- అన్నమయ్య డ్యామ్ ఘటనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
- పూంఛా ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోతే డ్యామ్ గేట్లు ఎత్తలేదు
- ఇసుక మాఫియా యంత్రాలు, లారీలను కాపాడుకోవడానికే…
- ఫలితంగా వేలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయారు
- సొంత జిల్లాలో వరద బాధితులకు చేసింది శూన్యం
- మళ్లీ బుడమేరు పనులు ఆపేసి దురాక్రమణలతో గండ్లు
- ఫలితంగా నేడు విజయవాడను ముంచెత్తిన వరద
- పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై విషప్రచారం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): నాడు సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనలో 33 మందిని బలిచేసిన పాపం సైకో జగన్‌రెడ్డిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో విమర్శించారు. అప్పటి ఘటనలో వేలాది మంది సర్వస్వం కోల్పోతే ఎటువంటి సాయం చేయలేదన్నారు. వైసీపీ నేతల ఇసుక మాఫియా యంత్రాలు, లారీలను కాపాడుకోవడానికి నాడు గేట్లు ఎత్తకపోవడంతోనే ఆ ఘటన జరిగిందన్నారు. నేడు బుడమేరు ఘటన ఇటువంటిదేనని మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన బుడమేరు పనులను జగన్ నిలిపివేయించారన్నారు. వైసీపీ నేతలు బుడమేరును దురాక్రమణ చేయడంతో నేడు గండ్లు పడి వరద విజయవాడను ముంచెత్తిందని ధ్వజమెత్తారు.
అన్యమయ్య డ్యామ్ ఘటనకు బాధ్యులెవరు?
వైఎస్సార్ కడప జిల్లాలో 2021 నవంబరు 18న రాత్రి సుమారు 11 గంటల సమయంలో పింఛా ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయి ఆ వరద అన్నమయ్య డ్యామ్‌పై పడిరది. నవంబరు 19న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయింది. ఆ వరదలో 33 మంది నిలువునా ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట, నంద లూరు మండలాల్లోని దాదాపు పది పల్లెలు మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లతో పాటు సర్వస్వం కోల్పోయారు. వేలాది ఎకరాల్లో పొలాలు ఇసుక మేటలు వేసి పంటలు కోల్పోయారు. పశువులు, గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయి జగన్‌రెడ్డి సొంత జిల్లా ప్రజలు దిక్కులేని వారయ్యారు. దీనికి బాధ్యులెవరు? పింఛా వరద అన్నమయ్య డ్యామ్‌పై పడడానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ 6 గంటల వ్యవధిలో జగన్ ప్రభు త్వం, వాలంటీర్లు గ్రామస్థులను తగు స్థాయిలో అప్రమత్తం చేయలేదు. పైగా అన్నమయ్య డ్యామ్ గేట్లు కూడా ఎత్తలేదు. నదిలో ఉన్న వైకాపా ఇసుక మాఫియా యంత్రాలు, లారీలను కాపాడుకోవడానికి గేట్లు ఎత్తలేదన్నది వాస్తవం. జగన్‌రెడ్డికి పది గ్రామాల ప్రజలు, పశుపక్షాదుల ప్రాణాలకన్నా తన ఇసుక మాఫియానే ఎక్కువైంది. దీంతో 33 మంది గ్రామస్తుల ప్రాణాలు, వందలాది పశువులు, గొర్రెలు, ఇళ్లల్లోని సర్వస్వం వరదపాలైంది.
నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం…ఈ ఘటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది
రాజంపేట రూరల్ మందపల్లె గ్రామంలోని పాలేశ్వరం దేవాలయ పూజారి గిరిప్రసాద్ కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాల నిర్వహణకు ఉదయం 5 గంటలకు 9 మంది కుటుంబ సభ్యులతో గుడికి చేరారు. ఆ దేవాలయం 60 అడుగుల ఎత్తుగల ప్రాంతంలో నిర్మించి ఉంది. హఠాత్తుగా వచ్చిన అన్నమయ్య డ్యాం వరద నీరు దేవాలయాన్ని ముంచెత్తింది. పూజారి గోపురం యొక్క శిఖరాన్ని పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. తన కళ్లముందే తన 9 మంది కుటుంబసభ్యులు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, వదిన, ఆమె కుమార్తె, ఇద్దరు పిల్లలు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపో యా డు. ఐదు రోజుల తర్వాత కుళ్లిపోయిన పూజారి కుటుంబం శవాలు బయటపడ్డాయి. ఇలా వరదలకు 33 మంది ప్రాణాలు బలయ్యాయంటే జగన్‌రెడ్డి పాపం కాదా?
