- 2021లో ‘నా వెంట్రుక కూడా పీకలేరన్న’ వ్యక్తి, ఇప్పుడు సంతోషంగా దిగిపోతాను అంటున్నాడు
- ప్రజల్లో వ్యతిరేతం ఉన్నందునే అప్రజాస్వామిక విధానాలు నమ్ముకున్నాడు
- జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఆయన్ని తరిమికొట్టడం ఖాయం
- బాబాయ్‌ను తనకు పోటీగా పెట్టారంటున్న జగన్ రెడ్డి… అదే బాబాయ్‌కి గొడ్డలిపోటు వేసింది నిజం కాదా?
- ప్రజల మనసుల్లో ఉన్నదే షర్మిల చెబుతున్నారు
- జగన్ తప్ప ఆ కుటుంబంలో ఎవరూ ఎదగకూడదా?
- జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకి లేదు.
అమరావతి: జగన్‌రెడ్డి స్వరం మారు తోందని, గతంలో ఉన్న ధైర్యం, నమ్మకం పూర్తిగా సన్నగిల్లినట్టు తాజాగా ఆయన మాటల్ని బట్టి తెలుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. 2021లో ఎవరినీ లెక్కచేయకుండా అహంకారంతో విర్రవీగిన ముఖ్యమంత్రి, ఒకానొక సంద ర్భంలో ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అన్న విషయం ప్రజలు గుర్తించాలని, అదే వ్యక్తి ఇప్పుడు పీకేసినా పర్వాలేదు అంటు న్నాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021 లో ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అన్న వ్యక్తే, 2022లో నన్ను నమ్మండి అని ప్రజ ల్ని వేడుకునే పరిస్థితికి వచ్చాడు.. 2023 వచ్చేసరికి మరింత దిగజారి ‘మిమ్మల్నే నమ్ముకున్నాను’ అనే దీనావస్థకు వచ్చాడు.. ఇప్పుడు ఏకంగా ప్రజలు ఇక తనను, తన ప్రభుత్వాన్ని నమ్మడంలేదని గ్రహించి, చివ రకు ‘ఓడిపోయినా పరవాలేదు… సంతో షంగా దిగిపోతాను’ అనడం ఆయనలో పరాకాష్టకు చేరిన ఓటమి భయానికి నిదర్శనం అన్నారు.
ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న భయంతోనే..
ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే జగన్‌రెడ్డి,అనేకరకాలుగా అప్ర జాస్వామిక విధానాలకు పాల్పడుతున్నాడు. జగన్ అక్రమాల కారణంగానే ఈ ఏడాది జనవరి 5న రావాల్సిన ఓటర్‌జాబితా 22న విడుదలైంది. ఓటర్ల జాబితాలో ప్రభుత్వం అనేక అవకతవకలకు, అక్రమాలకు పాల్ప డిరదినేది వాస్తవం. ప్రజలు తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న భయంతోనే జగన్‌రెడ్డి చివరకు దొంగఓట్లను, నకిలీ ఓటర్లను నమ్ముకునే దుస్థితికి దిగజారాడని షరీఫ్ విమర్శించారు.
వివిధ వర్గాల ఆగ్రహం చవిచూడటం ఖాయం
మరోవైపు 42 రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్న లక్షా 05వేలకు పైగా ఉన్న అంగన్‌వాడీ సిబ్బంది, వారి కుటుంబాల ఆగ్రహం కూడా ముఖ్యమంత్రి కి బోధపడినట్లుంది. వారితో పాటు తాను సాగించిన ఇసుక దోపిడీలో సమిధ లుగా మారిన 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సహా, ఇతరత్రా వృత్తుల వారు జగన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారితోపాటు 3 లక్షల మంది పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ను మోసగించిన జగన్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి ఉగ్రరూపంతో ఎదురుచూస్తు న్నారు. అందరికంటే అధికంగా జగన్‌రెడ్డి నిర్వాకంతో మహిళలు దారుణంగా మోస పోయారు. ఇంటిని నడిపించాల్సిన గృహి ణులు సహా, విద్యార్థినులు.. యువతులు.. వృద్ధమహిళల వరకు అందరూ జగన్‌రెడ్డి బాధితులే. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళలను దారుణంగా మోసగించినందు కు రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి అతివల ఆగ్రహం చవిచూడటం ఖాయం. రుణ మాఫీ చేస్తాను, పావలావడ్డీ రుణ పరిమితి పెంచుతానని చెప్పి మోసగించాడన్న అక్క సుతో డ్వాక్రా మహిళలు కూడా జగన్ రెడ్డిపై కన్నెర్ర చేస్తున్నారని షరీఫ్ అన్నారు.
