అమరావతి: దగా, మోసం, అబద్దాలు ప్రచారం చేయడం, ఆడంబరాలకు పోవడంలో కన్యాశుల్కం నాటకంలోని గిరీశంని జగన్‌రెడ్డి మించిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక చేనేతలకు ఏ ముఖ్యమంత్రి చేయనంతటి దగా జగన్ రెడ్డి చేశారని మండిపడ్డారు. బటన్ నొక్కి డబ్బు జమ చేసేస్తున్నానని చెప్పుకోవడమంటే.. తాంబూళం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లుందన్నారు. నగదు బదిలీ పేరుతో బటన్ నొక్కుతున్న జగన్‌రెడ్డి ఎంత మంది ఖాతాల్లోకి నగదు జమ అవుతుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. గతే డాది 82 వేల మంది చేనేతల ఖాతాల్లో డబ్బు వేస్తున్నానని బటన్ నొక్కితే కేవలం 69వేల మంది ఖాతాల్లోనే డబ్బు జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నట్లు వివరించారు. మరి మిగిలిన 13వేల మంది పరిస్థితి ఏంటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. చేనేతలు కార్మికులు మగ్గం మరమ్మతులు, కొత్త మగ్గాల కొనుగోలు కోసం గతంలో కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షల రుణాలిస్తే రద్దు చేశారని విమర్శించారు. పావలా వడ్డీకే రుణాలు పథకాన్ని రద్దు చేశారని, త్రిఫ్టు పథకాన్ని ఎత్తేశారని, ఆదరణ ద్వారా పరికరాల పంపిణీ నిలిపేశారని, సిల్క్ కొనుగోలుపై రాయితీ రద్దు చేశారని, చివరికి కార్మికులకు ఆరోగ్య బీమా, మరణించిన కార్మికులకు పరిహారం కూడా రద్దు చేశారని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందించే ఎన్‌హెచ్‌డీపీ పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించకుండా ఆ ప్రయోజనాలూ చేనేతలకు అందకుండా చేశారని పేర్కొ న్నారు. చివరికి స్కూల్ యూనిఫాం కొనుగోళ్లకు సంబంధించిన బైలాస్ కూడా అడ్డగోలుగా మార్చి చేనేతల నుంచి కాకుండా కార్పొరేట్స్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిపేశారన్నారు. జగన్‌రెడ్డి మాటలు వింటుంటే చిన్నప్పుడు చదివిన గిరీశం పాత్ర గుర్తుకు వస్తోందన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల్లో ఎవరు వచ్చినా చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీల ను దగా చేసిన వ్యక్తిగా జగన్ రెడ్డిని ప్రజలంతా గుర్తించుకున్నారన్నారు. జగన్‌రెడ్డి బీసీల గురించి ఎంత అరిచినా వచ్చే ఎన్నికల్లో వారే అతని తాట తీయడం ఖాయమని అనురాధ హెచ్చరించారు.