అన్నమయ్య డ్యామ్ బాధితులకు మీరు చేసిందేమిటి?
అన్నమయ్య డ్యామ్ విపత్తు జరిగిన 13 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 2న జగన్ రెడ్డి బాధితుల పరామర్శకు పులపత్తూరుకు పరదాల మధ్య మొక్కుబడి పర్యటన చేశారు. కొట్టుకుపోయిన ఇళ్లకు బదులు మూడు నెలల్లో ఇళ్లు నిర్మించి మూడు నెలల్లో తాళాలు బాధితుల చేతుల్లో పెడతామని హామీ ఇచ్చారు. మూడేళ్లయినా పది శాతం అంటే 40 ఇళ్లు మాత్రమే నిర్మించారు. మిగతా వందలాది వరద బాధితులు గుడిసెలు వేసుకుని పాముల తో కాపురం చేస్తున్నారు. అప్పుచేసి బేస్‌మెంట్ వేసుకున్న బాధితులకు బిల్లులు ఇవ్వక మొండి చేయి చూపారు. ఇప్పటికీ పొలాల్లో ఇసుకమేటలు తీయలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కరెంటు సరఫరా ఇవ్వడానికి 6 నెలలకు పైగా పట్టింది. చెయ్యే రుకు కాంక్రీట్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామన్న హామీని జగన్ నెరవేర్చలేదు. మూడేళ్లయినా కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్‌ను తిరిగి నిర్మించలేదు. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. సొంత జిల్లా ప్రజలకే ఎగనామం పెట్టిన జగన్‌రెడ్డి విజయవాడ వరద సహాయక చర్యలపై నోరు పారేసుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అన్నమయ్య బాధితులను చంద్రబాబు విపత్తు జరిగిన మూడురోజుల లోనే పరామర్శించారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి నారా భువనేశ్వరి ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ.48 లక్షలు ఆర్థిక సహాయం అం దించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు చేశారు.
లక్షల కోట్లు దోచి రూ.కోటి సాయమా?
బుడమేరు వరద బాధితులకు తగుస్థాయిలో సాయం చేయడానికి జగన్‌కు చేతులు రాలేదు. లక్షల కోట్ల దోపిడీ సొమ్ము గల ఆయన కేవలం కోటి ఇస్తానని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఆయన ఆస్తితో పోలిస్తే వెయ్యో వంతు కూడా లేని కొందరు సినిమా నటులు, దాతలు జగన్ కన్నా పెద్ద మొత్తంలో బాధితులకు సహాయం చేశారు. ఆయన సహాయం చేయకపోగా బెంగళూరులో కూర్చుని కాంగ్రెస్ నాయకులతో విందులు చేసుకుంటూ నిద్రాహారాలు మాని పనిచేస్తున్న చంద్రబాబుపై బురద జల్లుతున్నారు.
పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, వేమూరిపై అబద్ధాలా?
