రలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పలు అబద్దాలను వల్లెవేస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఇచ్చిన హమీలు, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం అవసరం.
విశ్వసనీయత కోల్పోయిన జగన్ రెడ్డి
2019 ఎన్నికలకు ముందు నవరత్నాలతో కూడిన తమ మేనిఫెస్టో లోను, పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజల స్థానిక అవసరాల నిమిత్తం జగన్ రెడ్డి మొత్తంగా 730 హామీలిచ్చారు. ఇందులో చెప్పిన మేరకు కేవలం 21 హామీలనే (మొత్తంలో 3శాతం) అమలు చేశారు. మరో 88 హామీలను (12శాతం) పాక్షికంగా అమలు చేశారు. మిగిలిన 621 హామీలను (85 శాతం) పూర్తిగా గాలికొదిలేశారు.
స్థానిక హామీల అమలులో 97 శాతం వైఫల్యం
గత పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 13 ఉమ్మడి జిల్లాల ప్రయోజనాల కోసం మొత్తం 480 హామీలిచ్చారు. అత్యంత దారుణంగా వీటిలో కేవలం 3 మాత్రమే (0.63 శాతం) అమలుకు నోచుకున్నాయి. మరో 9 (1.88 శాతం) పాక్షికంగా అమలుకాగా మిగిలిన 468 హామీలను (97.50 శాతం) జగన్ రెడ్డి పూర్తిగా విస్మరించి తన మాటలకు ఎటువంటి విలువ ఉండదని తానే చెప్పుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాను చిక్కుల్లో పడేశాడు
గత పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జగన్ రెడ్డి మొత్తం 60 హామీలివ్వగా అందులో గత ఐదేళ్లలో ఒక్క హామీ మాత్రమే పూర్తిగా అమలయ్యింది. మరో ఆరు హామీలు పాక్షికంగా అమలయ్యాయి. అంటే 88 శాతం హామీలు అమలుకు నోచుకోలేదు. శ్రీకాకుళం జిల్లాకు జగన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో అమలు కాని హామీల వివరాలు:
1. తీత్లీ బాధితులకు పరిహారం అందిస్తాం. 2. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాను. 3. పాలకొండ నియోజకర్గంలో తీత్లీ బాధితులను ఆదుకుంటాం. 4. రాజాంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవానాలు నిర్మిస్తాం. 5. తోటపల్లి ఎడమ కాల్వ, కుడి కాల్వ అధునీకరిస్తా 6. వంగల, రేగడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో మద్దువలస కుడి కాల్వ పనులు పూర్తిచేస్తాం. 7. సంతకవిటి మండలం బసువుల రేవు వద్ద నాగావళిపై వంతెన నిర్మిస్తా. 8, చేనేతలకు చేయూతనచ్చే మరిన్ని పథకాలు అమలు చేస్తం. 9. మద్దు వలస రెండో దశ కాలుప పూర్తి చేస్తా 10. పొందూరు ఖద్దర్‌కు అంతర్జాతీయ ప్రోత్సాహం కల్తిం. 11. చేనేత సోసైటీలకు రావాలాల్సిన 209 కోట్ల బకాయిలు చెల్లిస్తాం. 12. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న మన రాష్ట్ర మత్య్సకారులందరీన విడిపెట్టిస్తాం. 13. వంశధార ప్రాజెక్ట్, నేరడ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. 14. ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా. 15. కళింగ కోమట్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయంగా అండగా నిలుస్తాను. 16. శ్రీకాకుళంలో మరో మార్కెట్ చేసి వైశ్యులకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాను. 17. అమరావతిలో 1500 గజాల స్థలం కేటాయిస్తాం, కళింగ వైశ్య సంఘం భవనం నిర్మిస్తాం. 18. థర్మల్ పవర్ ప్లాంట్ జీవోకి 1108 రద్దు చేస్తాం. 19. శిష్టకరణాలను ఓబీసీ సర్టిఫికేట్లు ఇస్తాప్తాం. 20 కిడ్నీ బాధుతలకు రూ. 10 వేల పెన్షన్ అందిస్తం. 21.పలాస ప్రభుత్వాసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులో ఉంచుతాను. 