న ఉసురు తీస్తున్న రాక్షస పాలన
న వైసీపీకి మూడిరది.. భూస్థాపితమే
న జగన్‌కు చెప్పుకోడానికి ఏమీ లేదు
న చంద్రబాబు నామ జపం తప్ప..
న విధ్వంస పాలనకు ఇక చరమగీతం
న విశాఖ శంఖారావంలో లోకేష్ ఫైర్
న ఆర్థిక రాజధాని విశాఖను కాపాడుదాం
న ప్రజల్లోకి సూపర్ `6 వెళ్లాలని పిలుపు
శ్రీ ఉసురు తీస్తున్న రాక్షస పాలన
శ్రీ వైసీపీకి మూడిరది.. భూస్థాపితమే
శ్రీ జగన్‌కు చెప్పుకోడానికి ఏమీ లేదు
శ్రీ చంద్రబాబు నామ జపం తప్ప..
శ్రీ విధ్వంస పాలనకు ఇక చరమగీతం
శ్రీ విశాఖ శంఖారావంలో లోకేష్ ఫైర్
శ్రీ ఆర్థిక రాజధాని విశాఖను కాపాడుదాం
శ్రీ ప్రజల్లోకి సూపర్ `6 వెళ్లాలని పిలుపు
విశాఖపట్నం (చైతన్యరథం): జగన్ విధ్వంస పాలనలో అణగారిన వర్గాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శంఖారావం’ యాత్రలో భాగంగా సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడుతూ జగన్ చేతకాని పాలనను దుమ్మెత్తిపోశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. రైతు, యువకుల ఆత్మహత్యలకు మాత్రమే ఫ్యాన్ ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, గ్రూప్-1,2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి జగన్ మోసం చేశాడు. 6500 కానిస్టేబుల్ భర్తీ చేస్తామన్నాడు. ఆశతో యువకులు లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కోచింగ్ కోసం 2 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఓ తల్లి చెప్పింది. ఇవన్నీ మోసం అని తెలుసుకుని `నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. నాడు వెయ్యి రూపాయలున్న ట్రాక్టర్ ఇసుక నేడు 5వేలకు చేరింది. ఎవరికీ పనులు దొరకని పరిస్థితి. చేనేత కార్మికులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోతున్నారు. ఇన్ని వర్గాల ఆత్మహత్యలకు మాత్రమే ఫ్యాన్ ఉపయోగపడుతుంది. జగన్ ఐదేళ్ల పాలనలో 35 వేలమంది ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. అందుకే `వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలోకి విసిరికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభకు వెళితే చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. జగన్ మాత్రం చంద్రబాబు పేరు జపం చేస్తున్నారు. గంట ప్రసంగంలో 100 సార్లు బాబు నామ జపం తప్ప, చెప్పుకోడానికి ఏం చేశాడని నిలదీశారు.
సైకిల్, గ్లాస్ గురించి జగన్ మాట్లాడటాన్ని పరోక్షం గా ప్రస్తావిస్తూ, ఆ రెండిరటి విలువ పెత్తందారుకు అర్థంగాదని ఎద్దేవా చేశారు. సామాన్యుడి చైతన్య రథం సైకిల్ అని, సామాన్యుడు టీ తాగితే గ్లాసులోనేనని గుర్తు చేస్తూ, జగన్ బంగారు, వెండి గ్లాస్‌లో టీ తాగు తారేమో. అలాంటి వ్యక్తులకు సామాన్యుడి కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నిస్తూ, అలాంటి పెత్తందారు ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేద్దామని పిలుపునిచ్చారు. గత 9 రోజులుగా ఉత్తరాంధ్ర ‘శంఖారావం’ ఊపు అదిరిపోయిందని అంటూనే, ఇక్కడి జీవితాలతో జగన్ ఆడుకున్నాడు. రెండు నెలల్లో ప్రజలు జగన్‌ను ఫుట్ బాల్ ఆడుకోడానికి సిద్దంగా ఉన్నారనడంతో `సభికు లు పెద్దపెట్టున హర్షద్వానాలు ప్రకటించారు. దేశానికే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ, ఏపీ ఆర్థిక రాజధాని కూడా విశాఖ. అలాంటి విశాఖను చంద్రబాబు హయాంలో జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే, జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విశాఖలోనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరు సహా రాష్ట్రాన్ని గంజాయి మాఫియాకు అడ్డా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నాడని, రెండు నెలలు ఓపిక పడితే అలాంటి వాళ్లపై ఉక్కుపాదం మోపి గంజాయిని శాశ్వతంగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్, విధ్వంసం, మర్డర్,భూ కుంభకోణం బయటికొస్తుందని అంటూనే, సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే పరిస్థితికి అర్థంచేసుకోవచ్చన్నారు. భూ కుంభకోణాలకు సహకరించలేదని వైకాపా నాయకులు ఎమ్మార్వో రమణయ్యను హత్య చేశారని ఆరోపించారు.
