- ప్రతిఏటా జాబ్ క్యాలండర్ హామీ ఏమైంది?
- 2.30లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీచేస్తారు?
- జాబ్ లెస్ క్యాలెండర్ తో మడమ తిప్పలేదా?
- ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి ` అమరావతి)
అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మాటతప్పి మడమతిప్పారు. అధికారంలోకి వచ్చాక జాబ్‌లెస్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశా రు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్లకు 10,143 ఉద్యోగా లంతో ఒకేఒక జాబ్ లెస్ క్యాలండర్‌ను విడుదల చేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. 1994 – 2004 మధ్య మరియు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7డిస్సీలు నిర్వహిం చి మొత్తం లక్షా 70వేల నియామకాలు భర్తీ చేయడ మైనది. ఇందులో రిజర్వేషన్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ యువత భారీగా ఉద్యోగాలు పొందారు. కానీ ప్రతి ఏటా మెగాడీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి మూడున్నరేళ్లయినా జగన్‌రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. 50 వేలకు పైగా ఉఫాద్యాయ పోస్టులు ఖాళీలున్నాయి.డీఎస్సీ నిర్వహించక పోవటం అంటే సామాజిక న్యాయాన్ని మంట గలపడమే.
ప్రతి ఏటా పోలీసుశాఖలో 6వేల ఉద్యోగాలిస్తానన్న జగన్‌రెడ్డి ఆ శాఖలో సుమారు 20వేలకు పైగా ఖాళీలున్నా కనీసం ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీచేయలేదు. తమ అస్మదీయులను అందలం ఎక్కిం చటం కోసం గ్రూప్-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెర తీశారు. కొన్నేళ్ల నుంచి ప్రశ్నల వారీగా శాస్త్రీయ పద్ధతిలో మూల్యాంకనం జరుగుతోంది, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నాపత్రాల వారీగా అది కూడా డిజిటల్ మూల్యాంకనం చేయాలని గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం తీసుకున్నారు. మూల్యాకనంలో తప్పు జరగకపోతే మూల్యాకనం పేపర్లు అభ్యర్ధులు ఇవ్వమంటే ఎందుకివ్వలేదు? గ్రూప్-1లో అర్హతసాధించని ఆరుగురు అభ్యర్ధులు సివిల్స్‌లో దేశంలోనే టాప్‌ర్యాంకులు కొట్టారంటే.. జగన్ రెడ్డి అవినీతి బట్టబయలవుతోంది. సివిల్స్‌లో ఎంపికపైన ప్రతిభావంతులు ఏపీపీఎస్సీకి ఎలా అనర్హులయ్యారు?
టీడీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల ఉద్యోగాలు
టీడీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
నిరుద్యోగ భృతి
చంద్రన్న ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రద్దు చేసింది.
డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం
రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ విజయవాడకు తరలిస్తూ గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టు బడ్డాయి. దీని మూలాలు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దగ్గర తేలాయి. గంజా యి వ్యాపారంలో కింగ్ పిన్ గా అనంతబాబుకు జగన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇచ్చి గంజాయి వ్యాపారాన్ని ప్రోత్స హించారు. రూ.10 వేల కోట్ల గంజాయి వ్యాపారం జరుగుతోంది. గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడ్డా దాని మూలాలు ఏపీలోనే పట్టుబడుతున్నాయి.
మద్యం మాఫియాగా మారి రూ.25వేలకోట్ల దోపి డి చేస్తున్నారు. మద్యం, గంజాయి, హెరాయిన్ యథే చ్చగా సరఫరా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నా రు. సిఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎంప్లాయ్‌మెంట్) రిపోర్టు ప్రకారం ఏపీలో నిరుద్యోగ రేటు ఇలా ఉంది.
టీడీపీ పాలనలో..
2019 జూన్ నాటికి 3.3%
వైసీపీ పాలనలో..
2019 జూన్ నాటికి 3.3%
2022 ఆగస్టు నాటికి 6.0%
టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 17.9% ఉండగా, టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల నిరుద్యోగ శాతం 3.3%కి తగ్గింది.జగన్‌రెడ్డి అనుసరించిన విధానం వల్ల నిరుద్యోగ శాతం 3.3% నుండి 2020 ఆగస్టు నాటికి 6%కి పెరిగింది.
అమరావతిపై దాడి – కోల్పోయిన ఉద్యోగాలు
ప్రభుత్వ అసంబద్ధమైన విధానాల కారణంగా అమరావతిలో నెలకొల్పాలని భావించిన 2లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యా పార, విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవ డంతో 60వేల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అమరావతి సింగపూర్ అంకుర పరిశ్రమల ప్రాజెక్టు నిర్మాణం అయ్యి ఉంటే రెండున్నర లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 10లక్షల మందికి పరోక్ష ఉపాధి లభి ంచి ఉండేది. ఈ ప్రాజెక్టును జగన్‌రెడ్డి రద్దు చేశారు. చంద్రబాబునాయుడు సైబరాబాద్ నిర్మించడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల 13 లక్షల యువతకు ఉపాధి కల్పించారు. జగన్‌రెడ్డి కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగపోగా కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్‌ను నాశనం చేశారు.
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం – జగన్
కేంద్రం మొడలు వంచి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తానన్నాడు. అధికారంలోకి వచ్చి మొడలు వంచి కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. ఉన్న 31మంది ఎంపీలు రాజీనా మా చేస్తే ప్రత్యేక హోదా రాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా షరతు పెట్టకుండా ఎందుకు మద్ద తిచ్చారు?
సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు – స్వయం ఉపాధిపై గొడ్డలి వేటు
రూ. 34,685 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి స్వయం ఉఫాధిని నాశనం చేశారు.
బిసిల సబ్ ప్లాన్ నిధులు రూ.26,000 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.6,324 కోట్లు
ఎస్టీల నిధులు రూ. 878 కోట్లు
మైనారిటీల నిధులు రూ.1,483 కోట్లు
మొత్తం రూ.34,685 కోట్లు
సబ్ ప్లాన్ ద్వారా టీడీపీ కల్పించిన స్వయం ఉపాధి
కార్పొరేషన్ల సబ్సిడీ, బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి
ఎస్సీ 90,000 మందికి
బీసీ 70,900 మందికి
కాపు 42,000 మందికి
మైనారిటీ 13,022 మందికి
బ్రాహ్మణ 11,107 మందికి
వాస్తవాలను మరుగున పెట్టి చైతన్యవంతులైన నిరుద్యోగ యువతను ఎంతోకాలం మోసం చేయ లేరు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధిఉంటే రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 2.3లక్షల ప్రభుత్వో ద్యోగాలను తక్ష ణమే భర్తీచేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారిం చాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.