- చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు హత్యారాజకీయాలను క్షమించరు
- బ పరదాల మాటున బస్సు యాత్ర చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయా?
- బ రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు
- బ జగన్‌రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి జనమంతా సిద్ధం
కదిరి(చైతన్యరథం): వైఎస్ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద విలేకరుల సాక్షిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉన్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో గురువారం ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ… పులి వెందులలో వైఎస్ వివేకాపై వేసిన గొడ్డలి వేటు శబ్దం సమీపంలో ఉన్న కదిరికి వినిపించింది… వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా చంపారో ఆనాటి ఆక్రందనలు విన్న కదిరి ప్రజలే సాక్ష్యం అన్నారు. చిన్నాన్న అంటే తండ్రితో సమానం, బంధాలు, బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనక ఉన్న కుట్రలను ఇప్పటి వరకు నిర్ధారించలేదు. న్యాయం కోసం పోరాడుతున్న చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగు తుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? చిన్నాన్న చని పోయి ఐదేళ్లవుతున్నా మీ ప్రభుత్వం ఏం చేసింది? అధికారంలో ఉన్న మీరు చేయాల్సిన పని సరిగా చేయకపోవడం వల్లే ఆమెకు న్యాయం చేయాలని నేను మాట్లాడాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.
వివేకా హంతకులకు జగన్ రక్షణ
వివేకాను హత్య చేసిన వారికి ముఖ్యమంత్రి రక్షణ కల్పిస్తున్నారు. వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని ప్రధాన నిందితుడు చెబుతున్నారు. గతంలో మీరు సీబీఐ విచారణ కోరారు… ఇప్పుడు మీరే వద్దంటున్నారు. చిన్నాన్నను చంపిన నిందితుడికి ఓటు వేయమని అడగడం తప్పు కదన్నా అని చెల్లి మిమ్మల్ని అడుగుతోంది. నేను పోరాడేది న్యాయం కోసం, మీలాగా పదవుల కోసం కాదని సొంత చెల్లి సునీత అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి నేరాలు, ఘోరాలు చేసి వాటిని మన పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు… చైతన్యవంతమైన రాష్ట్రప్రజలు జగన్ హత్యా రాజకీయా లను క్షమించరు…వాటిపై పోరాడేందుకు మనమంతా సిద్దం కావాలి, అన్యాయానికి గురైన ఆడబిడ్డకు మన మందరం అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. చిన్నాన్నను చంపేశారంటూ మళ్లీ నంగనాచి లా మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామా మొదలెట్టాడు. బాబాయిని చంపింది ఎవరో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. జగన్‌రెడ్డి మాత్రం బాబాయిని చంపిందెవరో దేవుడికే తెలుసంటున్నాడు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్దకువెళ్లి, చిన్నాన్నను చంపిన వాడిని పక్కన పెట్టుకుని జగన్ రెడ్డి అబద్ధాలు ఆడాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మనకు కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
కదిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం
కదిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడి ప్రజలు బెంగళూరు, చెన్నైకు ఉద్యోగాల కోసం వలస వెళ్లకుండా వారు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. యువకులకు వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. వారు ఇంటి దగ్గర కూర్చుని ప్రపంచ కంపెనీలలో పనిచేసే విధంగా చేస్తాం. మండల హెడ్ క్వార్టర్‌లలో వర్క్ స్టేషన్లు పెడుతాం. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వర్చువల్ విధానం తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. కదిరిలో అసంపూర్తిగా ఉన్న ఉర్దూ, మైనార్టీ పాఠశాలను, పాలిటెక్నిక్ కళాశాలను పూర్తి చేస్తాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిజాంవలీ కాలనీ, ఫారెన్ స్కూల్ సమీప నిర్మాణాలను వాడుకలోకి తెస్తాం. కదిరిలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల పెండిరగ్ బిల్లులు చెల్లిస్తాం.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతాం. ఆధునిక వసతులతో హిందూ శ్మశానవాటిక నిర్మిస్తాం. కదిరిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం. కోల్డ్ స్టోరేజ్, టమోటా ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటును పరిశీలిస్తాం. కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ, నంబులపూలకుంట, గాండ్లపెంటలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయకూలీలకు ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసే అంశంపై కేంద్రంతో మాట్లాడుతాం.
