- విద్యార్థులకు మేలు చేస్తున్నానంటూ మోసం
- జగన్ నిర్వాకంతో సర్టిఫికెట్లు అందక 2 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులు
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 7 లక్షల మందికి కోత
- ట్యాబ్‌లు, విద్యాకానుక, నాడు-నేడు పేరుతో రూ. 5 వేల కోట్ల లూటీ
- ధ్వజమెత్తిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (చైతన్యరథం): ఒక పక్క విద్యావ్యవస్థని సర్వనాశనం చేస్తూ, మరోపక్క విద్యాదీవెన పేరుతో విద్యార్థుల్ని అబద్ధాలతో నమ్మించేందుకు జగన్‌రెడ్డి ప్రయత్నిన్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సబ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మహామహుల పాలనలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్ర విద్యా రంగం.. జగన్ అధికారంలోకి వచ్చాక నామ రూపాలు లేకుండా పోయిందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడి హయాంలో ఏటా 16లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సాయం అందించామన్నారు. కానీ నేడు జగన్‌రెడ్డి ఆ సంఖ్యను 9లక్షలకే పరిమితం చేసి, 7 లక్షల మంది దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నతవిద్యకు దూరం చేశాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమల్లో జగన్ తలాతోక లేని నిబంధనలు పెట్టి, ఇతర పథకాలకు దాన్ని అనుసంధానించడం వల్లే 7లక్షల మంది విద్యార్ధు లు ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయాన్ని కోల్పోయారు. టీడీపీ ప్రభుత్వంలో పదో తరగతి ఉత్తర్ణతా శాతం 92.09 శాతముంటే, నేడు జగన్‌రెడ్డి పాలనలో అది కేవలం 66.76కు పడిపోయింది. జగన్ రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర విద్యారంగం అధోగతి పాలైందనడా నికి తగ్గిన ఈ ఉత్తీర్ణతా శాతమే నిదర్శనం. నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలల విలీనానికి పాల్పడిన జగన్‌రెడ్డి… దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 7.50 లక్షల మంది దళిత, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల్ని విద్యకు దూరం చేశాడని కొల్లు విమర్శించారు.
రూ.3,400కోట్లు ఎగనామం…
జగన్‌రెడ్డి 57 నెలల పాలనలో రూ.3,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఎగ నామం పెట్టాడు. దానిలో విద్యాదీవెన సొమ్ము రూ.2,700 కోట్లు అయితే, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము రూ.450కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విద్యాదీవెన పథకానికి చెల్లించాల్సిన సొమ్ములో జగన్‌రెడ్డి రూ.120కోట్లు కోతపెట్టాడు. జగన్ నిర్వాకంతో రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు ఆపేసిన విద్యాసంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి గాను, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపి స్తూ జగన్ సర్కార్ జీవో – 77 ఇవ్వడం వాస్తవం కాదా? జగన్ నిర్వాకంతో 1.07 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమైంది నిజం కాదా? చంద్రబాబు గతంలో విదేశీ విద్య పథకం అమలుచేసి, 4,923 మంది పేద విద్యార్థుల్ని విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపారు. జగన్‌రెడ్డి చచ్చీచెడి.. చివరకు 116 మందికి మాత్రమే విదేశీవిద్య పథకం అమలు చేశాడు. జగన్ హయాంలో విద్యాసంస్థల్లో సరైన వసతులు, నిపుణలైన బోధనా సిబ్బంది లేమితో విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించలేకపోతున్నారన్నది వాస్తవం. లక్ష నుంచి రూ.1.50 లక్షల ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రతి విద్యార్థికి ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి చివరకు విద్యాదీవెన అమల్లో మాటతప్పి మడమతిప్పాడు. మేనిఫెస్టోలో చెప్పిన సంఖ్యలో సగంమంది విద్యార్థులకు కూడా ఆర్థికసాయం అం దించని జగన్, సిగ్గులేకుండా విద్యాదీవెనతో ఉద్ధరించా నని చెప్పుకుంటున్నాడు. విద్యాదీవెన సొమ్ముకి, లబ్ధి దారులకు ఏటా ఎందుకు కోతలు పెడుతున్నాడో ముఖ్య మంత్రి విద్యార్థులకు సమాధానం చెప్పాలి. విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టి, రూ.100కోట్లు ప్రకటనల రూపంలో ముఖ్యమంత్రి సాక్షి మీడియాకు దోచిపెట్టాడు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల్ని కబళించాలని చూసిన జగన్‌రెడ్డి, నాడు-నేడు పేరుతో రాష్ట్ర విద్యారంగాన్ని నాశనం చేశాడు. గురువులు, విద్యార్థుల్ని తన చేతగాని పాలనతో రోడ్డున పడేసిన విద్యాద్రోహి జగన్‌రెడ్డికి విద్యారంగం పేరెత్తే అర్హత కూడా లేదని కొల్లు దుయ్యబట్టారు.
రూ.5వేల కోట్లు దోచేశాడు…
విద్యార్థులకు ట్యాబ్ లు పంచే నెపంతో రూ.1200 కోట్లు, విద్యాకానుక పేరుతో రూ.400కోట్లు, నాడు-నేడు పథకం ముసుగులో రూ.3,000 కోట్లు వెరసి దాదాపు రూ.5,000 కోట్లను విద్యార్థులకు ఇవ్వకుండా ముఖ్యమంత్రే దోచేశాడు. పాఠశాల భవనాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాలన్న జగన్ నిర్ణయాన్ని న్యాయ స్థానాలు తప్పుపట్టాయి. సీపీఎస్ రద్దు పేరుతో ఉపాధ్యాయుల్ని వంచించిన జగన్‌రెడ్డి.. వారు నోరెత్త కూడదని వారికి పనిభారం పెంచి, వారి విషయంలో నిర్దాక్షణ్యంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2 డీఎస్సీలు నిర్వహించి, 18వేల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది. తన హయాంలో జగన్ రెడ్డి ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా దాదాపు 2.50లక్షల మంది దళిత, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు చంద్రబాబు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఆ పథకాన్నే రద్దు చేశాడు. రాష్ట్రంలో 84లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 44లక్షల మందికే జగన్ రెడ్డి కోతలతో కూడిన అమ్మఒడి పథకం అమలు చేస్తు న్నది నిజం కాదా? విశ్వవిద్యాలయాల్లో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 1300 నియామకాలు చేపడితే, జగన్‌రెడ్డి తనపార్టీ వారితో విశ్వవిద్యాలయాల్ని రాజ కీయ పునరావాస కేంద్రాలుగా మార్చాడు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేశంలో 3వ స్థానంలో నిలిచిన రాష్ట్ర విద్యారంగం.. జగన్ పాల నలో 19వ స్థానానికి దిగజారింది. ఫీజు రీయింబర్స్ మెంట్, నాడు-నేడు, విద్యాదీవెన, అమ్మఒడి, పాఠశాల ల విలీనం పేరుతో విద్యారంగాన్ని కూడా జగన్ రెడ్డి తన దోపిడీకి కేంద్రబిందువుగా మార్చుకున్నాడని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.