బుడమేరు ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.220 కోట్లతో కాంట్రాక్టరుకు పనులు అప్పగించగా జగన్ ఆ పనులను నిలిపివేశారు. రూ.23 కోట్ల వరకు పనులు చేసిన కాం ట్రాక్టర్‌కు 13 కోట్లు బిల్లులు చెల్లించనందున పనులు జరగలేదు. ఆ పనులు జరిగి ఉంటే నేడు ఈ విపత్తు జరిగి ఉండేది కాదు. బుడమేరు పాపం జగన్ రెడ్డిదే. ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇంటి కోసం, వేమూరి రాధాకృష్ణ మినీ హైడల్ కోసం వెలగలేరు గేట్లు ఎత్తారని అబద్ధాలు చెబుతుతున్నారు. వెలగలేరు నుంచి వరద కృష్ణా నది లో కలిసే స్థితి లేదు. కృష్ణా నది వరద ఎగతన్నింది. బుడమేరు వరద తీసుకొనే స్థితి లేద నేది వాస్తవం. వెలగలేరు గేట్లు ఎత్తకపోతే పై గ్రామాలు, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ పూర్తిగా దెబ్బతిని పోయేవి. అన్నమయ్య డ్యామ్ లాగా మొత్తం వెలగలేరు డ్యామ్ కొట్టుకుపోయి పెద్ద ఎత్తున విజయవాడలో ప్రాణ నష్టం జరిగి ఉండేది. బుడమేరును వైసీపీ మంత్రులు, నేతలు దురాక్రమణ చేశారు. కాంట్రాక్టు పనులు నిలిపేశారు. ఈ రెండు కారణాల వల్ల విజయ వాడ సగం మునిగిపోయిందన్నది వాస్తవం.
యంత్రాంగాన్ని కదిలించిన చంద్రబాబు
చంద్రబాబు క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల్లోనే మకాం వేసి తొమ్మిది రోజుల నుంచి అక్కడే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం, కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు, సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీ ఆర్‌ఎఫ్‌లను కదిలించి ప్రాణ, ఆస్తి నష్టం తగ్గంచగలిగారు. తక్కువ సమయంలోనే బాధితు లకు ఎక్కువ భాగం సాయం అందించేలా చూశారు. 1.10 లక్షల కుటుంబాలకు నిత్యావస ర సరుకులు అందించడం రికార్డు. అలాగే 97 లక్షల మందికి భోజనాలు, 94 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ, 28 లక్షల లీటర్ల పాలు సరఫరా, 41 లక్షల బిస్కెట్స్ పాకెట్స్, 163 మెట్రిక్ టన్నుల కూరగాయలు, 2,090 ట్రిప్పుల వాటర్ ట్యాంకర్లు, ఫైరింజన్ల ద్వారా 27 వేల ఇళ్లు క్లీనింగ్ చేయడం దేశానికే ఆదర్శం. ఈ విపత్తు సేవా యజ్ఞంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు 11 మంది ఎన్డీయే మంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ డివిజన్, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు 1,700 మందితో పాటు వేల మంది కార్యకర్తలు నిద్రాహారాలు మాని పాల్గొన్నారు.
వరదల్లో సాయం చేస్తుంటే విష ప్రచారమా?
వరద ప్రాంతాలలో 77,500 వాటర్ కనెక్షన్లలో 65,353కు పైగా కనెక్షన్లు పునరు ద్ధరించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం, రెండు కిలోల బం గాళాదుంపలు, రెండు కిలోల కందిపప్పు, ఒక కిలో చక్కెర, ఒక లీటర్ పామాయిల్, బిస్కెట్లు వరద బాధితులకు అందించింది. జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు ఐదు కిలోల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, నాలుగు టమోటాలు, నాలుగు బంగాళా దుంపలు మాత్రమే బాధితులకు విదిలించింది. మానవత్వం లేని జగన్ ఆపద్బాంధ వుడైన చంద్రన్నను నిందిస్తున్నాడు. ప్రకాశం బ్యారేజీలో వరద సమయంలోనే 17 టన్నుల బరువు గల మూడు కౌంటర్ వెయిట్ బార్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయించారు. వర్షంలోనే బుడమేరుకు ఏర్పడ్డ మూడు గండ్లను పూడ్పించారు. కొండవీటి కాల్వ గుర్రపు డెక్కను తొలగించారు. వరద నష్టాన్ని అంచనా వేయించి రూ.6,800 కోట్ల కేంద్ర సాయం కోరారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేశారు. వైసీపీ జెండా రంగులు కలిగిన మూడు పెద్ద ఐరన్ పడవలను ఒకటిగా ఇనుప గొలుసులతో కట్టి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారు. దీంతో కౌంటర్ వెయిట్‌లు పగిలిపోయాయి. ఆ పెద్ద ఇనుప పడవలు గేటు దిమ్మెలను ఢీకొట్టి ఉంటే ప్రకాశం బ్యారేజ్ గల్లంతై పెను ఉపద్రవం జరిగి ఉండేది. ఈ కుట్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వైసీపీ నేతలైన నందిగం సురేష్, తలశిల రఘురాం అనుచరులవిగా ఆ పడవలు గుర్తింపబడ్డాయి.
హార్డ్‌వర్క్ చంద్రబాబు ప్రత్యేకం..జగన్‌ను నమ్ముకుంటే జైలుపాలే
ఉండవల్లి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి విజయవాడకు మకాం మార్చారని పచ్చి అబద్ధాలు చెప్పారు. నేడే కాదు హుదుహుద్ తుఫాన్ సమయంలో విశాఖలో తొమ్మిది రోజులు మకాం వేశారు. కోనసీమ తుఫాన్ సందర్భంగా రాజమండ్రిలో మకాం వేసి చంద్ర న్న బాధితులను ఆదుకున్నది నిజం కాదా? ప్రజలు ఎక్కడ ఆపదలో ఉంటే వెంటనే అక్కడ చంద్రన్న వాలిపోవడం ఆయన స్వభావం. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయిం చుకుంటూ రాజప్రసాదంలో కూర్చున్న నీరో చక్రవర్తిలాగా జగన్ తాడేపల్లి లేదా బెంగుళూ రు ప్యాలెస్‌లకు పరిమితం అవుతారు. తన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం క్షేత్రస్థాయికి వెళితే పనులకు ఆటంకం అంటూ జగన్ తప్పుడు మాటలు చెబుతు న్నారు. జగన్ క్షేత్రస్థాయిలో ఉండకుండా గాలిలో హెలికాప్టర్లలో తిరిగినప్పుడు గోదావరి వరదల్లో, అన్నమయ్య డ్యామ్ వరద సహాయ చర్యలు ఎందుకు వైఫల్యం చెందాయి? వాలంటీర్ల వల్ల అక్కడ ప్రత్యేకంగా ఒరిగిందేమిటి? నాయకుడు ముందుండి జట్టును విజయం వైపు నడిపించడం నాయకత్వం కళ. స్మార్ట్, హార్డ్‌వర్క్ చంద్రబాబు ప్రత్యేకత. అందుకే 17 మంది ఏపీ సీఎంలలో చంద్రబాబు ఒక్కరే 14 ఏళ్లు సీఎంగా ఉండగలిగారు. చంద్రబాబు నాయకత్వ విధానమే అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ మోడల్. జగన్ వద్ద నాయకత్వ పాఠాలు నేర్చుకునే వారి భవిష్యత్తు జైలుపాలే. నాయకత్వ విధానం గురించి చంద్రబాబుకు జగన్ చెప్పడమంటే ఆంజనేయుని ముందు కల్లుతాగిన కోతి కుప్పిగంతులు వేయడం కాక మరేమౌతుంది?
బోడిగుండుకు మోకాలికి ముడివేయడం కాదా?
వేమూరి రాధాకృష్ణ మినీ హైడల్ ప్రాజెక్టు వల్ల విజయవాడ విపత్తు జరిగిందని చెప్పడం బోడిగుండుకు మోకాలికి ముడివేయడం కాదా? నష్టపరిహారం ఇచ్చి మినీ హైడల్‌ను తీసు కోవచ్చని రాధాకృష్ణ కోర్టుకు వెళ్లారు. జగన్ నిజంగా విజయవాడను ఉద్ధరించదలచుకుంటే చట్టప్రకారం నష్టపరిహారమిచ్చి మినీ హైడల్‌ను తీసుకుని బుడమేరు ఆధునికీకరణ పనులు ఎందుకు పూర్తిచేయలేదు? ఐదేళ్ల తన అరాచక పాలనలో దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడాని కి చంద్రబాబు, వేమూరి రాధాకృష్ణపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను వంచించే పనికి తెగబడ్డారు. అవినీతి, అబద్ధాలు, నేరాలు, కుట్రలు, విద్వేష రాజకీయులు ఎల్లకాలం సాగవని, ప్రజలు ఎక్కువ కాలం మోసపోరని జగన్ తెలుసుకుని తన తీరు మార్చుకోకుంటే రాష్ట్ర ప్రగతి రథచక్రాల కింద పడి నలిగిపోక తప్పదు.