ఉద్యోగస్తులకు మొదటితారీఖునే జీతం ఇస్తాం. జిల్లాలో మొట్టమొదటిసారిగా వడ్డెర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వడ్డెర సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాం. భవిష్యత్తులో వడ్డెర్లకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కూడా 46 రోజులు కష్టపడి దోపిడీ చేసే వైసీపీ పాలను తరిమికొట్టి మీ ద్వారా సంపద సృష్టించి పేదలకు అండగా నిలిచేది ఎన్డీఏ కూటమి. పేదవాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టే పార్టీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఎవరూ బాగుపడలేదు. ఇసుక, మద్యంలో ముడుపులు, ఖనిజ సంపద దోపిడీ, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు. ఇవన్నీ ఆలోచించి ఓటేసి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
మైనారిటీల విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దు!
మైనారిటీల విషయంలో కూటమిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ఇది రంజాన్ మాసం. దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్. ఖురాన్ పేదలకు సహాయం చేయమని చెబుతోంది. ఆ సిద్ధాంతాన్నే తెలుగుదేశం నమ్ముతోంది. ఎన్డీఏలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాలలో ఉర్దూను రెండవ అధికార భాషగా చేశాం. హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్శిటీ తీసుకొచ్చాం. హాజ్‌హౌస్ కట్టి జెడ్డాకు విమాన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మైనాటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేత నందమూరి తారక రామావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్శిటీ కట్టాం. కడప, విజయవాడలో హజ్‌హౌస్‌లు నిర్మిం చాం. మైనారిటీ విద్యార్ధులు విదేశాల్లో చదువు కునేందుకు కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాం. మైనారిటీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.176 కోట్లు ఖర్చు చేసి 33 వేల మందికి ఆర్థిక సహాయం చేశాం. రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్ పథకాలు తీసుకొచ్చాం. మైనారిటీలకు ఆర్థికసహాయం చేశాం. ఈ రాష్ట్రాన్ని కాపాడు కోవడానికే బీజేపీ, జనసేనలతో జతకట్టాం. జగన్ నాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. రూ.12 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసుండాలి. అందుకే అందరం కలిసి మీ ముందుకొచ్చాం. ఐదేళ్లుపాటు కేంద్రంలో ఎన్టీఏకు అన్ని విధాల సహకరించి ఇప్పుడు జగన్ నాటకాలాడుతు న్నాడు. తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఏనాడూ అన్యాయం జరగలేదు. ఎప్పుడో 4 శాతం రిజర్వేషన్లు పెట్టి వదిలేస్తే, 2014 నుంచి అనేకమంది లాయర్లను పెట్టి వాటిని కాపాడేందుకు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం. కదిరిలో ముస్లింలు, హిందువులు అందరూ ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీతో మా కలయిక అని చంద్రబాబు స్పష్టం చేశారు.
విచ్చలవిడిగా గంజాయి జగన్‌రెడ్డి పుణ్యమే
కదిరిలో సైతం గజాయి విచ్చలవిడిగా దొరకడం జగన్ రెడ్డి పుణ్యమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కదిరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటా. మెగా డీఎస్పీపై నా మొదటి సంతకం చేస్తా. రెండు, మూడు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తా. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉంటే 8 సార్లు డీఎస్పీ ఇచ్చి 1.50 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. ఎన్టీఆర్ మూడు సార్లు డీఎస్పీలు ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. యువత తరపున నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. మహిళల కోసం పద్మావతి యూనివర్శిటీ ఏర్పాటు తెచ్చారు. పొదుపు సంఘాలు, వంట గ్యాస్, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మరలా ఇప్పుడు మహిళలను ముందుపెట్టి వారి ద్వారా కుటుంబాలను పైకి తీసుకొస్తాం. మహిళలు చదువుకుంటే ప్రపంచాన్ని శాసిస్తారు. అన్నదాత కింద ప్రతీ రైతుకు రూ.20 వేలు ఇస్తాం. బిందు సేద్యం, సబ్సిడీలు, హర్టికల్చర్ కు ప్రోత్సాహం ఇస్తాం. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి అహంకారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడుతుంది. తాడేపల్లిప్యాలెస్ పాపాలపుట్టను త్వరలో ప్రజలు బద్దలు కొడతారని చంద్రబాబు స్పష్టం చేశారు.