పట్టిపీడిస్తున్న భయానికి సంకేతాలు
ప్రజల సొమ్ముతో రాష్ట్రంలో చేసుకుం టున్న ప్రచారం చాలదన్నట్లు డబ్బులిచ్చి మరీ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌రెడ్డి మాట్లాడిన మాట లు ఆయన్ని పట్టిపీడిస్తున్న ఓటమి భయా నికి నిదర్శనం. త్వరలో రాష్ట్రంలో జరిగే ఎన్నికలు జగన్‌రెడ్డికి, వైసీపీకి చివరి ఎన్ని కలు. ఒక్క ఛాన్స్ అని గతంలో బతిమాలితే నమ్మి ప్రజలు అధికారమిచ్చారు. జగన్ రెడ్డికి జనం ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయి పోయింది. బటన్ నొక్కి మరీ ప్రజలకు సంక్షేమం అందించానని జగన్ చెప్పు కోవ డమే గానీ, ఆయన మోసకారి సంక్షేమంపై ప్రజలు సంతోషంగా లేరని కూడా తేలిపో యింది. వాస్తవాలన్నీ అర్థమయ్యే దేవుడిదే భారం… సంతోషంగా దిగిపోతాను అని వైరాగ్యంగా మాట్లాడుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల అప్పులభారం రాష్ట్రంపై వేసిన జగన్‌రెడ్డి, తమ సంపద పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించారు. కల్తీ మద్యం అమ్ము తూ వేలకోట్లు గడిరచిన జగన్‌రెడ్డి, అదే మద్యాన్ని అడ్డం పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నా డని షరీఫ్ ఆరోపించారు.
ప్రజల గురించి ఆలోచించడు
జగన్‌రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఆయన్ని నమ్మే స్థితిలో లేరు. ఏ రకంగా ప్రలోభ పెట్టినా, ఎంతగా ప్రాధే యపడినా, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదు. జగన్‌రెడ్డికి ఇంకా 70రోజుల సమయం ఉంది. చివరి ఘడియల్లో అధికారం అడ్డు పెట్టుకొని గడిరచిన లక్షలకోట్ల అవినీతి సొమ్ముని కాపాడుకోవడానికి జగన్‌రెడ్డి వెంపర్లాడతాడు తప్ప, ప్రజలు.. రాష్ట్రం గురించి ఆలోచించడని స్పష్టంగా చెప్ప గలం. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందన్న నమ్మకం తో ప్రజలు ఉన్నారని షరీఫ్ చెప్పారు.
విద్యారంగ ప్రమాణాలు దిగజార్చారు
జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడుల కు అంతేలేదు. ఆయా వర్గాల సంక్షేమా నికి వెచ్చించాల్సిన నిధుల్ని కూడా జగన్ దారి మళ్లించడంతో దళితులు, బడుగు బలహీన వర్గాలు జగన్‌రెడ్డికి తగిన శాస్తి చేసేందుకు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వసంస్థ ఆరా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 8వతరగతి విద్యార్థులు రెండో తరగతి లెక్కలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. కాదనలేని ఈ వాస్తవం జగన్ రెడ్డి నాడు-నేడు పేరుతో రాష్ట్ర విద్యా రంగాన్ని, విద్యా ప్రమాణాల్ని ఏ విధంగా దిగజార్చారో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోందని షరీఫ్ చెప్పారు.
జగన్ తప్ప ఆయన కుటుంబంలో ఎవరూ ఎదగకూడదా?
బాబాయ్‌కి మంత్రి పదవిచ్చి, తనకు పోటీగా తీసుకొచ్చారని జగన్‌రెడ్డి చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఆయన చెప్పిన బాబాయ్ గతిఏమైందో అందరం చూశాం. ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్‌ని చంపిన వారిని శిక్షించలేని స్థితిలో జగన్ ఉన్నాడంటే, బాబాయ్‌పై, ఆయన కుటుంబంపై ఎంత ప్రేమ ఉందో అక్కడే అర్థమవుతోంది. షర్మిల తెలంగాణ లో పార్టీపెట్టి, కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీ ఆమెను నమ్మి ఏపీ పగ్గాలు అప్పగించింది. రాజకీయం గా కాంగ్రెస్ విధానం అది. దానికి తెలు గుదేశంపార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబాన్ని విడదీసి నాపై పోటీ పెట్టారంటున్న జగన్ మాటలు వింటుంటే, రాజకీయాల్లో ఆయన తప్ప ఆయన కుటుంబ సభ్యులెవరూ ఎదగ కూడదనే వైఖరి కనిపిస్తోంది. ఎవరైనా ఆయన్ని కాదని ఎదగడానికి ప్రయత్నిస్తే, వారిపై జగన్‌రెడ్డి ఎదురుదాడి చేస్తాడా? కాంగ్రెస్‌పార్టీ నిర్ణయానికి కట్టుబడి షర్మిల ఎక్కడైనా పోటీచేయొచ్చు. అన్న పరిపాల న.. ముఖ్యంగా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన జగనరెడ్డి పాలనపై షర్మిల మాట్లా డుతోంది అంటే అవన్నీ ప్రజల ఆలోచన లు కాబట్టే. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీలోకి వెళ్లింది.జగన్‌రెడ్డి వైపు ఉన్న తమ ఓటు బ్యాంక్‌ను ఎలారాబట్టు కోవాలనే దాని పైనే కాంగ్రెస్ ఆలోచిస్తు న్నట్టు ఉంది. జగన్ కుటుంబం మధ్య చిచ్చుపెట్టాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు. 45 ఏళ్ల సుదీర్థ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పు డూ పద్ధతితో కూడిన, విలువలతో కూడి న రాజకీయాలే చేశారు తప్ప, ఎక్కడా తప్పుడు మార్గంలో వెళ్లలేదు. తన చెల్లి చేస్తున్న విమర్శలు ప్రజలు నమ్మకుండా చూడాలన్న దురుద్దేశంతోనే జగన్‌రెడ్డి చంద్రబాబుపేరు తీసుకొస్తున్నారు. అలా అనడం జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలో భాగమేనని షరీఫ్ స్పష్టం చేశారు.