జగన్ పదేపదే సిద్ధం అంటున్నారు. నిన్న రాప్తాడు కు వెళితే వైకాపా నాయకులు, కార్యకర్తలేమో సిద్ధంగా లేమని చెబుతున్నారు. సభ తుస్సుముంది. ప్రజలు వెళ్లిపోతున్నారని అక్కడున్న మీడియా మిత్రుడు ఫోటో లు తీస్తుంటే ఉక్రోషంతో వైకాపా రౌడీలు చితక బాదారు. వైసీపీ ఎంత ఫ్రస్ట్రేషన్‌తో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 3,132 కి.మీ పాదయాత్ర చేసి, చంద్రబాబు చేసిన అభివృద్ధిపై సెల్ఫీలు దిగాను. ఆనాడే జగన్‌కు ఛాలెంజ్ చేశా. సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని. అవతల నుంచి సౌండ్ లేదని ఎద్దేవా చేశారు. రాప్తాడులో జగన్ సభ మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. మండుటెండలో జగన్ వాళ్ల కార్యకర్తలను సెల్‌లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ల కార్యకర్తలు ఒకళ్ల మొహం ఒకరు చూసుకున్నారు. జగన్‌కు రేచీకటి ఉందా? చిప్ దొబ్బిందా? అని నవ్వుకున్నారు. స్క్రిప్ట్ ఎవరో రాస్తే.. అది మధ్యాహ్నమని కూడా ఆలోచన లేకుండా ఉన్నదున్నట్టు చెప్పడాన్ని చూస్తే జగన్ ఎంత అవివేకవంతుడో అర్థమవుతుందని లోకేష్ ఎద్దేవా చేశారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశాడని దుయ్యబట్టారు. జలయజ్ఞం పేరిట తట్టమట్టి కూడా వేయలేదని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓట్లు అడుగుతానన్నారు. ఇప్పుడు బూమ్ బూమ్ దుకాణాలు పెట్టి మద్యం ఏరులై పారిస్తూనే జగన్ ఓట్లడగడానికి వస్తున్నాడని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తాగి లక్షలాదిగా చనిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి మరీ మందు విక్రయిస్తున్నారు. వెయ్యిపైన అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పెండిరగ్ బకాయిలు పెట్టి నాశనం చేశారు. ఇవన్నీ జగన్ దుర్మార్గపై పాలనా వైఫల్యాలేనని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని మాట తప్పాడు. పేదలకు 30 లక్షల ఇళ్లు కడతామని, 3వేలు కూడా కట్టలేకపోయాడు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని మోసం చేశాడు. ఆసరా, చేయూత పేరుతో పదిచ్చి వంద లాక్కునే రకం జగన్ అని దుయ్యబట్టారు. అటు ఆటోడ్రైవర్లను, ఇటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యార్థులనూ మోసం చేసిన జగన్ ` నవరత్నాలపై చర్చకు సిద్ధమా అని లోకేష్ ప్రశ్నించారు. వై నాట్ 175 అని సీఎం గావుకేకలు పెడుతున్నాడని, నేను వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటున్నా. వీటికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాదుడే బాదుడుతో రాష్ట్ర జనాన్ని పీల్చిపిప్పిచేస్తున్న జగన్ `రేపు పీల్చే గాలిపైనా పన్నువేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని లోకేష్ ఎద్దేవా చేశారు. నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుందని, టీడీపీ వస్తే సంక్షేమాన్ని ఎత్తేస్తారని వాలంటీర్లు వచ్చి చెబితే నమ్మవద్దన్నారు. అసలు ఏపీకి సంక్షేమం పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని వారికి చెప్పాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి జగన్ కటింగ్ మాస్టర్ అవతారమెత్తాడని దుయ్యబట్టారు. జనం పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారని, వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ పిలుపునిచ్చారు. మొదట హామీ ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తాం. పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రానివారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు చొప్పున తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం. ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు.