- బైబై జగన్ ఇక జైలుకే..
- సంక్షేమం అంటేనే తెలుగుదేశం
- అధికారంలోకి వచ్చేది మనమే
- ఉక్కు మన హక్కు.. ఎక్కడికీ పోదు
- సూపర్ సిక్స్‌ని జనంలోకి తీసుకెళ్లండి
- ప్రగతిశీల భవిష్యత్‌కు నేను పూచీ
- నరసన్నపేట శంఖారావంలో లోకేష్
నరసన్నపేట (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తాగేది జనం రక్తం. మద్యాన్ని నిషేధించి ఓట్లడు గుతానన్న జగన్, అదే మద్యంతో వందలాది ప్రాణాలు తీశాడు. ప్రజారోగ్యాన్ని ఛిద్రం చేశాడు. క్వార్టర్‌పై 25 రూపాయలు జే-ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. నాసి రకం మద్యంతో ఏటా 9వేలకోట్లు చొప్పున ఐదేళ్లలో 45వేల కోట్లు మింగేశాడు. మద్యం తయారు చేసేదీ జగనే. అమ్మేది జగన్‌రెడ్డేనని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. జగన్‌రెడ్డిని చూస్తే కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని, బ్లూ బటన్ నొక్కి రూ.10అకౌంట్లలో వేసే జగన్.. అదే చేత్తో రెడ్ బటన్ నొక్కి వంద రూపాయలు లాగేస్తున్నా డని దుయ్యబట్టారు. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎండ గట్టేందుకు ‘శంఖారావానికి’ శ్రీకారం చుట్టిన లోకేష్, సోమవారం నరసన్నపేట సభలో అశేష జనాన్ని ఉద్దే శించి మాట్లాడారు. ‘ఎత్తిన జెండా దించకుండా కాపు కాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు..’ అంటూ మొదలైన లోకేష్ ప్రసంగం..వచ్చేఎన్నికల్లో పార్టీ శ్రేణు లు అనుసరించాల్సిన దిశ, దశను నిర్దేశించేదిగా సాగింది. ‘ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. గర్జించే ఈ సింహాలు.. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగులకొట్ట డయం ఖాయం’ అంటూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపర్చారు.
బైబై జగన్ జైలుకే..
గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్య దేవాలయం ఉన్న భూమి. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టం అంటూ వినమ్రంగా నమస్కరిచి, ‘జగన్ రెడ్డి పనైపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 25 మందికి 25మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తెస్తా మన్నారు.వైసీపీకి 31మంది ఎంపీలనిస్తే, కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచడం తప్ప ఏం చేశారు?’ యువనేత నిలదీశారు. జగన్‌రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్ ఢల్లీి వెళ్తే 31 మందిలో ఆరుగురే వెంటున్నారు. వారూ బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక్క సొంత పార్టీ నేతలే కాదు, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రా మిక, ప్రజావర్గాలు.. ఇలా అన్ని వర్గాలూ ‘బైబై జగన్’ అంటున్నారని జగన్ పాలనను దుమ్మెత్తి పోశారు. వారంరోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తానని చెప్పిన జగన్, ఉద్యోగులను మాయచేసే జీపీఎస్ తేవడంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయన్నారు. రాజకీయా ల్లో జగన్ కొత్త పథకం తెచ్చాడని, ఆ పథకమే ఎమ్మె ల్యేల ట్రాన్స్‌ఫర్ అన్నారు. ఒకరింట్లో చెత్త ఇంకోచోట బంగారమవుతుందా? ఇక్కడ పనికి రాని ప్రజాప్రతినిధి పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తాడు. ప్రజాప్రతి నిధుల ట్రాన్స్‌ఫర్‌కు సిద్ధమైన పడే జగన్ ఓటమి ఒప్పు కున్నాడని లోకేష్ వ్యాఖ్యానించారు. బాబాయ్‌ని చంపిం దెవరు? పిన్ని తాళిబొట్టు తెంపిందెవరు? అని ప్రశ్ని స్తూ.. ఇదీ జగనాసుర రక్తచరిత్ర అంటూ దునుమా డారు. ఎన్నికలకు ముందు హత్యా మకిలి చంద్రబాబు కు అంటించే ప్రచారం చేశారని, చార్జిషీటులో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరు వచ్చింది, రేపోమాపో జగన్ పేరూ లిస్ట్ కెక్కుతుందన్నారు. జగన్ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపారని, రేపో మాపో జగన్‌రెడ్డీ జైలుకెళ్తారన్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఉక్కు.. ఎక్కడికీ పోదు
ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్‌రెడ్డి అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఫల్యాలను ఎండగడుతూ, రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం చేసిం దీ వివరించారు. 3రాజధానుల పేరిట విశాఖను నాశ నం చేశాడు. రూ.500కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. రైల్వే జోన్‌కు భూమి కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకున్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రమాదంలో పడటానికి జగన్ రెడ్డే ముఖ్య కారకుడు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చారు. వారు ఈ ప్రాంతంమీద పడి పంది కొక్కుల్లా దోచుకుతింటు న్నారు. రామతీర్థంలో శ్రీరాముడి తల తీసేస్తే ఇంత వరకు కారకులపై చర్యలు లేవు. పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి ఒక్కటీ పూర్తిచేయలేదు. వంశ ధార, తోటపల్లి, నాగావళి ప్రాజెక్టుల పెండిరగ్ పనులు ఎక్కడవిఅక్కడే ఉన్నాయి.మూతబడిన చక్కెర కర్మాగారా లను తెరిపిస్తామని చెప్పి ఆఊసే ఎత్తడం లేదు. రాష్ట్రా న్ని అన్ని విధాలా నాశనంచేసి, ప్రగతి విధ్వంస కుడిగా జగన్ పేరు తెచ్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రుల జన్మ హక్కైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీయమని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని లోకేష్ భరోసానిచ్చారు. నరసన్నపేట నియో జకవర్గాన్ని రూ.1200కోట్లుతో అభివృద్ధి చేశామని, ఉద్దానం కిడ్నీ పేషంట్లకు డయాలసిస్ ఏర్పాటుచేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుచేశారు.అన్ని గ్రామా ల్లో తాగునీరు అందించేందుకు తెలుగుదేశం కృశ్రీం చేసిందని, మేం పనులు ప్రారంభిస్తే వాటిని నిలిపి వేసిన దద్దమ్మ ప్రభుత్వం జగన్‌రెడ్డిదని దుయ్యబట్టారు. మన హయాంలో సీసీ రోడ్లు,బీటీ రోడ్లు వేశాం. 2019 లో ఒక్క అవకాశం పేరుతో వచ్చి నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన కృష్ణదాస్‌ని భారీ మెజార్టీతో గెలిపిస్తే `నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా? అని నిలదీశారు. ఆయన పేరులో ధర్మాన ఉందిగానీ.. చేసే పనులన్నీ అధర్మమే నని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరే టర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారని, సొంత పార్టీ కార్యకర్తలపైనే తిరిగి కేసులు పెట్టడం చూస్తుంటే.. జగన్ దుర్మార్గపు పోకడలు అర్థం చేసుకో వచ్చన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేయా లనే ఆలోచన తప్ప ఏనాడూ నియోజకవర్గం గురించి వైసీపీ ఆలోచించిన పాపాన పోలేదన్నారు.
సంక్షేమం అంటేనే తెలుగుదేశం
కరెంట్ ఛార్జీలు,చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారని, అవకాశమిస్తే ప్రజ లు పీల్చే గాలిపైనా పన్ను వేయగల దుర్మార్గుడు జగన్‌రెడ్డి అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వైసీపీ ప్రజలను పీడిరచిందని, అన్న క్యాంటీ న్లు, డ్రిప్ ఇరిగేషన్, చంద్రన్న బీమా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం వినా.. తన హయాంలో జగన్‌రెడ్డి చేసిందేమీ లేదని యువనేత విరుచుకుపడ్డారు.
ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తిఅన్న ఎన్టీఆర్. ఆనాడు కిలో రూ.2కే బియ్యం ఇచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణం కట్టుకున్న చంద్రబాబు దీపం కనెక్షన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశా రని లోకేష్ గుర్తు చేశారు.తప్పుడు మార్గాలను ఎంచు కుంటున్న జగన్` తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు నిలిపేస్తుందని వాలంటీర్ వ్యవస్థతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, కార్య కర్తలంతా ఏకోన్ముఖులై తెలుగుదేశం వస్తేను రాష్ట్రా నికి సంక్షేమం, సుభిక్షం అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మార్గ దర్శనం చేశారు. అందుకు గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని, వారికంటే మెరు గైన సంక్షేమం అందిస్తా మని బలంగా ప్రచారం చేయాలని సూచించారు.
అధికారంలోకి వచ్చేది మనమే..
3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు, నాడి తెలుసుకున్న అనుభవంతో చెప్తున్నా. ఎటువంటి ఢోకా లేదు. అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని లోకేష్ బలంగా ఉద్ఘాటిం చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తూ.. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యో గాలిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగు లకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేశారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం గా ప్రయాణసౌకర్యం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అంశాలను బలంగా ప్రజల్లోక తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.