22. అన్ని ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా సురక్షిత తాగునీరు ఇస్తాను. 23. మహేంద్రతనయ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం. 24. సుజల స్రవంతి, మహేంద్రతనయ, వంశధార ప్రాజెక్టులు పూర్తి చేస్తా 25. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తా 26. తిత్లీతో నష్టపోయిన కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, జీడితోట ఎకరాలకు రూ. 50వేలు ఇస్తాం. 27. గిరిజనులకు ఏనుగుల సమస్య పరిష్కరిస్తా. 28. నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాలు నిర్మిస్తా 29. అమరావతిలో వైశ్యులకు స్థలం కేటాయిస్తా. 30. వ్యవసాయ వర్శిటీ అభివృద్ది చేస్తాం. 31. శ్రీకాకుళంలోని రిమ్స్‌కు మెరుగైన వసతులు కల్పిస్తా, డాక్టర్లను నియమిస్తా. 32. అంబేద్కర్ యూనివర్శిటీలో సిబ్బందిని నియమిస్తా. 33. శ్రీకాకుళంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తా. 34. శ్రీకాకుళం పట్టణంలో అండర్ గ్రౌండ్ డైనేజ్ ఏర్పాటు చేస్తా. 35. శ్రీకాకుళానికి రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్ట్, ఫుడ్‌కోర్ట్ ఏర్పాటు చేస్తా. 36. నాగావళి నది కరకట్ట నిర్మాణం పూర్తి చేస్తా 37. కోడిరామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణం చేపడతా 38. ట్రిపుల్ ఐటీలో పక్కా భవనాలు నిర్మిస్తాను. 39. మార్బుల్ గ్రానైట్‌తో..రింగ్‌తో ఇల్లు కట్టించి ఇస్తా. 40. ఇళ్లకు సంబంధించిన అప్పులన్నీ చెల్లిస్తాను. 41. హుధూద్ బాధితులకు ఇల్ల కట్టించి ఇస్తాను. 42. వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారులకు నెలలో బీమా అందిస్తా. 43. నారాయణపురం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా. 44. మడ్డువలస ప్రాజెక్ట్ పూర్తి చేస్తా. 45. రాజాంలో రోడ్ల విస్తరణ చేపడతా 46. రాజాంలో శాటిలైట్ సిటి, చెరువుల పునరుద్దరణ, డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేస్తా. 47. బసవల వద్ద నాగావళిపై వంతెన నిర్మిస్తాను. 48. పాలకొండలో జంపలకోట ప్రాజెక్ట్ పూర్తి చేస్తా. 49. సీతంపేటలోని గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తా. 50. నరసన్న పేటలోని రంగసాగరం వద్ద ఎత్తిపోతలు నిర్మిస్తా 51.జలమూరు మండలం తిలారు రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మిస్తా. 52. పలాస నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరాస్తా 53. చేనేత సొసైటీల బకాయిలన్నీ చెల్లిస్తాం
ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు?
పైన పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అమలు చేయలేదు. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలను కూడా జగన్‌రెడ్డి అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ ను రద్దు చేస్తానని ముఖ్యమంత్రి అయ్యాక.. తూచ్.. పొరపాటున ఆ హామీ ఇచ్చానని నాలుక మడతేశాడు. మద్యపానాన్ని నిషేదించిన తరువాతే ప్రజలనుంచి మరలా ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి తానే పెద్ద సారా వ్యాపారిగా మారి వేలాది కోట్లు గడిరచి ప్రజల జీవితాలతో చెలగాటమాడాడు. పింఛన్లు, విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా వంటి ఇతర పథకాల్లో పలు షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించాడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారని బస్సు యాత్ర సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.